తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tcs Q2 Results: క్యూ 2 ఫలితాలను వెల్లడించిన టీసీఎస్; డివిడెండ్ ఎంత అంటే..?

TCS Q2 Results: క్యూ 2 ఫలితాలను వెల్లడించిన టీసీఎస్; డివిడెండ్ ఎంత అంటే..?

HT Telugu Desk HT Telugu

11 October 2023, 19:10 IST

google News
    • TCS Q2 Results: ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (Q2FY24) ఫలితాలను బుధవారం ప్రకటించింది. క్యూ 2 ఫలితాలతో పాటు ఇన్వెస్టర్లకు డివిడెండ్ ను కూడా ప్రకటించింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Bloomberg)

ప్రతీకాత్మక చిత్రం

TCS Q2 Results: టీసీఎస్ అక్టోబర్ 11 వ తేదీన క్యూ 2 (Q2FY24) ఫలితాలను ప్రకటించింది. టీసీఎస్ ప్రకటనతోనే ఈ ఆర్థిక సంవత్సరం క్యూ 2 ఫలితాలు వెలువడడం ప్రారంభమైంది.

11 వేల కోట్ల నికర లాభాలు..

ఈ క్యూ2 (Q2FY24) లో టీసీఎస్ రూ. 11,432 నికర లాభాలను ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ 2 (Q2FY23) తో పోలిస్తే ఇది దాదాపు 8.7% అధికం. గత ఆర్థిక సంవత్సరం క్యూ 2 (Q2FY23)లో టీసీఎస్ రూ. 10,431 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. అలాగే, ఈ క్యూ 1 (Q1FY24) లో టీసీఎస్ రూ. 11,074 కోట్ల లాభాలను సంపాదించింది. కంపెనీ నికర ఆదాయం ఈ క్యూ 2 లో రూ. 59,692 కోట్లుగా ఉంది. Q2FY23 తో పోలిస్తే అది 7.9% అధికం.

డివిడెండ్, బై బ్యాక్

క్యూ 2 రిజల్ట్ తో పాటు ఇన్వెస్టర్లకు డివిడెండ్ ను కూడా టీసీఎస్ ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో మధ్యంతర డివిడెండ్ గా ఒక్కో ఈక్విటీ షేర్ పై రూ. 9 ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మొత్తం ఇన్వెస్టర్ల బ్యాంక్ ఖాతాల్లోకి నవంబర్ 7వ తేదీన జమ అవుతుంది. అలాగే, రూ. 17 వేల కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను టీసీఎస్ బై బ్యాక్ చేయనుంది. ఈ బై బ్యాక్ ధరగా ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 4150 లను నిర్ణయించింది. అంటే ప్రస్తుత ధరపై దాదాపు 15% ప్రీమియంతో బై బ్యాక్ చేస్తోంది.

తదుపరి వ్యాసం