Vivo X100 : క్రేజీ ఫీచర్స్​తో వివో ఎక్స్​100 సిరీస్​ లాంచ్​.. ధర ఎంతంటే!-vivo x100 x100 pro launched check features and price details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Vivo X100 : క్రేజీ ఫీచర్స్​తో వివో ఎక్స్​100 సిరీస్​ లాంచ్​.. ధర ఎంతంటే!

Vivo X100 : క్రేజీ ఫీచర్స్​తో వివో ఎక్స్​100 సిరీస్​ లాంచ్​.. ధర ఎంతంటే!

Sharath Chitturi HT Telugu
Nov 14, 2023 12:01 PM IST

Vivo X100 : వివో ఎక్స్​100 సిరీస్​ని లాంచ్​ చేసింది స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ. ఈ సిరీస్​లోని వేరియంట్లు, వాటి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

వివో ఎక్స్​100, ఎక్స్​100 ప్రో లాంచ్​..
వివో ఎక్స్​100, ఎక్స్​100 ప్రో లాంచ్​..

Vivo X100 launch : వివో సంస్థ నుంచి సరికొత్త స్మార్ట్​ఫోన్​ సిరీస్​ బయటకొచ్చింది. ఈ సిరీస్​ పేరు వివో ఎక్స్​100. ఇందులో రెండు గ్యాడ్జెట్స్​ ఉన్నాయి. అవి వివో ఎక్స్​100, ఎక్స్​100 ప్రో. వీటిని చైనాలో తాజాగా లాంచ్​ చేసింది స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

వివో కొత్త స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్​ ఇవే..

వివో ఎక్స్​100, ఎక్స్​100 ప్రో స్లిమ్​ ప్రొఫైల్​ కలిగి ఉన్నాయి. రేర్​లోని కెమెరా మాడ్యూల్​కు సర్క్యులర్​ షేప్​ వచ్చింది. ఈ రెండు గ్యాడ్జెట్స్​లో.. కర్వ్​డ్​ ఎడ్జెస్​తో కూడిన 6.78 ఇంచ్​ అమోలెడ్​ స్క్రీన్​ వస్తోంది. 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​, హెచ్​డీఆర్​10+, 1.5కే రిసొల్యూషన్​ వంటివి వీటిల్లో ఉన్నాయి. ఇన్​-స్క్రీన్​ ఫింగర్​ప్రింట్​ స్కానర్​ సైతం లభిస్తోంది.

Vivo X100 price in India : ఈ స్మార్ట్​ఫోన్స్​లో కూడా 50ఎంపీ ప్రైమరీ, 50ఎంపీ అల్ట్రా-వైడ్​, 64ఎంపీ (ప్రో మోడల్​కు 50ఎంపీ) టెలిఫొటో కెమెరా సెటప్​ వస్తుంది. 3ఎక్స్​ ఆప్టికల్​ జూమ్​, 100ఎక్స్​ డిజిటల్​ జూమ్​లు లభిస్తున్నాయి. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం ఈ మొబైల్స్​లో 32ఎంపీ ఫ్రెంట్​ కెమెరా ఉంటుంది. 4కే వీడియోలు కూడా రికార్డు చేసుకోవచ్చు.

ఇక ఈ వివో ఎక్స్​100, ఎక్స్​100 ప్రోలో మీడియాటెక్​ డైమెన్సిటీ 9300 ఎస్​ఓసీ చిప్​సెట్​ వస్తోంది. ప్రో మోడల్​లో 16జీబీ ర్యామ్​- 1టీపీ యూఎఫ్​ఎస్​ 4 స్టోరేజ్​ లభిస్తోంది. స్టాండర్డ్​ మోడల్​లో 5000ఎంఏహెచ్​, ప్రో మోడల్​లో 5,400ఎంఏహెచ్​ బ్యాటరీలు ఉంటాయి. వీటికి.. 120వాట్​, 100వాట్​ వయర్డ్​ ఛార్జింగ్​ సపోర్ట్​ లభిస్తుంది. ఎక్స్​100 ప్రోకు 50వాట్​ వయర్​లెస్​ ఛార్జింగ్​ సపోర్ట్​ కూడా లభిస్తోంది. ఇక ఈ రెండు మోడల్స్​లో కూడా ఆండ్రాయిడ్​ 14 ఆధారిత ఆరిజిన్​ఓఎస్​ 4 వస్తోంది.

Vivo X100 pro price : వివో ఎక్స్​100 మోడల్స్​లో యూఎస్​బీ టైప్​ సీ జెన్​ 3.2 పోర్ట్​, వైఫై-7, 5జీ, ఎన్​ఎఫ్​సీ, బ్లూటూత్​ 5.3 వంటి కనెక్టివిటీ ఫీచర్స్​ వీటి సొంతం.

వివో కొత్త స్మార్ట్​ఫోన్స్​ ధరలు ఇవే..

వివో ఎక్స్​100, వివో ఎక్స్​100 ప్రోలో స్టార్​ ట్రైల్​ బ్లూ, సన్​సెట్​ ఆరెంజ్​, వైట్​ మూన్​లైట్​, చైనే బ్లాక్​ కలర్​ ఆప్షన్స్​ ఉన్నాయి. చైనాలో వీటి ధరల వివరాలు..

ఎక్స్​100 12జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​- 3,999 యువాన్​ (సుమారు రూ. 46,500)

Vivo X100 features : 16జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​- 4299 యువాన్​ (సుమారు రూ. 49,100).

16జీబీ ర్యామ్​- 512జీబీ స్టోరేజ్​ - 4,599 యువాన్​ (సుమారు రూ. 52,500).

16జీబీ ర్యామ్​- 1టీబీ స్టోరేజ్​- 4999 యువాన్​ (సుమారు రూ. 57,100).

16జీబీ ర్యామ్​- 1టీబీ ఎల్​పీడీడీఆర్​5టీ ర్యామ్​ టెక్నాలజీ- 5099 యువాన్​ (సుమారురూ. 59,300).

ఎక్స్​ 100 ప్రో ధరలు - 4,999 యువాన్​, 5299 యువాన్​, 5499 యువాన్​, 5999 యువాన్​.

వివో ఎక్స్​100 ప్రో+ కూడా ఉందా?

Vivo X100 pro plus : గతేడాది లాంచ్​​ అయిన వివో ఎక్స్​90 సిరీస్​లో ప్రో+ మోడల్​ కూడా ఉంది. కానీ తాజాగా లాంచ్​​ అయిన ఎక్స్​100 సిరీస్​లో ఈ వేరియంట్​​ కనిపించలేదు. అయితే.. ఈ వేరియంట్​ కూడా ఉందని, దీనిని కొన్ని నెలల తర్వాత లాంచ్​ చేయాలని సంస్థ ప్లాన్​ చేస్తోందట!

ఇక చైనాలో తాజాగా లాంచ్​ అయిన వివో ఎక్స్​100 సిరీస్​.. త్వరలోనే ఇండియాలో కూడా అడుగుపెట్టే అవకాశం ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం