తెలుగు న్యూస్  /  బిజినెస్  /  వానాకాలంలో డ్రైవింగ్‌కు ఈ కార్లు సూపర్.. బడ్జెట్ ధరలోనే.. మంచి మైలేజీ

వానాకాలంలో డ్రైవింగ్‌కు ఈ కార్లు సూపర్.. బడ్జెట్ ధరలోనే.. మంచి మైలేజీ

Anand Sai HT Telugu

01 August 2024, 10:18 IST

google News
    • Monsoon Car Driving : వర్షకాలంలో కారులో వెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే బురదతోపాటు వానాకాలంలో అనేక సమస్యలు వస్తాయి. అందుకే కారు సస్పెన్షన్ చుసుకోవాలి. వానాకాలం డ్రైవింగ్‌కు బాగుండే కొన్ని కార్లు చూద్దాం..
మహీంద్రా థార్
మహీంద్రా థార్

మహీంద్రా థార్

వానాకాలంలో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించాలంటే ఇబ్బందే. వర్షం పడుతుంతే ముందుకు కదల్లేం. అందుకే చాలా మంది కారును ఎంచుకుంటారు. వర్షాల సమయంలోనే కాకుండా శీతాకాలం, వేసవి కాలంలో కూడా ప్రయాణికులకు రక్షణగా ఉంటాయి. అయితే వానాకాలంలో బురద, ఇతర సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. అలాంటి సమస్యల నుంచి బయపడేందుకు కొన్ని ఉత్తమమైన కార్లు ఉన్నాయి. బడ్జెట్ ధరలో మంచి మైలేజీ, ఆకర్షణీయమైన ఫీచర్లతో కూడిన కారును కొనుగోలు చేయాలని చూస్తే మీకోసం లిస్ట్ ఉంది. చెక్ చేయండి.

మహీంద్రా థార్

ఇది ఆఫ్-రోడ్ SUV. ఇది 3-డోర్ ఆప్షన్‌లో లభిస్తుంది. రూ.11.35 లక్షల నుండి రూ.17.60 లక్షల ఎక్స్-షోరూమ్ ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇందులో 2-లీటర్ టర్బో పెట్రోల్, 2.2-లీటర్ డీజిల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్లు ఉన్నాయి. ఇది 13 నుండి 15.2 kmpl మైలేజీని అందిస్తుంది. కొత్త 3-డోర్ థార్‌లో, 4 మంది సుదూర పట్టణాలకు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, మాన్యువల్ ఏసీ వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం, ఇది డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ పొందుతుంది. మహీంద్రా థార్ రాక్స్ 5-డోర్ ఆగస్ట్ 15న విడుదల అవుతుంది.

కియా సెల్టోస్

దేశీయ మార్కెట్లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్న ప్రముఖ SUVలలో సెల్టోస్ ఒకటి. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.10.90 లక్షల నుండి రూ.20.37 లక్షల మధ్య ఉంటుంది. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. 17 నుండి 20.7 kmpl మైలేజీని ఇస్తుంది. 10.25-అంగుళాల డ్యూయల్ డిస్‌ప్లేతో సహా పలు ఫీచర్లను అందిస్తుంది.

మారుతీ సుజుకి జిమ్నీ

ఈ 5-డోర్ల ఆఫ్-రోడ్ SUV ధర రూ. 12.74 లక్షల నుండి రూ. 14.95 లక్షల ఎక్స్-షోరూమ్ వరకు ఉంది. ఇది 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో 16.94 kmpl మైలేజీని ఇస్తుంది. ఇది 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే వంటి వివిధ ఫీచర్లను కలిగి ఉంది. నలుగురు హాయిగా కూర్చోవచ్చు.

ఎంజీ హెక్టర్

ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.13.99 లక్షల నుండి రూ.22.24 లక్షలు. ఇది 1.5-లీటర్ టర్బో పెట్రోల్, 2-లీటర్ డీజిల్ ఇంజన్ ఎంపికలను కలిగి ఉంది. ఇవి 15.58 kmpl మైలేజీని ఇస్తుంది. 14-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో Android Auto, Apple CarPlay వంటి డజన్ల కొద్దీ ఫీచర్లు ఉంటాయి.

ఫోర్స్ గూర్ఖా

ఇది ఒక ప్రసిద్ధ ఆఫ్-రోడ్ SUV. 3-డోర్, 5-డోర్ వేరియంట్‌లలో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.16.75 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇందులో 2.6-లీటర్ డీజిల్ ఇంజన్ కలదు, ఇది 15 kmpl మైలేజీని అందిస్తుంది. ఇది 9-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో సహా అనేక లక్షణాలను పొందుతుంది.

తదుపరి వ్యాసం