తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Smartwatches: 10 వేల రూపాయల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్ వాచెస్ ఇవే..

Best Smartwatches: 10 వేల రూపాయల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్ వాచెస్ ఇవే..

HT Telugu Desk HT Telugu

16 December 2023, 16:42 IST

  • Best Smartwatches: మార్కెట్లోకి పెద్ద ఎత్తున స్మార్ట్ వాచీలు వస్తున్నాయి. వాటిలో ఏది బెస్ట్? ఏ ఫీచర్స్ ఉండాలి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 10 వేల రూపాయల లోపు ధరలో మార్కెట్లో లభిస్తున్న స్మార్ట్ వాచెస్ ఇవే..

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Best Smartwatches: స్మార్ట్‌వాచ్‌లు ఇప్పుడు నిత్యావసరంగా మారాయి. సంప్రదాయ వాచ్ ల స్థానాన్ని ఇవి ఆక్రమించాయి. వివిధ బ్రాండ్ ల నుంచి పెద్ద ఎత్తున స్మార్ట్ వాచ్ మోడల్స్ మార్కెట్ ను ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో, రూ. 10 వేల లోపు బెస్ట్ స్మార్ట్ వాచెస్ మీ కోసం అందిస్తున్నాం..

Amazfit GTS 4: అమేజ్ ఫిట్ జీటీఎస్ 4

అమేజ్ ఫిట్ జీటీఎస్ 4 మినీ స్మార్ట్ వాచ్ (Amazfit GTS 4 Smartwatch) 1.65" HD AMOLED డిస్‌ప్లే ఉన్న కాంపాక్ట్ ఫిట్‌నెస్ డివైజ్. ఇది 120+ స్పోర్ట్స్ మోడ్‌లను సపోర్ట్ చేస్తూ హృదయ స్పందన రేటు, SpO2, స్ట్రెస్ లెవెల్స్ ను ట్రాక్ చేస్తుంది. 5 శాటిలైట్ సిస్టమ్‌లు, 5 ATM వరకు వాటర్‌ఫ్రూఫింగ్, 15-రోజులు బ్యాటరీ లైఫ్ ను ఇస్తుంది.

Fire-Boltt Phoenix Pro: ఫైర్ బోల్ట్ ఫీనిక్స్ ప్రొ

ఫైర్ బోల్ట్ ఫీనిక్స్ ప్రొ స్మార్ట్‌వాచ్ 1.39" TFT కలర్ టచ్ స్క్రీన్‌తో వస్తుంది. ఇందులో 120+ స్పోర్ట్స్ మోడ్‌లు, AI వాయిస్ అసిస్టెంట్, పెద్ద ఎత్తున హెల్త్ మానిటరింగ్ ఫీచర్‌లను అందిస్తోంది. ఇది సీమ్ లెస్ యాక్టివిటీ ట్రాకింగ్‌ను అందిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 7 రోజుల బ్యాటరీ లైఫ్ ను ఇస్తుంది. బ్లూటూత్ కాలింగ్, సోషల్ మీడియా నోటిఫికేషన్‌లతో మిమ్మల్ని కనెక్ట్ చేస్తుంది.

OnePlus Nord Watch: వన్ ప్లస్ నార్డ్ వాచ్

వన్ ప్లస్ నార్డ్ వాచ్ 60Hz రిఫ్రెష్ రేట్ తో 1.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ప్రకాశవంతమైన సూర్యకాంతిలో కూడా క్రిస్టల్-క్లియర్ విజువల్స్‌ను అందిస్తుంది. ఈ వాచ్ ను N Health యాప్‌తో అనుసంధానించుకోవాలి. ఫిట్‌నెస్ ట్రాకింగ్ ట్రెండ్‌లకు అనుగుణంగా 105 ఫిట్‌నెస్ మోడ్‌లకు ఇది మద్దతు ఇస్తుంది. దీని బ్యటరీ 10-రోజుల పాటు ఉంటుంది. దీని ధృడమైన మెటల్ కేస్ ఈ స్మార్ట్ వాచ్ ను మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది.

Samsung Galaxy Watch4: సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 4

సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 4 ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇందులో బయోఎలక్ట్రికల్ ఇంపెడెన్స్ అనాలిసిస్ సెన్సార్‌ ఉంటుంది. దీనివల్ల ఇది మీ బాడీ కంపోజిషన్ ను కచ్చితంగా విశ్లేషించగలదు. అదనంగా, దాని ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్ కచ్చితమైన హార్ట్ రేట్ ను చూపుతుంది. ఇందులో 7-అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. 90 కంటే ఎక్కువ వర్కౌట్స్ మోడ్స్ ఉన్నాయి.

తదుపరి వ్యాసం