Maruti Fronx sales: 10 నెలల్లో లక్ష మారుతి ఫ్రాంక్స్ కార్లు సేల్; స్విఫ్ట్ రికార్డు మాత్రం పదిలం..
26 January 2024, 20:12 IST
- Maruti Fronx sales: మారుతి ఫ్రాంక్స్ అమ్మకాలు ప్రారంభమైన 10 నెలల్లోపే లక్ష కార్ల విక్రయాల మార్కును అధిగమించి, రికార్డు సృష్టించింది. అత్యంత వేగంగా లక్ష కార్ల సేల్స్ మార్క్ ను అందుకున్న తొలి మారుతి ఎస్ యూ వీ గా నిలిచింది.
ప్రతీకాత్మక చిత్రం
ఒక లక్ష విక్రయాల మైలురాయిని దాటిన కారుగా మారుతి ఫ్రాంక్స్ (Maruti Fronx) నిలిచింది. అత్యంత వేగంగా ఈ రికార్డు మార్క్ ను చేరుకున్న SUVగా నిలిచింది. సబ్-కాంపాక్ట్ SUV కేటగిరీలో అమ్మకాలు ప్రారంభించిన 10 నెలల్లోపే ఈ రికార్డును (car sales) మారుతి సుజుకి ఫ్రాంక్స్ సాధించింది. ఈ రికార్డు ఇప్పటివరకు మారుతి సుజుకీ గ్రాండ్ విటారా పేరుపై ఉంది. ఆ కారు సేల్స్ ప్రారంభమైన 12 నెలల్లోపు లక్ష కార్లను అమ్మగలిగింది.
మారుతి స్విఫ్ట్ రికార్డు పదిలం
అయితే, అత్యంత తక్కువ సమయంలో లక్ష కార్లు అమ్ముడయిన కారుగా ఇప్పటికీ మారుతి సుజుకీ స్విఫ్ట్ (Maruti Suzuki Swift) పేరుపై ఉన్న రికార్డు అలాగే ఉంది. 2018 లో మారుతి సుజుకి స్విఫ్ట్ కేవలం 145 రోజుల్లోనే ఒక లక్ష విక్రయాల మార్కును దాటేసింది. దీనితో, భారతదేశంలోనే అత్యంత వేగంగా లక్ష విక్రయాల మార్కును దాటిన వాహనంగా స్విఫ్ట్ నిలిచింది. వాస్తవానికి, స్విఫ్ట్ 2023లో రెండు లక్షలకు పైగా యూనిట్లను విక్రయించింది. ఇది భారతీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన ప్యాసింజర్ కారుగా నిలిచింది. అలా, మారుతికి స్విఫ్ట్ బెస్ట్ సెల్లర్‌గా మిగిలిపోయింది.
ఎస్ యూ వీ సెగ్మెంట్ లో..
మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ & సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, 2022లో ఆటోమేటిక్ వేరియంట్‌లలో 10.4 శాతం నుండి 2023లో మారుతి సుజుకి యొక్క SUV సెగ్మెంట్ షేర్‌ని 19.7 శాతానికి పెంచడంలో Fronx కీలకపాత్ర పోషించిందని తెలిపారు. ‘‘ఫ్రాంక్స్ 24 శాతం అమ్మకాలకు దోహదపడింది. క్లచ్-లెస్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌ల పట్ల పెరుగుతున్న ఆసక్తి కూడా ఇందుకు కారణం’’ అన్నారు.
22% మార్కెట్ వాటా
అంతేకాకుండా, కంపెనీ ఇటీవల లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్, ఆగ్నేయాసియా మార్కెట్ల కోసం ఫ్రాంక్స్ ఎగుమతులను ప్రారంభించింది. ఇప్పటివరకు, కంపెనీ 9,000 యూనిట్లకు పైగా ఫ్రాంక్స్ యూనిట్లను ఎగుమతి చేసింది. Fronx కంపెనీ పోర్ట్‌ఫోలియోలో నాల్గవ SUV. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మారుతి ప్రస్తుతం విక్రయిస్తున్న నాలుగు SUVలలో మూడు 2022-2023 మధ్యలో మార్కెట్లోకి వచ్చాయి. ఈ లాంచ్‌లతో మారుతీ ఎస్‌యూవీ రంగంలో తన మార్కెట్ వాటా 10 శాతం నుంచి 22 శాతానికి పెరిగింది.