తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Vivo T2 Pro 5g: వివో నుంచి మార్కెట్లోకి మరో కొత్త 5జీ ఫోన్; ధర కూడా అందుబాటు లోనే..

Vivo T2 Pro 5G: వివో నుంచి మార్కెట్లోకి మరో కొత్త 5జీ ఫోన్; ధర కూడా అందుబాటు లోనే..

HT Telugu Desk HT Telugu

23 September 2023, 20:00 IST

  • Vivo T2 Pro 5G: చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ వివో నుంచి మరో సరికొత్త ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఇది 5జీ ఫోన్. ఈ వివో టీ 2 ప్రొ 5 జీ లో పవర్ ఫుల్ మీడియా టెక్ డైమెన్సిటీ 7200 చిప్ సెట్ ను అమర్చారు.

వివో టీ 2 ప్రొ 5 జీ
వివో టీ 2 ప్రొ 5 జీ (Vivo)

వివో టీ 2 ప్రొ 5 జీ

Vivo T2 Pro 5G: చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం Vivo, తన సరికొత్త 5G హ్యాండ్‌సెట్, వివో టీ 2 ప్రొ 5 జీ (Vivo T2 Pro 5G), భారత మార్కెట్లోకి తీసుకు వచ్చింది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్‌సెట్‌, అమొలెడ్ డిస్‌ప్లే ఉంటాయి.

ట్రెండింగ్ వార్తలు

Motorola Edge 50 Fusion launch: ఇండియాలో మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ లాంచ్; స్పెసిఫికేషన్లు, ధర వివరాలు

IQOO Z9x 5G launch: ఐక్యూ జడ్9ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్; ధర, ఫీచర్స్ ఇవే..

Multibagger IPO: ‘నాలుగేళ్ల క్రితం ఈ ఐపీఓలో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసినవారు ఇప్పుడు కోటీశ్వరులయ్యారు..’

CIBIL score for car loan: కారు లోన్ తీసుకోవడానికి సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి?.. సిబిల్ లేకపోతే ఎలా?

Vivo T2 Pro 5G: ధర

వివో టీ 2 ప్రొ 5 జీ (Vivo T2 Pro 5G) రెండు వేరియంట్లలో వస్తుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీని అందించే బేస్ మోడల్ ధర రూ. 23,999. అయితే, టాప్-ఎండ్ వేరియంట్ 8GB RAM మరియు 256GB స్టోరేజ్‌తో వస్తుంది. ఇది రూ. 24,999లకు లభిస్తుంది. అంతేకాకుండా, కస్టమర్లు ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 2,000 ల తక్షణ తగ్గింపు లభిస్తుంది. అలాగే రూ. 1000 వరకు అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉంది. ఈ ఫోన్ సెప్టెంబర్ 29 నుంచి కంపెనీ అధికారిక వెబ్ సైట్, లేదా ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Vivo T2 Pro 5G: ఫీచర్స్..

వివో టీ 2 ప్రొ 5 జీ 120 హెర్జ్స్ రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల ఫుల్ హెచ్ డీ + అమొలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో 1300 నిట్స్ మాగ్జిమం బ్రైట్ నెస్ ను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ కర్వ్డ్ అమొలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్‌సెట్‌ ను అమర్చారు. రూ. 25 వేల లోపు సెగ్మెంట్లో ఈ ఫోన్ అత్యంత అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్న ఫోన్ గా పేరు తెచ్చుకుంది. గేమింగ్ ఫీచర్స్ కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి.

Vivo T2 Pro 5G: బ్యాటరీ..

వివో టీ 2 ప్రొ 5 జీ ఫోన్ లో 66 వాట్ ల ఫాస్ట్ చార్జింగ్ ఫెసిలిటీ ఉన్న 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీని ద్వారా కేవలం 22 నిమిషాల్లోనే జీరో నుంచి 50 శాతం చార్జింగ్‌ చేయవచ్చు. అంతేకాకుండా, ఈ బ్యాటరీ సింగిల్ చార్జింగ్ తో 56.85 గంటల వరకు మ్యూజిక్ ప్లే బ్యాక్‌ను కూడా అందించగలదని వివో చెబుతోంది.

Vivo T2 Pro 5G: కెమెరా

వివో టీ 2 ప్రొ 5 జీ ఫోన్ లో 64MP ప్రైమరీ కెమెరా ఉంది. ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ కెమెరా సిస్టమ్ నైట్ మోడ్, పనోరమా, టైమ్-లాప్స్ వీడియో, డ్యూయల్ వ్యూ, పోర్ట్రెయిట్ మరియు స్లో మోషన్‌తో సహా అనేక మోడ్‌లను సపోర్ట్ చేస్తుంది.

తదుపరి వ్యాసం