తెలుగు న్యూస్  /  Business  /  Get Xiaomi 12 Pro 5g On Amazon At Just <Span Class='webrupee'>₹</span>31,949: Here's How Deal Works

Xiaomi 12 Pro 5G: షావోమీ 12 ప్రొ 5జీ పై 24 వేల వరకు డిస్కౌంట్

HT Telugu Desk HT Telugu

21 February 2023, 18:33 IST

    • Xiaomi 12 Pro 5G: షావోమీ నుంచి వచ్చిన ప్రీమియం 5 జీ (5G) ఫోన్ షావోమీ 12 ప్రొ (Xiaomi 12 Pro) ఇప్పుడు 30% వరకు డిస్కౌంట్ తో లభిస్తోంది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Xiaomi 12 Pro 5G: ఈ కామర్స్ దిగ్గజం ఆమెజాన్ (Amazon) లో షావోమీ 12 ప్రొ (Xiaomi 12 Pro) స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. షావోమీ నుంచి వచ్చిన ఈ ఫ్లాగ్ షిప్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ఇంత తక్కువ ధరకు లభించడం ఇదే ప్రథమం.

ట్రెండింగ్ వార్తలు

8th Pay Commission : 8వ పే కమిషన్​పై బిగ్​ అప్డేట్​.. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​ న్యూస్​!

Amazon Great Summer Sale 2024 : అమెజాన్​ గ్రేట్​ సమ్మర్​ సేల్​.. ఈ స్మార్ట్​ఫోన్స్​పై భారీ డిస్కౌంట్లు

Tata Punch : టాటా పంచ్​ ఈవీ- టాటా పంచ్​ పెట్రోల్​- టాటా పంచ్​ సీఎన్​జీ.. ఏది కొనాలి?

Gold and silver prices today : బంగారం ధర మళ్లీ పెరిగిందా? ఇక్కడ చెక్​ చేయండి..

Xiaomi 12 Pro 5G: 12 జీబీ ర్యామ్ తో..

12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ తో వస్తున్నషావోమీ 12 ప్రొ (Xiaomi 12 Pro) స్మార్ట్ ఫోన్ వాస్తవ ధర రూ. 79999. కానీ ఆమెజాన్ (Amazon) లో ఇప్పుడు ఈ ఫోన్ పై 30% వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అంటే, దాదాపు రూ. 24 వేల డిస్కౌంట్ తో, రూ. 55999 లకు ఈ ఫోన్ ను ఆమెజాన్ (Amazon) లో కొనుగోలు చేయవచ్చు. ఇది ఇన్ స్టంట్ డిస్కౌంట్. వేరే షరతులేవీ లేవు. వేరే ఫోన్ ఎక్సేంచ్ అవసరం లేదు.

Xiaomi 12 Pro 5G Discount offer: ఎక్సేంజ్ ఫెసిలిటీ కూడా ఉంది..

డిస్కౌంట్ తో పాటు రూ. 24 వేల వరకు ఎక్సేంజ్ బెనిఫిట్ ను కూడా పొందవచ్చు. షావోమీ 12 ప్రొ (Xiaomi 12 Pro) స్మార్ట్ ఫోన్ ను వర్కింగ్ కండిషన్ లో ఉన్న పాత ఫోన్ తో ఎక్స్ చేంజ్ చేయడం ద్వారా Amazon లో గరిష్టంగా రూ. 24,050 వరకు తగ్గింపును పొందవచ్చు. అంటే, ఒకవేళ మీ పాత ఫోన్ కు గరిష్ట ఎక్స్ చేంజ్ వాల్యూ అయిన రూ. 24,050 లభిస్తే, మీరు సరికొత్త షావోమీ 12 ప్రొ (Xiaomi 12 Pro) ఫోన్ ను రూ. 31,949 లకే పొందవచ్చు.

Xiaomi 12 Pro స్పెసిఫికేషన్స్

ఈ Xiaomi 12 Pro స్మార్ట్ ఫోన్ 6.73 అంగుళాల WQHD+ 2K+ AMOLED display తో వస్తోంది. డిస్ ప్లే కు గొరిల్లా గ్లాస్ రక్షణ ఉంది. ఈ షావోమీ ఫ్లాగ్ షిప్ ఫోన్ లో 50 ఎంపీ, 50 ఎంపీ, 32 ఎంపీ సోనీ IMX707 సెన్సర్ కెమెరా సెటప్ ఉంది. ఈ Xiaomi 12 Pro స్మార్ట్ ఫోన్ లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 (Qualcomm Snapdragon 8 Gen 1) ప్రాసెసర్ ను, 5600 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఫోన్ తో పాటు 120W హైపర్ చార్జ్ చార్జర్ లభిస్తుంది. ఈ చార్జర తో 18 నిమిషాల్లో 0 నుంచి 100% చార్జింగ్ అవుతుంది.

టాపిక్