Smartphones Discount : 11 వేలలోపు ధరతో వివో, శాంసంగ్, మోటరోలా ఫోన్లు.. బంపర్ డిస్కౌంట్లు
Smartphones Discount Offers : తక్కువ ధరలో మంచి స్మార్ట్ ఫోన్ కొనాలి అనుకునేవారికి శుభవార్త. మీకోసం ఫ్లిప్‌కార్ట్ తక్కువ ధరలో ఫోన్ అందిస్తోంది. రూ.11వేలలోపు ధరతో వివో, శాంసంగ్, మోటరోలా ఫోన్లను పొందవచ్చు.
స్మార్ట్ ఫోన్ తీసుకోవాలి అనుకునేవారికి ఇది మంచి సమయం. ఎందుకంటే ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్‌ను పొడిగించింది. మీరు ఇప్పటికీ ఉత్తమ డిస్కౌంట్లతో టాప్ కంపెనీల ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. తక్కువ బడ్జెట్లో గొప్ప ఫీచర్లతో ఉన్న ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఈ సేల్‌లో మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. రూ.11,000 లోపు ధరలో లభించే మూడు మంచి ఫోన్ల గురించి చూద్దాం..
ఈ సేల్‌లో బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ బోనస్‌లతో కొనుగోలు చేయవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో లభించే డిస్కౌంట్ మీ పాత ఫోన్, బ్రాండ్, కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. డిస్కౌంట్‌తో వచ్చే ఫోన్ల గురించి చూద్దాం..
వివో టీ3 లైట్ 5జీ
4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,499గా ఉంది. డీల్ లో ఇస్తున్న బ్యాంక్ ఆఫర్‌లో ఈ ఫోన్ రూ.1,000 వరకు చౌకగా లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డును ఉపయోగించి ఫోన్ కొంటే 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఇది కాకుండా సేల్‌లో అన్ని బ్యాంక్ కార్డులపై రూ .625 తగ్గింపు కూడా లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో ఈ ఫోన్ రూ.8,450 వరకు చౌకగా లభిస్తుంది. ఫీచర్ల విషయానికొస్తే ఈ వివో ఫోన్లో మీరు 6.56 అంగుళాల డిస్‌ప్లేను పొందుతారు. ఫోన్‌లో ప్రాసెసర్‌గా డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ను కంపెనీ అందిస్తోంది. ఫోన్ ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్. సెల్ఫీల కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
మోటోరోలా జీ45 5జీ
4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999గా ఉంది. యాక్సిస్ బ్యాంక్ కార్డును ఉపయోగించి ఫోన్ కొంటే 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో ఈ ఫోన్‌పై రూ.8,050 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్‌లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల డిస్‌ప్లే లభిస్తుంది. స్నాప్ డ్రాగన్ 6ఎస్ జెన్ 3 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది. ఫోటోగ్రఫీ కోసం 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను కంపెనీ అందిస్తోంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌తో పనిచేస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ14 5జీ
6 జీబీ ర్యామ్ , 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఈ ఫోన్‌ను రూ.10,999కు కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డును ఉపయోగించి ఫోన్ కొంటే 5 శాతం క్యాష్ బ్యాక్ దొరుకుతుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో ఈ ఫోన్‌ను రూ.8,850 వరకు డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను కంపెనీ అందిస్తోంది. ఫోన్ ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్. సెల్ఫీల కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఎక్సినిస్ 1330 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది.