TCS Q1 results: టీసీఎస్ క్యూ1 ఫలితాలు; డివిడెండ్ కూడా..
TCS Q1FY24 results: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) బుధవారం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (Q1FY24) ఫలితాలను ప్రకటించింది. దాంతో పాటు షేర్ హోల్డర్లకు 900% డివిడెండ్ ను కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
TCS Q1FY24 net profit: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (Tata Consultancy Services TCS) బుధవారం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (Q1FY24) ఫలితాలను ప్రకటించింది. టీసీఎస్ నికర లాభాలు 17% వృద్ధి చెందాయి. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (Q1FY23) లో టీసీఎస్ నికర లాభాలు రూ. 9,478 కోట్లు కాగా, ఈ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (Q1FY24) లో రూ. 11,074 కోట్ల నికర లాభాలను ఆర్జించింది.
TCS revenue: ఆదాయం 59 వేల కోట్లు
Q1FY24 లో టీసీఎస్ రూ. 59,381 ఆదాయం సముపార్జించింది. Q1FY23 తో పోలిస్తే అది 12.6% అధికం. Q1FY24 ఫలితాలతో పాటు షేర్ హోల్డర్లకు మధ్యంతర డివిడెండ్ ను కూడా కంపెనీ ప్రకటించింది. రూ. 1 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేర్ పై రూ. 9 మధ్యంతర డివిడెండ్ (interim dividend) గా ఇవ్వాలని కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయించారు. అంటే, ముఖ విలువపై 900% డివిడెండ్ ను కంపెనీ ప్రకటించింది. ఈ డివిడెండ్ మొత్తాన్ని షేర్ హోల్డర్ల బ్యాంక్ ఖాతాల్లో ఈ ఆగస్ట్ 7 నాటికి జమ చేస్తారు. అలాగే, డివిడెండ్ చెల్లింపునకు రికార్డు డేట్ జులై 20 అని కంపెనీ ప్రకటించింది. కొత్త టీసీఎస్ సీఈఓ గా కృతివాసన్ నియమితుడైన తరువాత టీసీఎస్ ప్రకటించిన తొలి ఫలితాలు ఇవే కావడం గమనార్హం. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలను ఎంతో సంతృప్తితో, సంతోషంతో ఉన్నట్లు కృతివాసన్ వ్యాఖ్యానించారు. టీసీఎస్ షేర్ విలువ బుధవారం 0.36% తగ్గి రూ. 3,260.20 కి చేరింది.