Realme 12 Pro series : రియల్మీ 12 ప్రో సిరీస్ లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలివే..
Realme 12 Pro series launched : రియల్మీ 12 ప్రో సిరీస్.. ఇండియాలో లాంచ్ అయ్యింది. రెండు స్మార్ట్‌ఫోన్స్ ఇందులో ఉన్నాయి. వాటి ఫీచర్స్, ధర వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
Realme 12 Pro series price : ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సరికొత్త సిరీస్‌ని లాంచ్ చేసింది రియల్మీ సంస్థ. దీని పేరు రియల్మీ 12 ప్రో. ఇందులో రెండు గ్యాడ్జెట్స్ ఉన్నాయి. అవి.. రియల్మీ 12 ప్రో, రియల్మీ 12 ప్రో ప్లస్. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
రియల్మీ 12 ప్రో స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్..
రియల్మీ కొత్త స్మార్ట్‌ఫోన్స్‌లో కర్వ్డ్ డిస్ప్లే, టాప్ సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్ వంటివి కనిపిస్తున్నాయి. పవర్ బటన్, వాల్యూ బటన్ రైట్ సైడ్‌లో ఉంది. టైప్-సీ పోర్ట్, సిమ్ ట్రే, ప్రైమరీ మైక్రోఫోన్, స్పీకర్ వంటివి.. కింది భాగంలో ఉన్నాయి. రేర్‌లో సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ వస్తోంది.
Realme 12 Pro price in India : ఈ రియల్మీ 12 ప్రో, ప్రో+ గ్యాడ్జెట్స్‌లో 6.7 ఇంచ్ కర్వ్డ్ ఎడ్జ్ అమోలెడ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే లభిస్తోంది. రియల్మీ 12 ప్రోలో 50ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రా-వైడ్, 32ఎంపీ టెలిఫొటో లెన్స్‌తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. 12 ప్రో+ లో 50ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రా-వైడ్, 64ఎంపీ పెరిస్కోప్ టెలిఫొటో కెమెరా రేర్‌లో వస్తోంది.
సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లో.. 16ఎంపీ, 32ఎంపీ ఫ్రెంట్ కెమెరాలు లభిస్తున్నాయి.
రియల్మీ 12 ప్రోలో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1, రియల్మీ 12ప్రో+ లో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్లు ఉంటాయి. రెండు ఫోన్స్ కూడా.. ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్మీ యూఐ 5.0పై పనిచేస్తాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వీటికి లభిస్తున్నాయి. డాల్బీ అట్మోస్ కూడా లభిస్తుండటం విశేషం.
రియల్మీ 12 ప్రో సిరీస్- ధరలు ఎంతంటే..
Realme 12 Pro plus price in India : రియల్మీ 12ప్రోలో రెండు వేరియంట్స్ ఉంటాయి. 8జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్ ధర రూ. 25,999. 8జీబీ ర్యామ్- 256జీబీ స్టోరేజ్ ధర రూ. 26,999.
ఇక రియల్మీ 12 ప్రో+ 8జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్ ధర రూ. 29,999గా ఉంది. 8జీబీ ర్యామ్- 256జీబీ స్టోరేజ్ ధర రూ. 31,999, 12జీబీ ర్యామ్- 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,999గా ఉన్నాయి. సబ్‌మెరైన్ బ్లూ, నావిగేటర్ కలర్స్‌లో ఇవి వస్తున్నాయి. 12 ప్రో+ మోడల్లో ఎక్స్‌ప్లోరర్ రెడ్ ఎడిషన్ కూడా ఉంది.
Realme 12 Pro plus features : ఫ్లిప్‌కార్ట్, రియల్మీ అఫీషియల్ వెబ్సైట్లో.. ఫిబ్రవరి 6న ఈ గ్యాడ్జెట్స్ సేల్స్ మొదలవుతాయి. ఈ ఐసీఐసీఐ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్‌పై రూ. 2వేల వరకు డిస్కౌంట్స్ పొందొచ్చు. 12 నెలల పాటు నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా ఉంది.
మరి ఈ రియల్మీ 12 ప్రో సిరీస్ ఫీచర్స్ నచ్చాయా? మీరైతే ఏది కొంటారు?
సంబంధిత కథనం