Sporty Bikes : బడ్జెట్ రేంజ్లో మీరు మెచ్చే స్పోర్టీ లుక్ బైకులు.. 40 కి.మీ మైలేజీ
14 October 2024, 20:00 IST
- Sports Bikes Under 2 Lakhs : బడ్జెట్ ధరలో స్పోర్టీ రైడ్ కోసం కోసం చాలామంది వెతుకుతారు. మిడిల్ క్లాస్ వాళ్లకి సరిపోయే రేంజ్లో కొన్ని స్పోర్ట్స్ బైకులు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం..
పల్సర్ ఎన్ఎస్ 200
ఇండియాలో కొన్నేళ్లుగా స్పోర్ట్స్ బైకులకు డిమాండ్ పెరుగుతోంది. వీటిని రైడ్ చేసేవారి సంఖ్య కూడా పెరుగుతుంది. చాలా మంది యువత ఈ బైకులను ఇష్టపడుతారు. అయితే బడ్జెట్ రేంజ్లో స్పోర్టీ లుక్ లో ఉంటే తీసుకునేందుకు ఆసక్తిగా ఉంటుంది. బజాజ్, యమహా, హోండా, టీవీఎస్లాంటి ప్రముఖ బ్రాండ్లు భారతదేశంలో టాప్ స్పోర్టీ, ఎకనామిక్ కమ్యూటర్ బైకులను అందిస్తున్నాయి. వీటి ధర, మైలేజీ, ఫీచర్ల గురించి చూద్దాం..
పల్సర్ ఎన్ఎస్200
పల్సర్ ఎన్ఎస్200 బైకుకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సూపర్ బైక్ లీటరుకు 40.36 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఇందులోని 199.5సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ 24బిహెచ్పీ పవర్, 18.74ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి అవుతుంది. ఈ స్పోర్టీ కమ్యూటర్ బైక్ ధర రూ.1.54 లక్షలుగా ఉంది. ఫ్రంట్‌లో యూఎస్డీ ఫోర్క్, 300ఎంఎం డిస్క్ బ్రేక్, నిట్రోక్స్ మోనోషాక్, వెనుక 230ఎంఎం డిస్క్ బ్రేక్ వస్తాయి.
కేటీఎం 200 డ్యూక్
కేటీఎం 200 డ్యూక్ ధర రూ.1.98 లక్షలు(ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఈ బైక్ 35 కేఎంపీఎల్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. 24 బిహెచ్పీ, 19.3 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 199.5 సిసి లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌తో నడుస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అమర్చబడి ఉంటుంది.
యమహా ఎంటీ 15 2.0
ఈ యమహా బైక్ 47.94 kmpl మైలేజీని అందజేస్తుంది. దీని ప్రారంభ ధర రూ.1.68 లక్షలుగా ఉంది. 18 బీహెచ్పీ, 14.1 Nm టార్క్ ఉత్పత్తి అవుతుంది. 155సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో ఇది వస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఉంటుంది.
హోండా హార్నెట్ 2.0
హోండా హార్నెట్ 2.0 బైక్‌ను చాలామంది ఇష్టపడుతారు. ఇది లీటరుకు 42.3 కి.మీ మైలేజీ వరకు ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ బైక్‌లో 184సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ 17బిహెచ్పీ పవర్, 15.9ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్‌తో వస్తుంది. ఫైవ్ స్పీడ్ గేర్‌బాక్స్‌ను ఉంటుంది. హోండా హార్నెట్ ఫ్రంట్ 276ఎం.ఎం డిస్క్ బ్రేక్‌తో యూఎస్డీ ఫోర్క్, వెనుకవైపు 220ఎంఎం డిస్క్ బ్రేక్‌తో మోనోషాక్‌తో వస్తుంది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ రూ.1.40 లక్షలుగా ఉంటుంది.
టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వి
టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వి బైక్ ధర రూ.1.48 లక్షలుగా ఉంది. ఇది ఎక్స్-షోరూమ్ ధర అని గుర్తుంచుకోవాలి. ఈ టూ వీలర్ లీటరుకు 41.9 కిమీ మైలేజీ వరకు వస్తుంది. ఇందులో 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది. 197.8సీసీ ఆయిల్ కూల్డ్ ఇంజన్ 20బిహెచ్పీ పవర్, 17.25ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి అవుతుంది.