Cars Under 6L : 25 కి.మీ వరకు మైలేజీని ఇచ్చే ఆరు లక్షల రూపాయల ధరలోపు ఉన్న కార్లు
06 October 2024, 21:00 IST
- Cars Under 6L : తక్కువ ధరలో కారు కొనాలి అనుకుంటున్నారా? మంచి మేలేజీ కోసం కూడా చూస్తున్నారా? అయితే మీకోసం కొన్ని కార్లు ఉన్నాయి. ఆరు లక్షల రూపాయల ధరలోపు ఉన్న కార్ల గురించి తెలుసుకుందాం..
మారుతి సుజుకీ స్విఫ్ట్
కారు కొనేముందు ధరను చెక్ చేయడం అలవాటు. అయితే ఎక్కువ ధరపెట్టి.. తక్కువ మైలేజీ కారు కొంటే మధ్యతరగతివారికి కుదరదు. తక్కువ ధరలో మేలేజీ, సేఫ్టీని కూడా చూసుకోవాలి. ఇప్పుడు కొత్త కార్ల కొనుగోలుదారులు భద్రత, నాణ్యతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వీటితో పాటు మైలేజీకి కూడా ప్రాధాన్యత ఉంటుంది. కొనుగోలు నిర్ణయంలో ధర ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. తక్కువ ధరలో మైలేజీ ఇచ్చే కార్లు చాలానే ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో కార్లు కొనాలి అనుకునే మిడిల్ క్లాస్ వాళ్లకి ఇవి బెస్ట్ ఆప్షన్. వీటి ధర కూడా రూ.6 లక్షల లోపు ఉంటుంది. అలాంటి కార్ల గురించి తెలుసుకోండి..
మారుతి సుజుకి వ్యాగన్ఆర్
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ సీఎన్‌జీ వేరియంట్‌తో సహా మూడు ఇంజన్ ఎంపికలతో వస్తుంది. ఇందులో అత్యధిక మైలేజ్ వేరియంట్ 25.29 kmpl ఇస్తుంది. వ్యాగన్ R శ్రేణి ధరలు రూ. 5.45 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి.
మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో
మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో సహజంగా ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇంధన సామర్థ్యం పరంగా, మారుతి సుజుకి S ప్రెస్సో 24.12 kmpl మైలేజీని అందిస్తుంది. దీని ధరలు రూ. 4.26 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి మెుదలవుతుంది.
మారుతి సుజుకి స్విఫ్ట్
మారుతి సుజుకి స్విఫ్ట్ 1.2-లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ కారు 22.56 kmpl మైలేజీని ఇస్తుంది. మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ధర రూ.5.99 లక్షల ఎక్స్-షోరూమ్‌గా ఉంది.
మారుతి సుజుకి సెలెరియో
వ్యాగన్ ఆర్‌లాగా మారుతి సుజుకి సెలెరియో కూడా 24.97 kmpl మైలేజీని అందిస్తుంది. కొత్త మారుతి సుజుకి సెలెరియో హ్యాచ్‌బ్యాక్ ధర రూ. 5.36 లక్షలు, ఎక్స్-షోరూమ్ ధర ఇది. ఈ కారు మారుతి సుజుకికి చెందిన బెస్ట్ సెల్లింగ్ కారు లిస్టులో కూడా ఉంది.
రెనాల్ట్ క్విడ్
రెనాల్ట్ క్విడ్ 1.0-లీటర్, 3-సిలిండర్, సహజంగా-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. కంపెనీ ప్రకారం క్విడ్ 22.30 kmpl మైలేజీని అందిస్తుంది. ఈ మోడల్ ధర రూ.4.69 లక్షలు, ఎక్స్-షోరూమ్ ఇండియా.
టాపిక్