తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tvs Apache Rtr 310 : టీవీఎస్​ అపాచీ ఆర్​టీఆర్​ 310 ప్రీ బుకింగ్స్​ షురూ..!

TVS Apache RTR 310 : టీవీఎస్​ అపాచీ ఆర్​టీఆర్​ 310 ప్రీ బుకింగ్స్​ షురూ..!

Sharath Chitturi HT Telugu

26 August 2023, 7:13 IST

    • TVS Apache RTR 310 : టీవీఎస్​ అపాచీ ఆర్​టీఆర్​ 310 ప్రీ బుకింగ్స్​ మొదలయ్యాయి. బైక్​ లాంచ్​తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
టీవీఎస్​ అపాచీ ఆర్​టీఆర్​ 310
టీవీఎస్​ అపాచీ ఆర్​టీఆర్​ 310

టీవీఎస్​ అపాచీ ఆర్​టీఆర్​ 310

TVS Apache RTR 310 bookings : టీవీఎస్​ అపాచీ ఆర్​టీఆర్​ 310 బైక్​ లాంచ్​కు సిద్ధమవుతోంది. సెప్టెంబర్​ 6న ఈ మోడల్​ సేల్​కు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఈ బైక్​ ప్రీ బుకింగ్స్​ను తాజాగా మొదలుపెట్టింది టీవీఎస్​ మోటార్స్​. రూ. 3,100 టోకెన్​ అమౌంట్​తో ఈ వెహికిల్​ను బుక్​ చేసుకోవచ్చు.

కొత్త బైక్​ ఎలా ఉంటుంది..?

ఈ ఆర్​టీఆర్​ 310.. అపాచీ ఆర్​టీఎక్స్​ 310 అని కూడా పిలుస్తోంది టీవీఎస్​. బైక్​కు సంబంధించిన టీజర్స్​ను సైతం విడుదల చేసింది. ఈ వెహికిల్ ఛాసిస్​, మెకానిక్స్​​.. టీవీఎస్​ అపాచీ ఆర్​ఆర్​ 310ని పోలి ఉన్నాయి. డిజైన్​ కాస్త మారింది. కొత్త బైక్​కు స్ల్పిట్​​ ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్​ సెటప్​, గోల్డ్​ ఫినీష్డ్​ ఫ్లాట్​ హ్యాండిల్​బార్​, షార్ప్​-మస్క్యులర్​ డిజైన్​తో కూడిన ఫ్యూయెల్​ ట్యాంక్​ వంటివి వస్తున్నాయి. స్ప్లిట్​ సీట్​ సెటప్​ కూడా లభిస్తోంది. ఎల్​ఈడీ టెయిల్​లైట్స్​కి కూడా స్ల్పిట్​ డిజైన్​ దక్కింది.

TVS Apache RTR 310 launch : ఇక ఈ టీవీఎస్​ అపాచీ ఆర్​టీఆర్​ 310లో అడ్జెస్టెబుల్​ యూఎస్​డీ ఫ్రెంట్​ ఫోర్క్స్, రేర్​లో మోనోషాక్​ అబ్సార్బర్​ యూనిట్​ వంటివి వస్తున్నాయి. పెటల్​ టైప్​ డిస్క్​ బ్రేక్స్​, డ్యూయెల్​ ఛానెల్​ ఏబీఎస్​​లు స్టాండర్డ్​గా ఉంటాయని సమాచారం. ట్రాక్షన్​ కంట్రోల్​ యూనిట్​, క్విక్​షిఫ్టర్​, అసిస్ట్​, స్లిప్పర్​ క్లచ్​తో పాటు ఇతర ఎలక్ట్రానిక్​ ఆప్షన్స్​ కూడా ఈ బైక్​లో ఉండే అవకాశం ఉంది.

ఇదీ చూడండి:- TVS e-scooter ‘X’: టీవీఎస్ నుంచి కొత్త ఈ స్కూటర్ ‘ఎక్స్’; రేంజ్ 140 కిమీ.. ధర మాత్రం..?

ఈ మోడల్​లో 312సీసీ రివర్స్​ ఇంక్లైన్డ్​, సింగిల్​ సిలిండర్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 33 బీహెచ్​పీ పవర్​ను, 27.3 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. అపాచీ ఆర్​ఆర్​ 310లో కూడా ఇదే ఇంజిన్​ ఉంటుంది. కొత్త బైక్​లో నాలుగు రైడింగ్​ మోడ్స్​ ఉండొచ్చు. అవి.. అర్బన్​, రెయిన్​, స్పోర్ట్​, ట్రాక్​. ఇది.. 0-60కేఎంపీహెచ్​ను 2.9 సెకన్లలో అందుకుంటుంది, దీని టాప్​ స్పీడ్​ 160 కేఎంపీహెచ్​ అని తెలుస్తోంది.

TVS Apache RTR 310 teaser : టీవీఎస్​ అపాచీ ఆర్​టీఆర్​ 310 ధరపై క్లారిటీ లేదు. కాగా.. దీని ఎక్స్​షోరూం ధర రూ. 2.65లక్షలుగా ఉండొచ్చని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి. ఇతర ఫీచర్స్​ వివరాలు కూడా తెలియాల్సి ఉంది.

లాంచ్​ తర్వాత.. ఈ అపాచీ ఆర్​టీఆర్​ 310.. బీఎండబ్ల్యూ జీ 310ఆర్​, కేటీఎం 390 డ్యూక్​, ట్రయంఫ్​ స్పీడ్​ 400 వంటి మోడల్స్​కు గట్టిపోటీనిస్తుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

తదుపరి వ్యాసం