తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Motors Q3 Results: రెండేళ్లలో తొలిసారి లాభాల్లోకి టాటా మోటార్స్

Tata Motors Q3 Results: రెండేళ్లలో తొలిసారి లాభాల్లోకి టాటా మోటార్స్

HT Telugu Desk HT Telugu

25 January 2023, 17:02 IST

  • Tata Motors Q3 Results: భారతీయ ఆటో మొబైల్ దిగ్గజ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) రెండేళ్లలో తొలిసారి లాభాలను ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (Q3FY23) లో అంచనాలను మించి సుమారు 3 వేల కోట్ల రూపాయల నికర లాభాలను ఆర్జించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Bloomberg)

ప్రతీకాత్మక చిత్రం

Tata Motors Q3 Results: టాటా మోటార్స్ (Tata Motors) ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (Q3FY23) లో రూ. 2,957.71 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (Q3FY22) లో టాటా మోటార్స్ రూ. 1,516 కోట్ల నికర నష్టాలను ప్రకటించింది. ఈ Q3 లో టాటామోటార్స్ (Tata Motors Q3 Results) లాభాలు సుమారు రూ. 285 కోట్లు ఉండవచ్చని నిపుణులు అంచనా వేశారు.

Tata Motors Q3 Results: జేఎల్ఆర్ నుంచి అనూహ్య ఆదాయం

టాటా మోటార్స్ (Tata Motors) అనుబంధ సంస్థ జాగ్వార్ లాండ్ రోవర్ (Jaguar Land Rover JLR) ఈ Q3 లో 6 బిలియన్ డాలర్ల ఆదాయం సంపాదించింది. ఇది గత Q3తో పోలిస్తే 28% అధికం. అలాగే, ఈ ఆర్థిక సంవత్సరం Q2తో పోలిస్తే, 15% అధికం. జేఎల్ఆర్ (Jaguar Land Rover JLR) ఆదాయం ఈ Q3 లో రూ. 88,488.59 కోట్లు. గత ఆర్థిక సంవత్సరం Q3 లో జేఎల్ఆర్ (Jaguar Land Rover JLR) ఆదాయం రూ. 72,229 కోట్లు. అంటే గత Q3 కన్నా ఈ Q3లో జేఎల్ఆర్ (Jaguar Land Rover JLR) ఆదాయం 22.5% పెరిగింది. కోవిడ్ ప్రభావం క్రమంగా తగ్గుతుండడం, డిమాండ్ పెరుగుతుండడం, తెలివైన మోడల్ మిక్సింగ్, అందుబాటు ధర.. తదితర కారణాలతో టాటా మోటార్స్ ఈ త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను సాధించగలిగింది. రెండేళ్లలో టాటా మోటార్స్ (Tata Motors Q3 Results) లాభాలను ప్రకటించడం ఇదే తొలిసారి. ఈ Q3 లో సంస్థ ఆదాయం 23% పెరిగింది.

Tata Motors Q3 Results: ప్యాసెంజర్ కార్లకు డిమాండ్

టాటా మోటార్స్ (Tata Motors) ప్యాసెంజర్ కార్లకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. ముఖ్యంగా టాటా కార్ల సేఫ్టీ ఫీచర్లు మిగతా పోటీ కార్ల కన్నా మెరుగ్గా ఉండడం, పోటీ సంస్థల కార్ల కన్నా మెరుగైన ధరలను నిర్ణయించడం, ఆఫ్టర్ సేల్ సర్వీస్ లు మెరుగుపడడం మొదలైన కారణాలతో కస్టమర్లు టాటా మోటార్స్ (Tata Motors) ప్యాసెంజర్ కార్లపై ఆసక్తి చూపడం పెరిగింది. ప్యాసెంజర్ వాహనాలతో పాటు మీడియం, హెవీ కమర్షియల్ వాహనాల సేల్స్ కూడా ఈ Q3లో గణనీయంగా పెరిగాయి.

Tata Motors Q3 Results: ఇప్పటివరకు నష్టాలే

టాటా మోటార్స్ (Tata Motors) గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (Q3FY22) లో టాటా మోటార్స్ (Tata Motors) రూ. 1,516 కోట్ల నికర నష్టాలను ప్రకటించింది. అలాగే, ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ తో ముగిసే Q2లో (Q2FY23) రూ. 944.61 కోట్ల నష్టాలను ప్రకటించింది. కాగా, బుధవారం టాటామోటార్స్ (Tata Motors ) షేర్ విలువ .84% తగ్గి రూ. 418.60 వద్ద ముగిసింది.

టాపిక్

తదుపరి వ్యాసం