SpiceJet Sale: రూ.1,818 నుంచే విమాన టికెట్లు: యానివర్సరీ సందర్భంగా స్పైస్‍జెట్ మరిన్ని ఆఫర్లు: వివరాలివే
23 May 2023, 10:32 IST
- SpiceJet 18th anniversary: 18వ వార్షికోత్సవం సందర్భంగా స్పైస్‍జెట్ కొన్ని ఆఫర్లను ప్రకటించింది. ఆ వివరాలు ఇవే.
SpiceJet Sale: రూ.1,818 నుంచే విమాన టికెట్లు: యానివర్సరీ సందర్భంగా స్పైస్‍జెట్ మరిన్ని ఆఫర్లు: వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
SpiceJet 18th Anniversary Sale : ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‍జెట్ (SpiceJet).. 18వ వార్షికోత్సవం సందర్భంగా ఆఫర్లను ప్రకటించింది. 18వ యానివర్సరీ (SpiceJet 18th Anniversary) సేల్‍ను ప్రారంభించింది. నేటి (మే 23) నుంచి ఈనెల 28వ తేదీ వరకు ఈ సేల్ ఉండనుంది. ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి 2024 మార్చి 30 మధ్య స్పైస్‍జెట్ విమానాల్లో ప్రయాణించేందుకు (Travel Period) ఈ సేల్‍లో డిస్కౌంట్లతో టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ ట్రావెల్ పీరియడ్‍కు ఈ యానివర్సరీ ఆఫర్లు వర్తిస్తాయి. ఈ సేల్‍లో భాగంగా విమాన టికెట్ ధరలు రూ.1,818తో ప్రారంభమవుతాయని స్పైస్‍జెట్ పేర్కొంది. యానివర్సరీ సేల్‍లో ఉండనున్న మరిన్ని ఆఫర్ల గురించి ట్వీట్ చేసింది. వివరాలు ఇవే.
SpiceJet 18th Anniversary Sale : 18వ యానివర్సరీ సేల్‍లో విమాన టికెట్ల ధరలు రూ.1,818తో ప్రారంభమవుతాయని స్పైస్‍జెట్ పేర్కొంది. 2023లో 18 సంవత్సరాల వయసులో అడుగుపెట్టే వారు విమాన టికెట్ బుక్ చేసుకుంటే రూ.3000 విలువైన ఉచిత విమాన వౌచర్ లభిస్తుందని పేర్కొంది. SMAX50 కోడ్‍ను ఉపయోగించుకొని స్పైస్‍మ్యాక్స్ సీట్ల బుకింగ్‍పై 50 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. ఇక ప్రిఫర్డ్ సీట్లను రూ.18కే బుక్ చేసుకోవచ్చని, ఇవి పరిమితంగా అందుబాటులో ఉంటాయని స్పైస్‍జెట్ పేర్కొంది. ఈ ఆఫర్లు మే 23వ తేదీ నుంచి మే 28వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. ఈ సంవత్సరం జూలై 1వ తేదీ నుంచి 2024 మార్చి 30 మధ్య ట్రావెల్ పీరియడ్‍కు ఈ ఆఫర్లు వర్తిస్తాయని స్పైస్‍జెట్ తెలిపింది. బ్లాక్ఔట్ డేట్స్ వర్తిస్తాయని పేర్కొంది. కాగా, టికెట్లు బుక్ చేసుకునే ముందు వినియోగదారులు షరతులను చదవాలి.
SpiceJet 18th Anniversary Sale: స్పైస్ జెట్ వెబ్‍సైట్, మొబైల్ యాప్‍లో యూజర్లు ఈ సేల్ ఆఫర్లు పొందవచ్చని స్పైస్‍జెట్ వెల్లడించింది. రిజర్వేషన్స్, ఎంపిక చేసిన ట్రావెల్ ఏజెంట్ల వద్ద ఈ సేల్ అందుబాటులో ఉంటాయని తెలిపింది.
SpiceJet 18th Anniversary Sale: డొమెస్టిక్ డైరెక్ట్ విమానాలకే ఈ సేల్ ఆఫర్లు వర్తిస్తాయని స్పైస్‍జెట్ తెలిపింది. ముందుగా బుక్ చేసుకున్న వారికి ముందుగా అందించే (first-come, first serve) పద్ధతికి కింద పరిమిత సీట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. గ్రూప్ బుకింగ్‍లు సేల్ ధరకు వర్తించవని పేర్కొంది. సేల్ ధరతో బుక్ చేసుకున్న టికెట్లు క్యాన్సల్ చేసుకున్నా.. క్యాన్సలేషన్ చార్జీలు మినహాయించి మిగిలిన మొత్తం రీఫండ్ అందుతుందని తెలిపింది.