తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : నిఫ్టీ @ ఆల్​ టైమ్​ హై- ఈ స్టాక్స్​ కొంటే భారీ లాభాలు!

Stocks to buy today : నిఫ్టీ @ ఆల్​ టైమ్​ హై- ఈ స్టాక్స్​ కొంటే భారీ లాభాలు!

Sharath Chitturi HT Telugu

04 December 2023, 10:08 IST

google News
    • Stocks to buy today : నిఫ్టీ ఆల్​ టైమ్​ హైని తాకింది. ఈ నేపథ్యంలో ట్రేడర్లు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
నిఫ్టీ @ ఆల్​ టైమ్​ హై- ఈ స్టాక్స్​ కొంటే భారీ లాభాలు!
నిఫ్టీ @ ఆల్​ టైమ్​ హై- ఈ స్టాక్స్​ కొంటే భారీ లాభాలు!

నిఫ్టీ @ ఆల్​ టైమ్​ హై- ఈ స్టాక్స్​ కొంటే భారీ లాభాలు!

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లలో బుల్​ రన్​ కొనసాగుతోంది. సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ సూచీలు.. రికార్డు స్థాయిని తాకాయి. ఉదయం 9 గంటల 45 నిమిషాలకు.. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1000 పాయింట్లు లాభపడి 68,486 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ50.. 290 పాయింట్ల లాభంతో 20,565 వద్ద ట్రేడ్​ అవుతోంది. ఇక 900కుపైగా పాయింట్లు పెరిగి..45,750 వద్ద ట్రేడ్​ అవుతోంది బ్యాంక్​ నిఫ్టీ.

ఆదివారం వెలువడిన 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకెళ్లడం.. స్టాక్​ మార్కెట్​లలో నెలకొన్న సానుకూలతకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇండియా జీడీపీ నెంబర్లు కూడా శక్తివంతంగా రావడంతో, దేశం.. వేగంగా అభివృద్ధి చెందుతోందన్న సంకేతాలు అందడం.. స్టాక్​ మార్కెట్​లకు మరింత ఉత్తేజాన్ని ఇచ్చాయని స్పష్టం చేస్తున్నారు.

లాభాలు.. నష్టాలు..

Nifty all time high : ఎల్​టీ, ఎన్​టీపీ, ఐసీఐసీ బ్యాంక్​, ఎస్​బీఐ, ఎం అండ్​ ఎం, భారతీ ఎయిర్​టెల్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, కొటాక్​ బ్యాంక్​, పవర్​గ్రిడ్​, రిలయెన్స్​ షేర్లు భారీ లాభాలలో కొనసాగుతున్నాయి.

మారుతీ సుజుకీ, నెస్లే, సన్​ఫార్మా షేర్లు స్వల్ప నష్టాల్లో ఉన్నాయి.

స్టాక్స్​ టు బై..

Stocks to buy : పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​:- బై రూ. 80.70, స్టాప్​ లాస్​ రూ. 77.50, టార్గెట్​ రూ. 87

టాటా పవర్​:- బై రూ. 276, స్టాప్​ లాస్​ రూ. 265, టార్గెట్​ రూ. 298

కొటాక్​ మహీంద్రా బ్యాంక్​:- బై రూ. 1750, స్టాప్​ లాస్​ రూ. 1730, టార్గెట్​ రూ. 1780

ICICI bank share price target : ఐసీఐసీఐ బ్యాంక్​:- బై రూ. 947, స్టాప్​ లాస్​ రూ. 938, టార్గెట్​ రూ. 960

క్రాఫ్ట్​మాన్​ ఆటోమోటివేషన్​:- బై రూ. 5090, స్టాప్​ లాస్​ రూ. 4944, టార్గెట్​ రూ. 5,100

ఏషియన్​ పెయింట్స్​:- బై రూ. 3173.40, స్టాప్​ లాస్​ రూ. 3180, టార్గెట్​ రూ. 3300

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

తదుపరి వ్యాసం