తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Xiaomi 14 Ultra Launched : షావోమీ 14 అల్ట్రా లాంచ్​.. కెమెరా ఫీచర్స్​ సూపర్​!

Xiaomi 14 Ultra launched : షావోమీ 14 అల్ట్రా లాంచ్​.. కెమెరా ఫీచర్స్​ సూపర్​!

Sharath Chitturi HT Telugu

23 February 2024, 13:03 IST

  • Xiaomi 14 Ultra features : షావోమీ 14 అల్ట్రా.. చైనాలో లాంచ్​ అయ్యింది. ఈ గ్యాడ్జెట్​ ఫీచర్స్​, ధర వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

షావోమీ 14 అల్ట్రా లాంచ్​.. కెమెరా ఫీచర్స్​ సూపర్​!
షావోమీ 14 అల్ట్రా లాంచ్​.. కెమెరా ఫీచర్స్​ సూపర్​! (Xiaomi)

షావోమీ 14 అల్ట్రా లాంచ్​.. కెమెరా ఫీచర్స్​ సూపర్​!

Xiaomi 14 Ultra : మచ్​ అవైటెడ్​ షావోమీ 14 అల్ట్రా ప్రీమియం స్మార్ట్​ఫోన్​.. చైనాలో లాంచ్​ అయ్యింది. ఈ గ్యాడ్జెట్​.. త్వరలోనే అంతర్జాతీయ మార్కెట్​లో కూడా అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో.. ఈ మోడల్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

Mahindra XUV 3XO bookings: రేపటి నుంచే మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ బుకింగ్స్ ప్రారంభం; ఇలా బుక్ చేసుకోండి..

Vivo X100 Ultra: ఇది ఫొటోగ్రఫీ ప్రేమికుల కోసమే.. 200 ఎంపీ పెరిస్కోప్ కెమెరాతో వివో ఎక్స్100 అల్ట్రా స్మార్ట్ ఫోన్

High dividend stocks: అదిరిపోయే డివిడెండ్ తో పాటు షేర్ వ్యాల్యూ కూడా బాగా పెరుగుతున్న 5 స్టాక్స్ ఇవి..

Nikhil Kamat: పిల్లలు ఎందుకు వద్దనుకున్నాడో చెప్పిన ‘జెరోధా’ నిఖిల్ కామత్. వారసుడు అనే కాన్సెప్టే నాన్సెన్స్ అని కామెంట్

షావోమీ 14 అల్ట్రా ఫీచర్స్​..

మీడియా నివేదిక ప్రకారం.. షావోమీ 14 అల్ట్రాలో అద్భుతమైన 6.73 ఇంచ్​ ఓఎఈడీ ఎల్​టీపీఓ డిస్​ప్లే ఉంటుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్​ పీక్​ బ్రైట్​నెస్​ కలిగి ఉంది. డ్యూరెబులిటీ కోసం.. ఈ స్మార్ట్​ఫోన్​కు షీల్డ్​ గ్లాస్​ ప్రొటెక్షన్​ లభిస్తోంది. సాంప్రదాయ గ్లాస్​ కవర్​ కంటే ఇది.. 10 రెట్లు బలమైనదని తెలుస్తోంది. ఈ స్మార్ట్​ఫోన్ కొత్త అల్యూమినియం బిల్డ్​తో వస్తుంది. లగ్జరీ ఫీల్​ కోరుకునే వారి కోసం టైటానియం స్పెషల్ ఎడిషన్ కూడా ఉంది!

Xiaomi 14 Ultra price : షావోమీ 14 అల్ట్రా శక్తివంతమైన స్నాప్​డ్రాగన్ 8 జెన్ 3 చిప్​సెట్​ ఉంటుంది. 16 జీబీ ర్యామ్, 1 టీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్​ వస్తోంది. ఈ కాన్ఫిగరేషన్ టాప్-టైర్ స్పెసిఫికేషన్లను కోరుకునే వినియోగదారుల డిమాండ్లను తీర్చడానికి శక్తివంతమైన పనితీరును అందిస్తుంది.

ఇక షావోమీ 14 స్మార్ట్​ఫోన్​లో అల్ట్రాలో క్వాడ్ కెమెరా సెటప్​ ఉంటుంది. కెమెరాపై సంస్థ అధిక ఫోకస్​ పెట్టినట్టు కనిపిస్తోంది. ప్రైమరీ కెమెరాలో 50 మెగాపిక్సెల్ లెన్స్, 1 ఇంచ్​ టైప్ సోనీ ఎల్వైటి -900 సెన్సార్ ఉన్నాయి. ఇది అత్యున్నత ఇమేజింగ్ అనుభవాలను అందిస్తుంది. టెలిఫోటో లెన్స్​లో 3.2ఎక్స్ ఆప్టికల్ జూమ్​తో కూడిన 50 మెగాపిక్సెల్ సెన్సార్లు, పెరిస్కోప్ లెన్స్​లో 5ఎక్స్ ఆప్టికల్ జూమ్, అల్ట్రావైడ్ లెన్స్​లో 122 డిగ్రీల వైడ్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఉన్నాయి వంటివి ఉన్నాయి.

Xiaomi 14 Ultra price in India : షావోమీ 14 అల్ట్రాలో 5300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. క్విక్ పవర్ అప్స్ కోసం 90వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్, అదనపు సౌలభ్యం కోసం 80వాట్ వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్​ కూడా ఉండటం విశేషం. షావోమీ హైపర్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టెం లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 వెర్షన్ ఆధారంగా పనిచేసే ఈ ఫోన్​.. స్మూత్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ ఎక్స్​పీరియన్స్​ని అందిస్తుంది. అదనంగా, ఈ స్మార్ట్​ఫోన్ డస్ట్​ వాటర్​ రెసిస్టెన్స్​లో ఐపీ 68 రేటింగ్ పొందింది.

షావోమీ 14 అల్ట్రా - ధర ఎంతంటే..

Xiaomi 14 Ultra launch date in India : చైనాలో లాంచ్​ అయిన షావోమీ 14 అల్ట్రా ధర సీఎన్​వై 6499 (సుమారు $ 904) తో వస్తుంది. రాబోయే మొబైల్ వరల్డ్ కాన్ఫరెన్స్ (ఎండబ్ల్యుసి) 2024 లో గ్లోబల్ ప్రైజింగ్ వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు మరో ఆశను పెంచుతుంది.

తదుపరి వ్యాసం