తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Budget Phones : 15 వేల రూపాయలలోపు ఫోన్లు.. 108 ఎంపీ కెమెరాతోపాటు మరిన్ని మంచి ఫీచర్లు

Budget Phones : 15 వేల రూపాయలలోపు ఫోన్లు.. 108 ఎంపీ కెమెరాతోపాటు మరిన్ని మంచి ఫీచర్లు

Anand Sai HT Telugu

02 September 2024, 17:33 IST

google News
  • Budget Phones Under 15k : బడ్జెట్ ధరలో ఫోన్లు తీసుకోవాలి అనుకుంటే ఈ వార్త మీ కోసమే. 15 వేల రూపాయల లోపు టాప్ 3 ఫోన్లు ఉన్నాయి. 108 ఎంపీ వరకు అద్భుతమైన కెమెరా సెటప్‌తో ఎన్నో గొప్ప ఫీచర్లు ఈ ఫోన్లలో చూడవచ్చు. ఆ ఫోన్లు ఏంటో చూద్దాం..

ప్రతీకాత్మక ఫొటో
ప్రతీకాత్మక ఫొటో

ప్రతీకాత్మక ఫొటో

ఈ ఏడాది చాలా స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి ప్రవేశించాయి. మీరు కొత్తగా ఫోన్ కొనాలి అనుకుంటే ఎలాంటి ఫోన్ కొనాలో అన్ని వివరాలు తెలుసుకోవాలి. మార్కెట్లో మంచి మంచి ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అదే సమయంలో బడ్జెట్ తక్కువగా ఉన్నా ఏం పర్లేదు. రూ.15,000 లోపు టాప్ 3 స్మార్ట్ఫోన్ల గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్లలో అనేక ఫీచర్లను చూడవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం.

పోకో ఎం6 ప్లస్ 5జీ

ఫోన్ ధర ఫ్లిప్ కార్ట్‌లో రూ.12,999గా ఉంది. ఈ ఫోన్‌లో మీరు 6.79 అంగుళాల ఫుల్ హెచ్‌డీ + డిస్‌ప్లేను చూడవచ్చు. ఈ ఫోన్లో 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించారు. ఇందులో 8 జీబీ వరకు వర్చువల్ ర్యామ్ ఉంది. దీంతో ఫోన్ మొత్తం ర్యామ్ 16 జీబీకి పెరిగింది. ఫోటోగ్రఫీ కోసం ఫోన్ వెనుక భాగంలో ఎల్ఈడీ ఫ్లాష్‌తో రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్లో 5030 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఈ బ్యాటరీ 33 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

వివో టీ3ఎక్స్ 5జీ

ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్‌లో రూ.13,499కు అందుబాటులో ఉంది. ఈ ఫోన్లో 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను కంపెనీ అందిస్తోంది. ఈ డిస్‌ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్‌గా స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 చిప్ సెట్‌ను కంపెనీ ఫోన్‌లో అందిస్తోంది. ఫొటోగ్రఫీ కోసం ఈ ఫోన్లో ఎల్ఈడీ ఫ్లాష్‌తో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ లభిస్తుంది. సెల్ఫీల కోసం ఈ ఫోన్ ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. మంచి సౌండ్ కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్ సెటప్ ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 15 5జీ

4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999గా ఉంది. ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్‌ను చూడొచ్చు. ఈ ఫోన్‌లో ఇచ్చిన సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే 6.5 అంగుళాలు. ఫోటోగ్రఫీ కోసం ఫోన్ వెనుక భాగంలో ఎల్ఈడీ ఫ్లాష్‌తో మూడు కెమెరాలను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగా పిక్సెల్.

తదుపరి వ్యాసం