Vivo X100 launch : వివో ఎక్స్100 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే!
04 January 2024, 14:30 IST
Vivo X100 launch : వివో ఎక్స్100 సిరీస్ లాంచ్ అయ్యింది. ఇందులో ఎక్స్100, ఎక్స్100 ప్రో ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
వివో ఎక్స్100 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే!
Vivo X100 launch in India : వివో సంస్థ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ లాంచ్ అయ్యింది. దాని పేరు వివో ఎక్స్100 సిరీస్. ఇందులో రెండు గ్యాడ్జెట్స్ ఉన్నాయి. అవి.. వివో ఎక్స్100, ఎక్స్100 ప్రో. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
వివో ఎక్స్100 సిరీస్..
వివో ఎక్స్100 సిరీస్‌లోని గ్యాడ్జెట్స్‌లో.. మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ఎస్ఓసీ ప్రాసెసర్ ఉంటుంది. వాటర్, డస్ట్ రెసిస్టన్స్ దీని సొంతం. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ వీటిల్లో ఉంటుంది.
Vivo X100 price in India : 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ వివో ఎక్స్100 ప్రో ధర రూ.89,999గా ఉంది. వివో ఎక్స్100 12 జీబీ ర్యామ్- 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.63,999 కాగా, 16 జీబీ ర్యామ్- 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.69,999. ఎక్స్100 స్మార్ట్‌ఫోన్స్.. బ్లాక్, స్టార్గేజ్ బ్లూ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం ప్రీ-ఆర్డర్స్ మొదలయ్యాయి. జనవరి 11 నుంచి ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఆన్లైన్ స్టోర్, ఇతర రీటైల్ స్టోర్స్‌లో ఈ గ్యాడ్జెట్‌ని కొనుగోలు చేసుకోవచ్చు.
అంతేకాకుండా ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో ప్రీ బుకింగ్ చేసుకుంటే.. కస్టమర్లకు 10శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం కూడా ఉంది.
వివో ఎక్స్100 ప్రో ఫీచర్స్..
Vivo X100 pro price in India : వివో ఎక్స్100 ప్రో డ్యూయల్ సిమ్ (నానో) డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 14పై పనిచేస్తుంది. ఇందులో 6.78 ఇంచ్ అమోలెడ్ 8టీ ఎల్టీపీపీఓ కర్వ్డ్ డిస్ప్లే, 2160 హెచ్‌జెడ్ హై ఫ్రీక్వెన్సీ డిమ్మింగ్, 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఆక్టాకోర్ 4ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ఎస్ఓసీ, వివో వీ2 చిప్, 16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్ ఉన్నాయి.
కెమెరా విషయానికొస్తే.. ఎక్స్100 ప్రో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎమ్ఎక్స్ 989 1-ఇంచ్ టైప్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 50 మెగాపిక్సెల్ రిజల్యూషన్‌తో అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ రిజల్యూషన్ ఓఐఎస్తో జైస్ ఎపిఓ సూపర్-టెలిఫోటో కెమెరాను కలిగి ఉంటుంది. టెలిఫోటో కెమెరా 4.3 రెట్ల ఆప్టికల్ జూమ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రైమరీ, టెలిఫోటో కెమెరాలు రెండూ కూడా 100 ఎక్స్ డిజిటల్ జూమ్‌తో ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
Vivo X100 features : యూఎఫ్ఎస్ 4.0 ఇన్‌బిల్డ్ స్టోరేజ్, కనెక్టివిటీ ఫీచర్లు 5జీ, వై-ఫై 7, బ్లూటూత్, ఎన్ఎఫ్సీ, జీపీఎస్, నావిక్, ఓటీజీ, యూఎస్బీ టైప్-సీ పోర్టు ఉన్నాయి. ఎక్స్ 100 ప్రోలో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఇ-కంపాస్, గైరోస్కోప్, ఫ్లిక్కర్ సెన్సార్, మల్టీస్పెక్ట్రల్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ వంటి సెన్సార్లు ఉన్నాయి. 100వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్, 5,400 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ గ్యాడ్జెట్ బరువు 221 గ్రాములు.
వివో ఎక్స్100- ఫీచర్స్..
Vivo X100 Pro features : స్టాండర్డ్ వివో ఎక్స్100 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నట్టుగానే.. సిమ్, సాఫ్ట్వేర్, డిస్ప్లే స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. 4 ఎన్ఎమ్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ఎస్ఓసితో పనిచేసే ఈ ఫోన్.. 16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్ 5 ర్యామ్, వివో వి 2 చిప్, జీ 720 జీపీయూను అందిస్తుంది. జీస్ బ్రాండెడ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో.. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సోనీ ఐఎంఎక్స్ 920 విసిఎస్ బయోనిక్ మెయిన్ కెమెరా విత్ ఓఐఎస్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 100 ఎక్స్ క్లియర్ జూమ్‌తో 64 మెగాపిక్సెల్ సూపర్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 1 టీబీ వరకు స్టోరేజ్ ఆప్షన్ ఉంది. 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉన్న ఈ ఫోన్ వినియోగదారులకు అసాధారణ ఛార్జింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ ఎక్స్100 బరువు 220 గ్రాములు.