తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Samsung Galaxy Fit3 : ది బెస్ట్ సామ్​సంగ్​​ ఫిట్​నెస్​ ట్రాకర్​ లాంచ్​! ధర ఎంతంటే..

Samsung Galaxy Fit3 : ది బెస్ట్ సామ్​సంగ్​​ ఫిట్​నెస్​ ట్రాకర్​ లాంచ్​! ధర ఎంతంటే..

Sharath Chitturi HT Telugu

24 February 2024, 9:00 IST

    • Samsung Galaxy Fit3 price : ఒక మంచి ఫిట్​నెస్​ ట్రాకర్​ కొనాలని భావిస్తున్నారా? అయితే ఇది మీకోసమే! సామ్​సంగ్​ సంస్థ.. కొత్త ఫిట్​నెస్​ ట్రాకర్​ని లాంచ్​ చేసింది. దాని పేరు సామ్​సంగ్​ గెలాక్సీ ఫిట్​3! ఈ గ్యాడ్జెట్​ ఫీచర్స్​, ధర వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ది బెస్ట్ సామ్​సంగ్​​ ఫిట్​నెస్​ ట్రాకర్​ లాంచ్​! ధర ఎంతంటే..
ది బెస్ట్ సామ్​సంగ్​​ ఫిట్​నెస్​ ట్రాకర్​ లాంచ్​! ధర ఎంతంటే..

ది బెస్ట్ సామ్​సంగ్​​ ఫిట్​నెస్​ ట్రాకర్​ లాంచ్​! ధర ఎంతంటే..

Best fitness tracker : దిగ్గజ టెక్​ సంస్థ సామ్​సంగ్​.. సరికొత్త ఫిట్​నెస్​ ట్రాకర్​ని లాంచ్​ చేసింది. దీని పేరు సామ్​సంగ్​ గెలాక్సీ ఫిట్​3. ఇందులో అడ్వాన్స్​డ్​ హెల్త్​ మానిటరింగ్​ ఫీచర్స్​ ఉన్నాయి. స్మార్ట్​వాచ్​లు అంటే పెద్దగా ఇష్టం లేని వారికి.. ఈ గెలాక్సీ ఫిట్​3 ఫిట్​నెస్​ ట్రాకర్​ మంచి ఆప్షన్​ అవుతుంది. ఈ నేపథ్యంలో.. ఈ గ్యాడ్జెట్​ ఫీచర్స్​ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

సామ్​సంగ్​ గెలాక్సీ ఫిట్​3..

లైట్​వెయిట్​ అల్యుమీనియం బాడీ, కస్టమైజబుల్​ బ్యాండ్స్​తో.. ఈ గెలాక్సీ ఫిట్​3 ఫిట్​నెస్​ ట్రాకర్​ని రూపొందించింది సామ్​సంగ్​ సంస్థ. ఇందులో 1.6 ఇంచ్​ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. పాత మోడల్​తో పోల్చుకుంటే.. స్క్రీన్​ ఏరియా 45శాతం పెరగడం విశేషం! ఈ డివైజ్​ డైమెన్షన్స్​- 4.29x2.88x0.99 సెంటీమీటర్లు. బరువు 36.8 గ్రాములు. బ

Samsung Galaxy Fit3 price : ఈ సామ్​సంగ్​ గెలాక్సీ ఫిట్​3లో ఫాల్​ డిటెక్షన్​, ఎమర్జెన్సీ ఎస్​ఓఎస్​ వంటి సేఫ్టీ ఫీచర్స్​ కూడా ఉన్నాయి. ఇందులో 208ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది. దీని ఎక్స్​టెండెడ్​ బ్యాటరీ లైఫ్​ 13 రోజులని సంస్థ చెబుతోంది. క్విక్​ ఛార్జ్​ సపోర్ట్​ కూడా ఈ డివైజ్​కి లభిస్తోంది. 30 నిమిషాల్లో 65శాతం ఛార్జ్​ అయిపోతుందట! డ్యూరెబులిటీ విషయానికొస్తే.. ఈ ఫిట్​నెస్​ ట్రాకింగ్​ డివైజ్ 5ఏటీఎం వాటర్​ రెసిస్టెన్స్​, ఐపీ68 రేటెడ్​ డస్ట్​ రెసిస్టెన్స్​ కలిగి ఉంటుంది.

ప్రాసెసింగ్​, స్టోరేజ్​ డేటా కోసం.. ఈ గ్యాడ్జెట్​లో 16ఎంపీ ర్యామ్​, 256 ఎంబీ స్టోరేజ్​ లభిస్తోంది. బ్లూటూత్​ 5.3 కనెక్టివిటీ ఫీచర్​ కూడా ఉంది.

Samsung Galaxy Fit3 price in India : ఈ సామ్​సంగ్​ గెలాక్సీ ఫిట్​3 ఫిట్​నెస్​ ట్రాకర్​లో 100కుపైగా వర్కౌట్​ టైప్స్​, హెల్త్​ రేట్​- స్ట్రెస్​ లెవల్స్​ మానిటర్​, స్నోరింగ్​ డిటెక్షన్​, బ్లడ్​ ఆక్సీజన్​ లెవల్స్​ కోసం అడ్వాన్స్​డ్​ స్లీప్​ మానిటరింగ్​ టూల్స్​ ఉన్నాయి. ఈ డివైజ్​లో 'పర్సనలైజ్​డ్​ స్లీప్​ కోచింగ్​' ఫీచర్​ కూడా ఉంది. ఎన్హాన్స్​డ్​ స్లీప్​ క్వాలిటీకి ఇది పనిచేస్తుంది.

సామ్​సంగ్​ గెలాక్సీ ఫిట్​3- ధర ఎంతంటే..

సామ్​సంగ్​ గెలాక్సీ ఫిట్​3 ఫిట్​నెస్​ ట్రాకర్​.. గ్రే, సిల్వర్​, పింక్​ గోల్డ్​ వంటి కలర్​ ఆప్షన్స్​లో లభిస్తోంది. దీని ధర రూ. 4,999. లిమిటెడ్​ టైమ్​ ఆఫర్​ కింద రూ. 500 క్యాష్​బ్యాక్​ ఇస్తోంది సంస్థ. సామ్​సంగ్​ అధికారిక వెబ్​సైట్​లో ఈ గ్యాడ్జెట్​ అందుబాటులో ఉంది.

Samsung Galaxy Fit3 India launch : "ఈ వెల్​నెస్​ ప్రపంచంలో.. ప్రజలు ఆరోగ్యం గురించి డీప్​గా తెలుసుకోవాలని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా.. అడ్వాన్స్​డ్​ హెల్త్​ మానిటరింగ్​ టూల్స్​ని కస్టమర్లకు అందించేందుకు సామ్​సంగ్​ కృషిచేస్తోంది. గెలాక్సీ ఫిట్​3 ఇందుకు నిదర్శనం. ఈ ఫిట్​నెస్​ ట్రాకర్​.. డైలీ వెల్​నెస్​ని ప్రమోట్​ చేసి ప్రజలను మోటివేట్​ చేస్తుంది," అని సామ్​సంగ్​ ఇండియా ఎంఎక్స్​ బిజినెస్​ సీనియర్​ డైరక్టర్​ ఆదిత్య బాబర్​ తెలిపారు.

తదుపరి వ్యాసం