Tata Altroz iCNG: టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‍జీ కారు లాంచ్: ధర, స్పెసిఫికేషన్ల వివరాలు ఇవే-tata altroz icng launched check price specs ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Altroz Icng: టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‍జీ కారు లాంచ్: ధర, స్పెసిఫికేషన్ల వివరాలు ఇవే

Tata Altroz iCNG: టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‍జీ కారు లాంచ్: ధర, స్పెసిఫికేషన్ల వివరాలు ఇవే

Chatakonda Krishna Prakash HT Telugu
May 22, 2023 04:30 PM IST

Tata Altroz iCNG: టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‍జీ కారు లాంచ్ అయింది. సన్‍రూఫ్, వైర్లెస్ చార్జింగ్ సహా మరిన్ని నయా ఫీచర్లతో ఈ కారు వచ్చింది.

Tata Altroz iCNG: టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‍జీ కారు లాంచ్: ధర, స్పెసిఫికేషన్ల వివరాలు ఇవే
Tata Altroz iCNG: టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‍జీ కారు లాంచ్: ధర, స్పెసిఫికేషన్ల వివరాలు ఇవే

Tata Altroz iCNG: పాపులర్ ప్రీమియమ్ హ్యాచ్‍బ్యాక్ కారు ‘ఆల్ట్రోజ్’(Altroz)కు సీఎన్‍జీ వెర్షన్‍ను టాటా మోటార్స్ (Tata Motors) తీసుకొచ్చింది. సీఎన్‍జీ(కంప్రెస్జ్ నేచురల్ గ్యాస్)తోనూ నడిచే టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‍జీ(Tata Altroz iCNG)ని భారత మార్కెట్‍లో లాంచ్ చేసింది. డ్యుయల్ సిలిండర్ టెక్నాలజీతో ఈ నయా కారు వచ్చింది. గతంలో టియాగో, టిగోర్ మోడళ్లకు సీఎన్‍జీ వెర్షన్‍ను తీసుకొచ్చిన టాటా మోటార్స్.. ఇప్పుడు ఆల్ట్రోజ్‍కు సీఎన్‍జీ వెర్షన్‍ను అందుబాటులోకి తెచ్చింది. వాయిస్ అసిస్టెడ్ ఎలక్ట్రానిక్ సన్‍రూఫ్, వైర్లెస్ చార్జింగ్, ఎయిర్ ప్యూరిఫయర్ సహా మరిన్ని ఫీచర్లతో ఈ నయా Tata Altroz iCNG కారు వచ్చింది. పూర్తి వివరాలు ఇవే.

వేరియంట్లు, కలర్ ఆప్షన్లు

Tata Altroz iCNG: ఆరు వేరియంట్లలో టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‍జీ కారు లాంచ్ అయింది. XE, XM+, XM+(S), XZ, XZ+(S), XZ+O(S) వేరియంట్లు అందుబాటులోకి వచ్చాయి. ఒపేరా బ్లూ, డౌన్‍టౌన్ రెడ్, అర్కేడ్ గ్రే, అవెన్యూ వైట్ కలర్ ఆప్షన్‍లలో టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‍జీ వచ్చింది.

టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‍జీ ఇంజిన్

Tata Altroz iCNG: 1.2-లీటర్ పెట్రోల్ రెవోట్రోన్ ఇంజిన్‍ను టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‍జీ కారు కలిగిఉంది. 6,000 rpm వద్ద 73.5 పీఎస్ పవర్, 3,500 rpm వద్ద 103 Nm పీక్ టార్క్యూను ఈ ఇంజిన్ జనరేట్ చేస్తుంది. రెండు సీఎన్‍జీ సిలిండర్లను ఈ కారు లగేజ్ ఏరియాలో టాటా మోటార్స్ ఇచ్చింది. దీంతో సాండర్డ్ ఆల్ట్రోజ్‍తో పోలిస్తే ఈ ఐసీఎన్‍జీ వెర్షన్‍లో బూట్ స్పేస్ తక్కువగా ఉంటుంది. Tata Altroz iCNG కారును డైరెక్టుగా సీఎన్‍జీ మోడ్‍లోనే ఆన్ చేసే సదుపాయం ఉంటుంది. పెట్రోల్, సీఎన్‍జీ.. రెండిట్లో దేనితోనైనా ఈ ఆల్ట్రోజ్ ఐసీఎన్‍జీ కారు నడుస్తుంది.

టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‍జీ ఫీచర్లు

Tata Altroz iCNG: ప్రొజెక్టర్ హెడ్‍ల్యాంప్‍లు, ఎల్ఈడీ డీఆర్ఎల్‍లు, ఆర్16 డైమండ్ కట్ అలాయ్ వీల్స్, క్యాబిన్‍లో ఎనిమిది స్పీకర్లు, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‍మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆటో కార్ ప్లే కనెక్టివిటీ సపోర్ట్ ఫీచర్లు టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‍జీ కారుకు ఉంటాయి. ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెనుక ఏసీ వెంట్స్, ఎత్తును అడ్జస్ట్ చేసుకునే వీలుండే డ్రైవర్ సీటు కూడా ఉంటాయి. వాయిస్ అసిస్టెడ్ ఎలక్ట్రానిక్ సన్‍రూఫ్, వైర్లెస్ చార్జర్, ఎయిర్ ప్యూరిఫైర్ లాంటి అధునాతన ఫీచర్లను ఈ టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‍జీ కారు కలిగి ఉంది.

టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‍జీ ధర

Tata Altroz iCNG: టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‍జీ కారు ధరలు రూ.7.55 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి రూ.10.55లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. వేరియంట్లను బట్టి ఈ మధ్య రేట్లు ఉంటాయి. ఒపేరా బ్లూ, డౌన్‍టౌన్ రెడ్, ఆర్కేడ్ గ్రే, అవెన్యూ వైట్ కలర్ ఆప్షన్‍లో టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‍జీ అందుబాటులోకి వచ్చింది.

Whats_app_banner