Photography destinations: మంచి ఫోటోగ్రఫీ లొకేషన్ల కోసం వీక్షించదగ్గ.. ఉత్తమ ప్రదేశాలివే..-top destinations in india that offer stunning photographic opportunities ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Photography Destinations: మంచి ఫోటోగ్రఫీ లొకేషన్ల కోసం వీక్షించదగ్గ.. ఉత్తమ ప్రదేశాలివే..

Photography destinations: మంచి ఫోటోగ్రఫీ లొకేషన్ల కోసం వీక్షించదగ్గ.. ఉత్తమ ప్రదేశాలివే..

Published Jul 13, 2023 09:18 PM IST HT Telugu Desk
Published Jul 13, 2023 09:18 PM IST

Photography destinations: మన దేశంలో తప్పకుండా చూడదగ్గ ప్రాంతాలు, ముఖ్యంగా ఫోటోగ్రఫీకి ఉత్తమమైన ప్రదేశాలేంటో చూద్దాం. 

భారతదేశం, దాని విస్తారమైన ప్రకృతి దృశ్యాలు, సంస్కృతి, నిర్మాణ అద్భుతాలతో, ఫోటోగ్రాఫర్లకు ఉత్తమ ప్రదేశాలెన్నో ఇక్కడ ఉన్నాయి. మనదేశంలో అత్యంత ఆకర్షణీయమైన ఫోటోగ్రాఫిక్ స్పాట్ల గురించి తెలుసుకుందాం. ఈ ప్రదేశాల్లో ప్రతి ఫ్రేమ్ ఒక కథను చెబుతుంది.

(1 / 8)

(Aditya Siva on Unsplash )

వారణాసి లేదా కాశి: ట్రావెల్ ఫోటోగ్రాఫర్లను ఆకర్షించడంలో ఇది ఉత్తమ నగరం. రంగురంగుల ప్రదేశాల నుంచి, పురాతన అందాలు, నది ఒడ్డున ఆచరించే పూజలు, ఆచారాలు, గంగానది వెంబడి సుందరమైన పడవ ప్రయాణాలు అంతులేని ఫొటోగ్రాఫిక్ అవకాశాలు అందిస్తాయి. ఇక్కడి ఖాళీ వీధులని మీ లెన్సుల్లో బంధించడానికి ఉదయాన్నే మేల్కొనాల్సిందే. ఇది ఫొటోగ్రాఫర్లకు స్వర్గధామం.

(2 / 8)

(ADITYA PRAKASH on Unsplash)

అద్భుతమైన హిమాలయాలు, కారకోరం శ్రేణుల మధ్య నెలకొని, అద్బుతపరిచే ప్రకృతి దృశ్యాలకు లేహ్, లడఖ్ ప్రాంతాలు నెలవు. ఇక్కడి  సుందరమైన పచ్చని ఒయాసిస్‌లు,  నిర్మలమైన బౌద్ధ ఆరామాలకు ఈ ప్రాంతాలు ప్రసిద్ధి చెందాయి. ఇవి మంచుతో కప్పబడిన పర్వతాలు, నిర్మలమైన ఆకాశంతో అసమానమైన అనుభవాన్ని అందిస్తాయి.

(3 / 8)

(Darshan Chudasama on Unsplash)

ఫోటోగ్రాఫర్ల స్వర్గధామం అయిన ప్రపంచ ప్రఖ్యాతి పొందిన తాజ్ మహల్ ఉన్న మంత్రముగ్ధమైన నగరం ఆగ్రా. తెల్లని పాలరాతి అందం, అద్భుతమైన పనితనంతో, తాజ్ మహాల్ ఫోటోగ్రాఫర్లకు అంతులేని అవకాశాలను అందిస్తుంది. మరిన్ని నిర్మాణ అద్భుతాల కోసం చారిత్రాత్మకమైన ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రీని కూడా చూడొచ్చు.

(4 / 8)

ఫోటోగ్రాఫర్ల స్వర్గధామం అయిన ప్రపంచ ప్రఖ్యాతి పొందిన తాజ్ మహల్ ఉన్న మంత్రముగ్ధమైన నగరం ఆగ్రా. తెల్లని పాలరాతి అందం, అద్భుతమైన పనితనంతో, 

తాజ్ మహాల్ ఫోటోగ్రాఫర్లకు అంతులేని అవకాశాలను అందిస్తుంది. మరిన్ని నిర్మాణ అద్భుతాల కోసం చారిత్రాత్మకమైన ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రీని కూడా చూడొచ్చు.

(Sonu Mehta/Hindustan Times)

కేరళ: దక్షిణ భారత దేశ రాష్ట్రం. ఫోటోగ్రఫీకి ఇక్కడ లెక్కగట్టలేనన్ని ప్రకృతి అందాలుంటాయి. దీన్ని గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. కేరళ బ్యాక్ వాటర్స్ కు, టీ, ఇతర మసాలాలు పండించే తోటలకు ప్రసిద్ది.  తీరప్రాంతం అంతా ప్రశాంతమైన బీచ్‌లు ఉంటాయిక్కడ.  సంస్కృతి, సాంప్రాదయ పండగలు, ఓనం వంటి రంగుల పండగలు ఈ తీరప్రాంతం ఒక స్వర్గమని రుజువు చేస్తాయి. 

(5 / 8)

(Pixabay)

జమ్ము కశ్మీర్ లోయలో ఉన్న గుల్మర్గ్, ఫోటోగ్రాఫర్లకు స్వర్గధామం. సహజ అందాలకు ఇది పెట్టింది పేరు. మంచు కప్పబడిన శిఖరాలు, పువ్వుల తోటలు, అద్భుతమైన ప్రకృతి అందాలు ఎన్నో ఉంటాయిక్కడ. 

(6 / 8)

(imad Clicks on Unsplash)

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ రాజధాని నగరమిది. ఇక్కడ కూడా ఫోటోగ్రాఫర్ల కోసం చాలా మంచి ప్రదేశాలున్నాయి. పచ్చని కొండలు, ఆర్కిటెక్చర్.. ఇలా చాలా ప్రత్యేకతలున్నాయి. ఇక్కడి మాల్ రోడ్, క్రిస్ట్ చర్చ్ లాంటి ప్రదేశాల్లో మంచి ఫోటోగ్రఫిక్ సీన్లుంటాయి. మార్కెట్లు కూడా చాలా అందంగా కనిపిస్తాయి. 

(7 / 8)

ముస్సోరీ, దీన్ని క్వీన్ ఆఫ్ హిల్స్ అంటారు. ఇది డెహ్రాడున్ నుంచి 38 కి.మీ దూరంలో ఉంది. డెహ్రాడున్ నుంచి ముస్సోరీకి వెళ్లే మార్గం కూడా మంచి ప్రకృతి దృశ్యాలతో ఆకట్టుకుంటుంది. ఈ పర్వత ప్రాంతంలో చూడదగ్గ ప్రదేశాలు చాలానే ఉన్నాయి. 

(8 / 8)

ఇతర గ్యాలరీలు