తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Form 16: జాబ్ చేంజ్ అయ్యారా?.. ఫామ్ 16 కు సంబంధించి ఈ విషయాలు తెలుసుకోండి.

Form 16: జాబ్ చేంజ్ అయ్యారా?.. ఫామ్ 16 కు సంబంధించి ఈ విషయాలు తెలుసుకోండి.

HT Telugu Desk HT Telugu

19 June 2024, 14:00 IST

google News
  • Form 16: మీరు ఒకే ఆర్థిక సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేసినట్లయితే.. ఆ సంవత్సరంలో మీరు పనిచేసిన ప్రతి యజమాని మీకు వేరే వేరే ఫామ్ 16 లు ఇస్తారు. ఆదాయ పన్ను రిటర్నులను సరిగ్గా దాఖలు చేయడానికి ఫారం 16 చాలా అవసరం.

ఫామ్ 16 గురించిన ముఖ్యమైన వివరాలు
ఫామ్ 16 గురించిన ముఖ్యమైన వివరాలు

ఫామ్ 16 గురించిన ముఖ్యమైన వివరాలు

Form 16: ఫామ్ 16 ఆదాయపు పన్ను (Income Tax) ఫైలింగ్ ప్రక్రియలో ఉద్యోగం చేసే వ్యక్తులకు చాలా కీలకమైన డాక్యుమెంట్. ఇందులో వేతన వివరాలు, క్లెయిమ్ చేసిన మినహాయింపులు, ఆర్థిక సంవత్సరం అంతటా యజమాని మూలం వద్ద మినహాయించిన పన్ను (TDS) వంటి సమగ్ర సమాచారం ఉంటుంది. మాన్యువల్ డేటా ఎంట్రీ అవసరాన్ని తొలగించడం ద్వారా ఫైలింగ్ ప్రక్రియను క్రమబద్ధీకరిస్తూ, ఈ డేటా స్వయంచాలకంగా మీ పన్ను రిటర్న్ (ITR) లో ప్రీ ఫిల్డ్ గా వస్తుంది. పామ్ 16 (Form 16) ను రెఫరెన్స్ గా తీసుకోవడం వల్ల పన్ను రిటర్న్ కచ్చితత్వం మెరుగుపడుతుంది. ఇది మీ యజమాని ద్వారా ప్రభుత్వానికి నివేదించబడిన ఆదాయంతో సరిపోలుతుంది

ఉద్యోగం మారితే ఫామ్ 16 ఎలా?

ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 203 ఫామ్ 16 కోసం చట్టబద్ధమైన ఫ్రేమ్ వర్క్ ను ఏర్పాటు చేస్తుంది. దీనిని యజమానులు జారీ చేయాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్ ప్రత్యేకంగా వేతనం ద్వారా పొందిన ఆదాయాన్ని తెలియజేస్తుంది. అయితే, ఆర్థిక సంవత్సరం మొత్తం ఒకే యజమాని వద్ద ఉద్యోగం చేస్తే ఫామ్ 16 (Form 16) విషయంలో ఏ సమస్య ఉండదు. కానీ, ఒక వ్యక్తి ఒక సంవత్సరంలో ఒకటికి మించిన సంస్థల్లో ఉద్యోగం చేస్తే ఎలా?.. అతడు ఫామ్ 16 ను ఏ యజమాని నుంచి పొందాలి? అన్న ప్రశ్నలు తరచుగా తలెత్తుతాయి.

ఒకటికి మించిన ఫామ్ 16 డాక్యుమెంట్స్

ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకటికి మించిన ఉద్యోగాలు చేసినట్లయితే, ఆ ఆర్థిక సంవత్సరంలో మీరు ఉద్యోగం చేసిన కాలానికి సంబంధించిన ఫామ్ 16 ను ఆయా యాజమాన్యాలు మీకు అందిస్తాయి. అవి ఆటోమేటిక్ గా మీ ఐటీఆర్ (ITR)లో ప్రీ ఫిల్డ్ గా కనిపిస్తాయి. అలా లేని పక్షంలో, మ్యాన్యువల్ గా ఆ వివరాలను ఐటీఆర్ లో ఫిల్ చేయాల్సి ఉంటుంది.

ఫామ్ 16 లో పార్ట్ ఏ, పార్ట్ బీ

ఫామ్ 16 లోని ‘పార్ట్ ఏ’ (Form 16 part A) లో ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మీ టీడీఎస్ సమాచారం ఉంటుంది. ‘పార్ట్ బీ’ (Form 16 part B) లో మీ వేతన ఆదాయం, పన్ను మినహాయింపుల సమాచారం ఉంటుంది. పార్ట్ ఏ లో పేర్కొన్న సమాచారాన్ని పార్ట్ బీ విశిదీకరిస్తుంది. అదనంగా, పార్ట్ బీ లో ఆ సంవత్సరంలో మీరు చేసిన ఏదైనా ముందస్తు పన్ను చెల్లింపుల సమాచారం కూడా ఉంటుంది. మీరు ఆర్థిక సంవత్సరంలో బహుళ ఉద్యోగాలు చేసినట్లయితే, పార్ట్ బీ లో వివిధ యజమానుల నుంచి పొందిన ఆదాయ వివరాలను కూడా ప్రత్యేక విభాగాలుగా విభజించవచ్చు.

తదుపరి వ్యాసం