Vivo X200: జీస్-పవర్డ్ లెన్స్ లతో.. వివో నుంచి మరో ప్రీమియం స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్
15 October 2024, 14:34 IST
Vivo X200: మరో ప్రీమియం స్మార్ట్ ఫోన్ సిరీస్ ను చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో తాజాగా లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ గురించి వివో చాన్నాళ్లుగా టీజ్ చేస్తోంది. ఇప్పుడు ఈ వివో ఎక్స్ 200 సిరీస్ కొన్ని ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్లు, ఫీచర్లతో లాంచ్ అయింది.
వివో ఎక్స్ 200 సిరీస్ స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్
Vivo X200: కొన్ని నెలల ఊహాగానాల తరువాత, వివో ఎట్టకేలకు తన ఫ్లాగ్ షిప్ వివో ఎక్స్ 200 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ను లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో వివో ఎక్స్ 200, వివో ఎక్స్ 200 ప్రో, వివో ఎక్స్ 200 ప్రో మినీ అనే మూడు మోడళ్లు ఉన్నాయి. ఈ మూడు మోడళ్లలొ కొత్త అడ్వాన్స్డ్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్ సెట్ ఉంటుంది. అలాగే, ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అనుభవం కోసం జీస్-పవర్డ్ లెన్స్ లను కలిగి ఉంటాయి. దీనికి తోడు ఈ కొత్త ఫ్లాగ్ షిప్ మోడళ్లకు వివో చాలా కాంపిటీటివ్ ధరను నిర్ణయించింది.
వివో ఎక్స్200 సిరీస్ డిస్ ప్లే
వివో ఎక్స్200 లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.67 అంగుళాల 1.5కే ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంటుంది. వివో ఎక్స్ 200 ప్రో స్మార్ట్ ఫోన్ లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.68 అంగుళాల 1.5కే ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంటుంది. ఈ రెండు మోడల్స్ డిస్ ప్లే పీక్ బ్రైట్ నెస్ 4500 నిట్స్ ఉంటుంది. ఈ రెండు మోడల్స్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్ సెట్, 16 జీబీ వరకు ర్యామ్, 1 టీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ను అందిస్తున్నారు.
వివో ఎక్స్200 సిరీస్ కెమెరా
వివో ఎక్స్ 200 స్మార్ట్ ఫోన్ లో సోనీ ఐఎంఎక్స్ 921 సెన్సార్, ఓఐఎస్ సపోర్ట్ తో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, సోనీ ఐఎంఎక్స్ 882 సెన్సార్ తో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. మరోవైపు, వివో ఎక్స్ 200 ప్రోలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, సోనీ ఎల్వైటి -818 సెన్సార్, ఓఐఎస్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 200 మెగాపిక్సెల్ జైస్ ఎపిఓ టెలిఫోటో లెన్స్ వి 3 + ఇమేజింగ్ చిప్ ఉన్నాయి. వివో ఎక్స్ 200, ఎక్స్ 200 ప్రో 5800 ఎంఏహెచ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కలిగి ఉన్నాయి.
వివో ఎక్స్ 200 ప్రో మినీ స్పెసిఫికేషన్లు
వివో (vivo)ఎక్స్ 200 ప్రో మినీ 6.3 అంగుళాల 1.5 కె ఓఎల్ఇడి ఎల్టిపిఓ డిస్ప్లేతో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. వివో ఎక్స్ 200 మినీలో కూడా మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్ సెట్ ఉటుంది. దాంతో పాటు 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ను అందిస్తున్నారు. సోనీ ఎల్వైటీ818తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ తో ట్రిపుల్ కెమెరా సిస్టమ్, 100 ఎక్స్ డిజిటల్ జూమ్ నను అందించే 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ ఉన్నాయి. ఇందులో 5700 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఈ మూడు మోడళ్లు ఆండ్రాయిడ్ 15 వెర్షన్ ఆధారంగా ఆరిజిన్ ఓఎస్ 5 పై పనిచేస్తాయి.
వివో ఎక్స్ 200 సిరీస్ ధర
వివో ఎక్స్ 200 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ను ప్రస్తుతానికి చైనా (china)లో లాంచ్ చేశారు. త్వరలో భారత్ తో పాటు గ్లోబల్ లాంచ్ ఉంటుందని కంపెనీ వెల్లడించింది. చైనాలో 12 జీబీ+256 జీబీ స్టోరేజ్ ఆప్షన్ తో లభించే వివో ఎక్స్ 200 ప్రారంభ ధర 4299 యువాన్లు (సుమారు రూ.51, 000) గా ఉంది. వివో ఎక్స్ 200 ప్రో 12 జిబి + 256 జిబి స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర 5299 యువాన్లుగా(సుమారు రూ.62850) ఉంది. చివరగా, వివో ఎక్స్ 200 ప్రో మినీ 12 జిబి + 256 జిబి స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర 4699 యువాన్లు (సుమారు రూ.55700)గా నిర్ణయించారు.