Shriram Finance FD rates:ఫిక్స్ డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు పెంచిన శ్రీరాం ఫైనాన్స్
31 December 2022, 16:25 IST
- Shriram Finance FD rates hike: శ్రీరాం గ్రూప్ నకు చెందిన శ్రీరాం ఫైనాన్స్ లిమిటెడ్ (Shriram Finance Limited SFL) ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ప్రతీకాత్మక చిత్రం (iStock)
ప్రతీకాత్మక చిత్రం
Shriram Finance FD rates hike: భారత్ లోని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ(NBFC)ల్లో ప్రధానమైన శ్రీరాం ఫైనాన్స్ ఎఫ్ డీలపై వడ్డీ రేట్లను పెంచింది. శ్రీరాం ఉన్నతి డిపాజిట్లపై కాలపరిమితి ఆధారంగా 5 నుంచి 30 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేటును పెంచింది.
Shriram Finance FD rates hike: జనవరి 1 నుంచి..
వివిధ శ్రీరాం ఉన్నతి డిపాజిట్లపై కాలపరిమితి ప్రకారం, 0.05% నుంచి 0.30% వరకు వార్షిక వడ్డీ రేటును శ్రీరాం ఫైనాన్స్ పెంచింది. ఈ వడ్డీ రేటు పెంపు జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. కస్టమర్లు అత్యధికంగా 9.30% వరకు వార్షిక వడ్డీని పొందే అవకాశముంది.
Shriram Finance FD rates hike :పెరిగిన వడ్డీ రేట్లు ఇవే..
- సంవత్సరం కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీని 30 బేసిస్ పాయింట్లు పెంచి, వార్షిక వడ్డీ రేటును 7% నుంచి 7.30 శాతానికి పెంచారు.
- 18 నెలల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీని 20 బేసిస్ పాయింట్లు పెంచారు. అంటే, ఆ ఎఫ్ డీలపై వార్షిక వడ్డీ రేటు 7.30% నుంచి 7.50 శాతానికి పెరుగుతుంది.
- 24 నెలల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీని 25 బేసిస్ పాయింట్లు పెంచారు. అంటే, ఆ ఎఫ్ డీలపై వార్షిక వడ్డీ రేటు 7.50% నుంచి 7.75 శాతానికి పెరుగుతుంది.
- 30 నెలల కాల పరిమితి కలిగిన డిపాజిట్లపై ప్రస్తుతం ఉన్న 8% వార్షిక వడ్డీ కొనసాగుతుంది.
- 36 నెలల టెన్యూర్ తో ఉన్న ఎఫ్ డీలపై వార్షిక వడ్డీ 10బేసిస్ పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం ఉన్న 8.05% నుంచి 8.15 శాతానికి వార్షిక వడ్డీ పెరిగింది.
- 42 నెలల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీని 5 బేసిస్ పాయింట్లు పెంచారు. అంటే, ఆ ఎఫ్ డీలపై వార్షిక వడ్డీ రేటు 8.15% నుంచి 8.20 శాతానికి పెరుగుతుంది.
- 48 నెలల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీని 5 బేసిస్ పాయింట్లు పెంచారు. అంటే, ఆ ఎఫ్ డీలపై వార్షిక వడ్డీ రేటు 8.20% నుంచి 8.25 శాతానికి పెరుగుతుంది.
- 60 నెలల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీని 15 బేసిస్ పాయింట్లు పెంచారు. అంటే, ఆ ఎఫ్ డీలపై వార్షిక వడ్డీ రేటు 8.30% నుంచి 8.45 శాతానికి పెరుగుతుంది.
- ఇవి కాకుండా, సీనియర్ సిటిజన్లకు అన్ని డిపాజిట్లపై 0.5% అదనపు వార్షిక వడ్డీ లభిస్తుంది. మహిళలకు అదనంగా, 0.10% వార్షిక వడ్డీ లభిస్తుంది. ప్రతీ రెన్యువల్ కు అదనంగా 0.25% వార్షిక వడ్డీ లభిస్తుంది.
- అంటే, సీనియర్ సిటిజన్ అయిన ఒక మహిళ, తన ఐదేళ్ల కాలపరిమితితో ఉన్న ఎఫ్ డీని రెన్యువల్ చేసుకుంటే, ఆమెకు మొత్తంగా 9.30% (8.45% + 0.10%+ 0.50% + 0.25%) వార్షిక వడ్డీ లభిస్తుంది.
మరిన్ని స్టాక్‌మార్కెట్, కంపెనీల ఫైనాన్షియల్ రిజల్ట్స్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, గాడ్జెట్లు, స్మార్ట్ఫోన్లు, టెక్నాలజీ, గోల్డ్ ప్రైస్ తదితర తాజా వార్తలను చూడండి.