తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Realme 12+ 5g : రియల్​మీ 12 ప్లస్​ 5జీ.. ఇండియా లాంచ్​కు రెడీ- ఫీచర్స్​ ఇవే!

Realme 12+ 5G : రియల్​మీ 12 ప్లస్​ 5జీ.. ఇండియా లాంచ్​కు రెడీ- ఫీచర్స్​ ఇవే!

Sharath Chitturi HT Telugu

17 February 2024, 8:10 IST

    • Realme 12+ 5G India launch : రియల్​మీ 12 ప్లస్​ 5జీ స్మార్ట్​ఫోన్​.. త్వరలోనే ఇండియాలో లాంచ్​కు రెడీ అవుతుంది. ఈ విషయాన్ని సంస్థ వెల్లడించింది.
రియల్​మీ 12 ప్లస్​ 5జీ.. ఇండియా లాంచ్​కు రెడీ- ఫీచర్స్​ ఇవే!
రియల్​మీ 12 ప్లస్​ 5జీ.. ఇండియా లాంచ్​కు రెడీ- ఫీచర్స్​ ఇవే! (Realme/ Representative image)

రియల్​మీ 12 ప్లస్​ 5జీ.. ఇండియా లాంచ్​కు రెడీ- ఫీచర్స్​ ఇవే!

Realme 12+ 5G launch : సరికొత్త 5జీ స్మార్ట్​ఫోన్​ని ఇండియా మార్కెట్​లో లాంచ్​ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది రియల్​మీ సంస్థ. ఈ గ్యాడ్జెట్​ పేరు రియల్​మీ 12 ప్లస్​ 5జీ. ఇందుకు సంబంధించి.. సోషల్​ మీడియాలో ఒక పోస్ట్​ కూడా పెట్టింది సంస్థ. 'అల్టిమేట్​ వాల్యూ మిడ్​- రేంజ్​ గ్యాడ్జెట్​ వస్తోంది,' అంటూ క్యాప్షన్​ ఇచ్చింది. ఈ రియల్​మీ 12 ప్లస్​ ఫీచర్స్​కి సంబంధించిన వివరాలు.. రియల్​మీ ఇండియా వెబ్​సైట్​లో కనిపిస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాము..

ట్రెండింగ్ వార్తలు

Tata Ace EV 1000: టాటా ఏస్ ఈవీ 1000 ఎలక్ట్రిక్ కార్గో వెహికిల్ లాంచ్; రేంజ్ 161 కిమీ..

Motorola Edge 50 Fusion launch: ఇండియాలో మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ లాంచ్; స్పెసిఫికేషన్లు, ధర వివరాలు

IQOO Z9x 5G launch: ఐక్యూ జడ్9ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్; ధర, ఫీచర్స్ ఇవే..

Multibagger IPO: ‘నాలుగేళ్ల క్రితం ఈ ఐపీఓలో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసినవారు ఇప్పుడు కోటీశ్వరులయ్యారు..’

రియల్​మీ 12 ప్లస్​ 5జీ ఫీచర్స్​..

రియల్​మీ కొత్త స్మార్ట్​ఫోన్​లో లెథర్​ టెక్స్చర్​తో కూడిన బ్యాక్​ పానెల్​ ఉంటుంది. దీనితో.. గ్యాడ్జెట్​కి లగ్జరీ డిజైన్​ ఫీల్​ వస్తుంది. అయితే.. డిజైన్​ ప్రకారం.. ఈ మొబైల్​.. రియల్​మీ 12 ప్రోని పోలి ఉండే అవకాశం ఉంది.

లీక్​ అయిన డేటా ప్రకారం.. రియల్​మీ 12 ప్లస్​ 5జీలో 120హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.67 ఇంచ్​ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. 50ఎంపీ ప్రైమరీతో కూడిన ట్రిపుల్​ రేరే కెమెరా సెటప్​ దీని సొంతం.

ఇక ఈ మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్​లో డైమెన్సిటీ 7050 ప్రాసెసర్​ ఉంటుంది. 5000ఎంఏహెచ్​ బ్యాటరీ, 67 వాట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ దీనికి లభిస్తుంది.

Realme 12+ 5G price in India : ఈ మొబైల్​కు సంబంధించిన ఇతర ఫీచర్స్​, ధర వంటి వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. వీటితో పాటు లాంచ్​ డేట్​ని సంస్థ త్వరలోనే రివీల్​ చేస్తుందని సమాచారం.

ఇప్పటివరకు బయటకి వచ్చినా ఫీచర్స్​ని చూస్తుంటే.. రియల్​మీ 12 ప్లస్​ మిడ్​ రేంజ్​ గ్యాడ్జెట్​ అని స్పష్టమవుతుంది. ఈ సెగ్మెంట్​లో ఇప్పటికే తీవ్ర పోటీ నెలకొంది. అందుకే.. రియల్​మీ 12 ప్లస్​ ప్రైజింగ్​ చాలా కీలకంగా మారుతుందని టెక్​ వర్గాలు భావిస్తున్నాయి. సరసమైన ధరలో.. ఇండియాలోకి ఎంట్రీ ఇస్తే మాత్రం, ఈ గ్యాడ్జెట్​కి మంచి డిమాండ్​ కనిపిస్తుందని నిపుణులు అంటున్నారు.

రియల్​మీ 12 ప్రో సిరీస్​..

Realme 12 pro price in India : ఇండియా స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో సరికొత్త సిరీస్​ని ఇటీవలే లాంచ్​ చేసింది రియల్​మీ సంస్థ. దీని పేరు రియల్​మీ 12 ప్రో. ఇందులో రెండు గ్యాడ్జెట్స్​ ఉన్నాయి. అవి.. రియల్​మీ 12 ప్రో, రియల్​మీ 12 ప్రో ప్లస్​.

రియల్​మీ కొత్త స్మార్ట్​ఫోన్స్​లో కర్వ్​డ్​ డిస్​ప్లే, టాప్​ సెంటర్డ్​ పంచ్​ హోల్​ కటౌట్​ వంటివి కనిపిస్తున్నాయి. పవర్​ బటన్​, వాల్యూ బటన్​ రైట్​ సైడ్​లో ఉంది. టైప్​-సీ పోర్ట్​, సిమ్​ ట్రే, ప్రైమరీ మైక్రోఫోన్​, స్పీకర్​ వంటివి.. కింది భాగంలో ఉన్నాయి. రేర్​లో సర్క్యులర్​ కెమెరా మాడ్యూల్​ వస్తోంది.

ఈ రియల్​మీ 12 ప్రో, ప్రో+ గ్యాడ్జెట్స్​లో 6.7 ఇంచ్​ కర్వ్​డ్​ ఎడ్జ్​ అమోలెడ్​ ఫుల్​ హెచ్​డీ+ డిస్​ప్లే లభిస్తోంది. రియల్​మీ 12 ప్రోలో 50ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రా-వైడ్​, 32ఎంపీ టెలిఫొటో లెన్స్​తో కూడిన ట్రిపుల్​ రేర్​ కెమెరా సెటప్​ ఉంటుంది. 12 ప్రో+ లో 50ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రా-వైడ్​, 64ఎంపీ పెరిస్కోప్​ టెలిఫొటో కెమెరా రేర్​లో వస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం