Game of Thrones smartwatch : 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' థీమ్‌తో కొత్త స్మార్ట్‌వాచ్.. ధర ఎంతంటే!
Game of Thrones smartwatch : గేమ్ ఆఫ్ థ్రోన్స్ థీమ్‌తో కొత్త వాచ్‌ను లాంచ్ చేసింది పెబుల్ సంస్థ. ధర, ఫీచర్స్ వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..
Game of Thrones smartwatch : ఇంగ్లీష్ టీవీ షో 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'కు సపరేట్ ఫ్యాన్‌బేస్ ఉంటుంది. ఈ టీవీ షో చివరి ఎపిసోడ్ విడుదలై నాలుగేళ్లు గడిచిపోయినా.. క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇక ఇప్పుడు.. ఈ జీఓటీ థీమ్‌తో ఓ కొత్త స్మార్ట్‌వాచ్‌ను రూపొందించింది పెబుల్ సంస్థ. ఈ వాచ్ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
పెబుల్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ వాచ్ ఫీచర్స్..
ఈ పెబుల్ స్మార్ట్‌వాచ్ సెంటర్లో డ్రాగన్ బొమ్మ ఉంటుంది. లుక్ అట్రాక్టివ్‌గా ఉంది. ఇక ఇందులో 1.43 ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. బ్లూటూత్ ఫీచర్ ద్వారా ఫోన్స్ ఆన్సర్ చేయవచ్చు. ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్స్‌కు ఇది సపోర్ట్ చేస్తుంది. వివిధ స్పోర్ట్స్, ఫిట్నెస్ ట్రాకింగ్ కెపబులిటీ కూడా ఈ వాచ్‌లో ఉంది. 250ఎంఏహెచ్ బ్యాటరీ ఈ మోడల్ సొంతం. స్టాండ్‌బై మోడల్లో ఈ పెబుల్ కొత్త స్మార్ట్‌వాచ్.. ఏడు రోజుల పాటు పనిచేస్తుందని సంస్థ చెబుతోంది.
Pebble Game of Thrones smartwatch : బ్లడ్ ఆక్సీజన్ సాచ్యురేషన్ లెవల్స్, హార్ట్ రేట్, స్లీప్ పాటర్న్‌తో పాటు ఇతర హెల్త్ ట్రాకర్స్ ఈ వాచ్‌లో ఉన్నాయి. కాల్క్యులేటర్ యాప్, అలారం క్లాక్, స్టాప్ వాచ్, మ్యూజిక్ కంట్రోల్స్ వంటివి అదనంగా వస్తున్నాయి. ఈ గ్యాడ్జెట్‌కు ఐపీ67 రేటింగ్‌తో కూడిన వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ లభిస్తోంది. ఈ వాచ్ బరువు 172 గ్రాములు.
ఇదీ చూడండి:- క్రేజీ ఫీచర్స్‌తో వాచ్ సిరీస్ 9! యాపిల్ లవర్స్‌కు ఇక పండుగే..!
ఇండియాలో ఈ పెబుల్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్మార్ట్‌వాచ్ ధర రూ. 5,499గా ఉంది. సంస్థ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌లో దీనిని కొనుగోలు చేసుకోవచ్చు. బ్లాక్, గ్రే, గోల్డ్ కలర్స్‌లో ఇది అందుబాటులో ఉండనుంది.
పెబుల్ రివాల్వ్ వాచ్‌ను చూశారా..?
పెబుల్ రివాల్వ్ ఇటీవలే లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్‌వాచ్‌లో 1.39 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే టచ్‌స్క్రీన్ ఉంటుంది. 500 నిట్స్ బ్రైట్నెస్ దీని సొంతం. డార్క్, డేలైట్‌లో విజువల్ కోసం ఇందులో "ఆల్వేస్ ఆన్ డిస్ప్లే" ఫీచర్ ఉంటుంది. ఇందులో 3 డయల్ ఫ్రేమ్స్‌తో పాటు మూడు వేరువేరు స్ట్రాప్స్ వస్తున్నాయి. సిలికాన్, క్లాసిక్ మెటల్, ప్రీమియం లెథర్ వంటి డయల్స్, స్ట్రాప్స్ ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం