Stock market holiday: ఈద్-ఉల్-ఫితర్ కారణంగా నేడు స్టాక్ మార్కెట్ కు సెలవు
11 April 2024, 9:19 IST
Stock market holiday: రంజాన్ పర్వదినం సందర్భంగా ఏప్రిల్ 11, గురువారం స్టాక్ మార్కెట్ కు సెలవు ప్రకటించారు. కమోడిటీ డెరివేటివ్స్ విభాగం కూడా ఉదయం సెషన్లో (ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు) పని చేయదు.
ప్రతీకాత్మక చిత్రం
స్టాక్ మార్కెట్ సెలవు: ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) కోసం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) లకు ఏప్రిల్ 11 న సెలవు ప్రకటించారు. డెరివేటివ్స్, ఈక్విటీలు, ఎస్ఎల్బీలు, కరెన్సీ డెరివేటివ్స్ తో పాటు వడ్డీరేట్ల డెరివేటివ్స్ విభాగంలో కూడా ట్రేడింగ్ ఈ రోజు నిలిచిపోనుంది.
స్టాక్ మార్కెట్ హాలిడే: కమోడిటీ డెరివేటివ్స్ విభాగం
కమోడిటీ డెరివేటివ్స్ విభాగం ఉదయం సెషన్ (ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు) మూసివేసి ఉంటుంది. సాయంత్రం సెషన్ సాయంత్రం 5 గంటల నుండి 11.55 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఏప్రిల్ 12న ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో ట్రేడింగ్ పునఃప్రారంభం కానుంది.
2024 లో ఇతర స్టాక్ మార్కెట్ సెలవులు
మే డే (మే 1), బక్రీద్ (జూన్ 17), మొహర్రం (జూలై 17), స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15), మహాత్మా గాంధీ జన్మదినం (అక్టోబర్ 2), దీపావళి (నవంబర్ 1), గురునానక్ జయంతి (నవంబర్ 15), క్రిస్మస్ (డిసెంబర్ 25) రోజుల్లో కూడా స్టాక్ మార్కెట్ లకు సెలవు ఉంటుంది.
ఏప్రిల్ 10న స్టాక్ మార్కెట్
ఏప్రిల్ 10వ తేదీన నిఫ్టీ సరికొత్త రికార్డు గరిష్టాన్ని తాకడంతో బెంచ్ మార్క్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 354.45 పాయింట్లు లేదా 0.47 శాతం పెరిగి 75,038.15 వద్ద, నిఫ్టీ 111.00 పాయింట్లు లేదా 0.49 శాతం పెరిగి 22,753.80 వద్ద ముగిశాయి. నిఫ్టీలో కోల్ ఇండియా, బీపీసీఎల్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, హిందాల్కో ఇండస్ట్రీస్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. సిప్లా, మారుతీ సుజుకీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, దివీస్ ల్యాబ్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.5 శాతం చొప్పున పెరిగాయి.