తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Altroz: టాటా ఆల్ట్రోజ్ అన్ని స్టాండర్డ్ మోడల్స్ కు సన్ రూఫ్ ఆప్షన్

Tata Altroz: టాటా ఆల్ట్రోజ్ అన్ని స్టాండర్డ్ మోడల్స్ కు సన్ రూఫ్ ఆప్షన్

HT Telugu Desk HT Telugu

02 June 2023, 13:50 IST

google News
    • టాటా ప్రీమియం హ్యాచ్ బ్యాక్ మోడల్ ఆల్ట్రోజ్ (Tata Altroz) ను కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్త. ఇకపై అన్ని స్టాండర్డ్ ఆల్ట్రోజ్ మోడల్స్ కు సన్ రూఫ్ (sunroof) ఫీచర్ లభించనుంది.
టాటా ఆల్ట్రోజ్ కార్
టాటా ఆల్ట్రోజ్ కార్

టాటా ఆల్ట్రోజ్ కార్

టాటా మోటార్స్ మే నెలలో లాంచ్ చేసిన ఆల్ట్రోజ్ (Tata Altroz) సీఎన్జీ వర్షన్ కారుకు తొలిసారి సన్ రూఫ్ ఫీచర్ ను పొందుపర్చింది. సన్ రూఫ్ ఫీచర్ తో పాటు మరికొన్ని ఫీచర్లను కూడా ఈ ఆల్ట్రోజ్ లో సమకూర్చింది. ఈ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో ఇప్పటివరకు సన్ రూప్ ఫీచర్ ఉన్నది హ్యుండై ఐ 20 కి మాత్రమే. అంతేకాదు, ఈ సెగ్మెంట్లో ఈ ఫీచర్ తో తక్కువ ధరకు లభిస్తున్న కారు కూడా టాటా ఆల్ట్రోజ్ నే.

వాయిస్ కమాండ్ ఫీచర్ తో..

హ్యుండై ఐ 20 లో సన్ రూఫ్ ఫీచర్ ను మ్యాన్యువల్ గా ఆపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాని టాటా ఆల్ట్రోజ్ లో వాయిస్ కమాండ్ తో ఈ ఫీచర్ ను ఆపరేట్ చేయవచ్చు. స్టీరింగ్ వీల్ పై ఉన్న ఒక బటన్ ను ప్రెస్ చేసిన అనంతరం ఓపెన్ లేదా షట్ అనే కమాండ్స్ తో ఈ సన్ రూఫ్ ను తెరుచుకునేలా లేదా మూసుకుపోయేలా ఆపరేట్ చేయవచ్చు. సన్ రూఫ్ ఫీచర్ తో పాటు టాటా ఆల్ట్రోజ్ లో వైర్ లెస్ చార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్ ఫీచర్లు కూడా రానున్నాయి. వీటిని ఆల్ట్రోజ్ సీఎన్జీ వర్షన్ లో ఇప్పటికే పొందుపర్చారు.

ఏయే మోడల్స్ లో..

స్మాల్ సన్ రూఫ్ ఆప్షన్ ను ప్రస్తుతం అన్ని పవర్ ట్రెయిన్ ఆప్షన్స్ లో అందుబాటులోకి తీసుకువచ్చారు. పెట్రోల్, టర్బో పెట్రోల్ వేరియంట్లలోని ఎక్స్ ఎం ప్లస్, ఎక్స్ ఎంఏ ప్లస్, ఎక్స్ జడ్ ప్లస్, ఎక్స్ జెడ్ఏ ప్లస్ మోడల్స్ లో.. డీజిల్ వర్షన్ లో ఎక్స్ ఎం ప్లస్ ఎస్, ఎక్స్ జడ్ ప్లస్ ఎస్, ఎక్స్ జడ్ ప్లస్ ఎస్ డార్క్ వేరియంట్లలో సన్ రూఫ్ ఆప్షన్ ఉంది. సన్ రూఫ్ ఆప్షన్ ఉన్న టాటా ఆల్ట్రోజ్ వేరియంట్ల ఎక్స్ షో రూమ్ ధర రూ. 7.90 లక్షల నుంచి రూ. 10.74 లక్షల వరకు ఉంది. సన్ రూఫ్ లేని వేరియంట్ల కన్నా సన్ రూఫ్ ఉన్న వేరియంట్ల ధర సుమారు రూ. 45 వేలు ఎక్కువగా ఉంటుంది.

తదుపరి వ్యాసం