తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Penny Stock : ఈ పెన్నీ స్టాక్ ఒక్క సంవత్సరంలో 2700 శాతం పెరిగింది.. ఇన్వెస్టర్లకు మంచి లాభాలు!

Penny Stock : ఈ పెన్నీ స్టాక్ ఒక్క సంవత్సరంలో 2700 శాతం పెరిగింది.. ఇన్వెస్టర్లకు మంచి లాభాలు!

Anand Sai HT Telugu

23 October 2024, 11:00 IST

google News
    • Penny Stock : ఫార్మా రంగానికి చెందిన పెన్నీ స్టాక్ అయిన ఆయుష్ వెల్‌నెస్ స్టాక్ మార్కెట్‌లో అత్యధిక లాభాలను నమోదు చేసింది. ఇది తన పెట్టుబడిదారులకు భారీ రాబడిని ఇచ్చింది.
పెన్నీ స్టాక్​
పెన్నీ స్టాక్​

పెన్నీ స్టాక్​

పెన్నీ స్టాక్ ఆయుష్ వెల్‌నెస్ ఒక సంవత్సరంలో స్టాక్ 2700 శాతం రాబడిని ఇచ్చింది. ఆ సమయంలో షేరు రూ.3 నుంచి రూ.92కి పెరిగింది. అలాగే మంగళవారం ఈ షేరు 52 వారాల గరిష్టాన్ని తాకింది. పెట్టుబడిదారుల దృక్కోణంలో ఫార్మా రంగం సురక్షితమైన రంగంగా పరిగణించడంతో ఈ స్టాక్‌కు కలిసి వస్తుంది. అందుకే మంగళవారం పతనమైన మార్కెట్‌లో కూడా మంచి పనితీరు కనబరిచింది. అనేక ఫార్మా స్టాక్‌లు లాభాలను చూశాయి.

అలాగే ఫార్మా రంగంలో పెన్నీ స్టాక్ అయిన ఆయుష్ వెల్‌నెస్ స్టాక్ మీద చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. బుధవారం ఈ షేరు ధర రూ.94.48(10:15AM) వద్ద ఉంది. ఇది 52 వారాలలో అత్యధిక ధర. ఆయుష్ వెల్‌నెస్ అనేది మైక్రోక్యాప్ డ్రగ్, ఫార్మాస్యూటికల్ కంపెనీ. గత సంవత్సరంలో ఈ స్టాక్ పెట్టుబడిదారులకు 2700 శాతం రాబడిని ఇచ్చింది. ఆయుష్ వెల్‌నెస్ ఇటీవల తన ఈక్విటీ కార్యకలాపాలలో అనేక మైలురాళ్లను సాధించింది.

ఆయుష్ పనితీరును పరిశీలిస్తే విశ్లేషకులు కంపెనీపై బుల్లిష్‌గా ఉన్నారు. అంచనాల ప్రకారం స్టాక్ రాబోయే ఆరు నెలల్లో భారీ రాబడిని అందించగలదని చెబుతున్నారు.

గత 8 సంవత్సరాలుగా హెర్బల్ పాన్ మసాలా, స్లీప్ గమ్మీస్, బ్యూటీ గమ్మీస్ వంటి విభిన్న ఉత్పత్తులతో వేగంగా అభివృద్ధి చెందుతున్న హెల్త్‌కేర్, న్యూట్రాస్యూటికల్స్ మార్కెట్‌లలో ఆయుష్ వెల్‌నెస్ బలమైన ఉనికిని ప్రదర్శించింది. ఇది భవిష్యత్ వృద్ధికి పునాది వేస్తుంది. గత ఏడాది కాలంలో ఈ స్టాక్ రూ.2.98 నుంచి రూ.92.63కి పెరిగింది. స్టాక్ అనేక ఇతర ఉత్పత్తులను కలిగి ఉన్నందున పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించడం కొనసాగుతుందని నిపుణులు భావిస్తున్నారు.

గమనిక : ఇది పెట్టుబడి సలహా కాదు. కేవలం స్టాక్ పనితీరు మాత్రమే. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం రిస్క్‌తో కూడుకున్నది. నిపుణుల సలహా తీసుకోండి.

తదుపరి వ్యాసం