తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Twitter Blue: ‘ట్విట్టర్ బ్లూ’ ఇండియాలో లాంచ్.. సబ్‍స్క్రిప్షన్ ధర ఎంతంటే! మీరూ బ్లూ టిక్ పొందొచ్చు

Twitter Blue: ‘ట్విట్టర్ బ్లూ’ ఇండియాలో లాంచ్.. సబ్‍స్క్రిప్షన్ ధర ఎంతంటే! మీరూ బ్లూ టిక్ పొందొచ్చు

09 February 2023, 12:12 IST

    • Twitter Blue launched in India: ట్విట్టర్ బ్లూ సబ్‍స్క్రిప్షన్ సర్వీస్ ఇండియాలో లాంచ్ అయింది. దీని ద్వారా మీరు కూడా ట్విట్టర్‌లో బ్లూటిక్ పొందవచ్చు. మరిన్ని ఫీచర్లు కూడా అదనంగా లభిస్తాయి.
Twitter Blue: ‘ట్విట్టర్ బ్లూ’ ఇండియాలో లాంచ్.. సబ్‍స్క్రిప్షన్ ధర ఎంతంటే!
Twitter Blue: ‘ట్విట్టర్ బ్లూ’ ఇండియాలో లాంచ్.. సబ్‍స్క్రిప్షన్ ధర ఎంతంటే!

Twitter Blue: ‘ట్విట్టర్ బ్లూ’ ఇండియాలో లాంచ్.. సబ్‍స్క్రిప్షన్ ధర ఎంతంటే!

Twitter Blue launched in India: ప్రీమియమ్ సబ్‍స్క్రిప్షన్ సర్వీస్ అయిన ‘ట్విట్టర్ బ్లూ’ (Twitter Blue) ను ఎట్టకేలకు ఇండియాలో లాంచ్ చేసింది ట్విట్టర్ (Twitter). ఇంతవరకు కొన్ని దేశాల్లో మాత్రం అందుబాటులో ఉన్న ఈ సర్వీస్‍ను ఇప్పుడు ఇండియాలోని యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఈ సబ్‍స్క్రిప్షన్ తీసుకుంటే ట్విట్టర్ బ్లూ టిక్‍ (Twitter Blue Tick)తో పాటు చాలా ఫీచర్లను యూజర్లు వాడుకోవచ్చు. ట్విట్టర్ బ్లూ సబ్‍స్క్రిప్షన్ ధర (Twitter Blue Price) ఇండియాలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్ యూజర్లకు నెలకు రూ.900గా ఉంది. అంటే మొబైల్‍లో యాప్‍లో ట్విట్టర్ వాడే వారు బ్లూ సర్వీస్ కోసం నెలకు రూ.900 చెల్లించాల్సి ఉంటుంది. ట్విట్టర్ వెబ్‍ యూజర్లకు నెలకు రూ.650గా బ్లూ సబ్‍స్క్రిప్షన్ ధర ఉంది. ట్విట్టర్ వెబ్ యూజర్లు అంటే యాప్‍లో కాకుండా వెబ్‍సైట్‍లో వాడే వారు. వెబ్ యూజర్ల కోసం బ్లూ సబ్‍స్క్రిప్షన్ వార్షిక ప్లాన్‍ను కూడా ట్విట్టర్ తీసుకొచ్చింది. దీని ద్వారా కొంత ఆదా చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇవే. పూర్తి వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

Gold and silver prices today : స్థిరంగా పసిడి, వెండి ధరలు.. మీ నగరాల్లో నేటి రేట్లు ఇలా..

Replacing smart phone: మీ స్మార్ట్ ఫోన్ ను ఎప్పుడు రీప్లేస్ చేయాలంటే?.. మీ ఫోన్ ఇచ్చే సిగ్నల్స్ ఇవే..

Air India Cabin Baggage: అలర్ట్.. క్యాబిన్ బ్యాగేజ్ పరిమితిని తగ్గించిన ఎయిర్ ఇండియా..

Kotak Bank Q4 results: క్యూ 4 లో కొటక్ మహీంద్ర బ్యాంక్ నికర లాభాలు రూ. 4,133 కోట్లు; వృద్ధి 18 శాతం..

వార్షిక ప్లాన్

Twitter Blue annual Plan: వెబ్ యూజర్లకు ట్విట్టర్ బ్లూ సబ్‍స్క్రిప్షన్ వార్షిక ప్లాన్ ధర రూ.6,800గా ఉంది. సాధారణంగా నెలకు రూ.650 చొప్పున లెక్కేసుకుంటే సంవత్సరానికి రూ.7,800 అవుతుంది. అంటే వెబ్ యూజర్లు వార్షిక ప్లాన్ తీసుకుంటే నెలకు రూ.566 ఖర్చవుతుంది. సంవత్సరానికి రూ.1,000 ఆదా చేసుకోవచ్చు.

Twitter Blue: ఫీచర్లు..

Twitter Blue launched in India: ట్విట్టర్ బ్లూ సబ్‍స్క్రిప్షన్ తీసుకుంటే బ్లూ టిక్, ఎడిట్ ట్వీట్స్, ఎక్కువ నిడివి గల వీడియోలు పోస్ట్ చేయడం, ఆర్గనైజ్డ్ బుక్‍మార్కులు, కస్టమ్ యాప్ ఐకాన్స్, ప్రత్యేకమైన థీమ్స్, ఎన్ఎఫ్‍టీలను ప్రొఫైల్ పిక్చర్లుగా మార్చుకోవడం లాంటి ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి.

Twitter Blue: బ్లూటిక్ పొందొచ్చు..

Twitter Blue launched in India: గతంలో సెలెబ్రిటీలు, ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలు, కంపెనీలు, ప్రముఖులు, మీడియా సంస్థలతో పాటు వెరిఫైడ్ అకౌంట్లకు మాత్రమే బ్లూటిక్ ఉండేది. అయితే టెస్లా బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk).. ట్విట్టర్‌ను చేజిక్కించుకున్నాక కొత్త రూల్ తెచ్చారు. దీంతో ట్విట్టర్ బ్లూ సబ్‍స్క్రిప్షన్ తీసుకున్న వారందరి అకౌంట్లకు బ్లూటిక్ ఉంటుంది. బ్లూ సబ్‍స్క్రిప్షన్ తీసుకుంటే ట్విట్టర్‌లో మీ పేరు పక్కన బ్లూ టిక్ కనిపిస్తుంది.

పోస్ట్ చేసిన తర్వాత ఎడిట్ చేసుకునేలా ఎడిట్ ట్వీట్ ఆప్షన్ కూడా ఈ సబ్‍స్క్రిప్షన్ ద్వారా లభిస్తుందని ట్విట్టర్ పేర్కొంది.