తెలుగు న్యూస్  /  బిజినెస్  /  సెలెక్ట్‌ మొబైల్స్‌ ‘మిషన్‌ ఈ–వేస్ట్‌’.. రూ.10,000 వరకు డిస్కౌంట్‌

సెలెక్ట్‌ మొబైల్స్‌ ‘మిషన్‌ ఈ–వేస్ట్‌’.. రూ.10,000 వరకు డిస్కౌంట్‌

HT Telugu Desk HT Telugu

24 November 2023, 18:30 IST

google News
    • ఎలక్ట్రానిక్‌ వేస్ట్‌ నిర్వహణ, రీసైక్లింగ్‌లో మిషన్‌ ఈ–వేస్ట్‌ పేరుతో వినూత్న కార్యక్రమానికి మల్టీ బ్రాండ్‌ మొబైల్స్‌ రిటైల్‌ చైన్‌ సెలెక్ట్‌ మొబైల్స్‌ శ్రీకారం చుట్టింది.
రహేజ మైండ్ స్పేస్ లో మిషన్ ఈ-వేస్ట్ ను ప్రారంభిస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ IT, E&C శ్రీ జయేష్ రంజన్ IAS, సెలెక్ట్‌ మొబైల్స్‌ సీఎండీ శ్రీ వై.గురు, శ్రీ మురళి రేతినేని (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సెలెక్ట్ మొబైల్స్), శ్రీ సత్య (ప్రెసిడెంట్ TFMC) మరియు శ్రీ శ్రీనివాస్ తాండ్ర (డిప్యూటీ చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్)
రహేజ మైండ్ స్పేస్ లో మిషన్ ఈ-వేస్ట్ ను ప్రారంభిస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ IT, E&C శ్రీ జయేష్ రంజన్ IAS, సెలెక్ట్‌ మొబైల్స్‌ సీఎండీ శ్రీ వై.గురు, శ్రీ మురళి రేతినేని (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సెలెక్ట్ మొబైల్స్), శ్రీ సత్య (ప్రెసిడెంట్ TFMC) మరియు శ్రీ శ్రీనివాస్ తాండ్ర (డిప్యూటీ చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్)

రహేజ మైండ్ స్పేస్ లో మిషన్ ఈ-వేస్ట్ ను ప్రారంభిస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ IT, E&C శ్రీ జయేష్ రంజన్ IAS, సెలెక్ట్‌ మొబైల్స్‌ సీఎండీ శ్రీ వై.గురు, శ్రీ మురళి రేతినేని (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సెలెక్ట్ మొబైల్స్), శ్రీ సత్య (ప్రెసిడెంట్ TFMC) మరియు శ్రీ శ్రీనివాస్ తాండ్ర (డిప్యూటీ చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్)

హైదరాబాద్, నవంబర్ 24: ఎలక్ట్రానిక్‌ వేస్ట్‌ నిర్వహణ, రీసైక్లింగ్‌లో మిషన్‌ ఈ–వేస్ట్‌ పేరుతో వినూత్న కార్యక్రమానికి మల్టీ బ్రాండ్‌ మొబైల్స్‌ రిటైల్‌ చైన్‌ సెలెక్ట్‌ మొబైల్స్‌ శ్రీకారం చుట్టింది. శ్రీ జయేష్ రంజన్ మరియు సెలెక్ట్‌ మొబైల్స్‌ సీఎండీ వై.గురు చేతుల మీదుగా మిషన్‌ ఈ–వేస్ట్‌ను ఐటి కారిడార్ మైండ్ స్పేస్ లో శుక్రవారం ఆవిష్కరించారు. ఆరోగ్యం, పర్యావరణంపై ఈ–వేస్ట్‌ ప్రభావానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటిస్తూ బాధ్యతాయుత పరిష్కారంతో సెలెక్ట్‌ మొబైల్స్‌ ఒక అడుగు ముందుకేసింది.

ఎలా ప్రాసెస్ చేయాలి

  1. ఇందులో భాగంగా కారిడార్ లో ఏర్పాటు చేసిన ఈ వేస్ట్ బిన్ తో పాటు ఒక QR కోడ్ పొందుపరచడం జరుగుతుంది.
  2. ముందుగా ఈ వేస్ట్ బిన్ పై ఉన్న QR కోడ్ ని స్కాన్ చేయవలెను.
  3. స్కాన్ చేసిన వెంటనే మొబైల్ నెంబర్ మరియు వారి పేరును నమోదు చేయవలెను.
  4. వెంటనే మొబైల్ నెంబర్ కు ఒక OTP వస్తుంది.
  5. OTP ఎంటర్ చేసిన తరువాత వెంట తీసుకు వచ్చిన ఈ వేస్ట్ యొక్క వివరాలను నమోదు చేయవలసి ఉంటుంది.
  6. వివరాలు నమోదు చేసిన వెంటనే వర్చ్యువల్ గా రూ.10,000 వరకు విలువ గల డిస్కౌంట్ కూపన్ వస్తుంది.
  7. ఆ డిస్కౌంట్ కూపన్ ను దగ్గరలో ఉన్న సెలెక్ట్ మొబైల్ స్టోర్ కు వెళ్లి ఏదైనా వస్తువు కొనుగోలుపై రిడీమ్ చేసుకోవచ్చు.

మానవాళికి ముప్పు: జయేష్ రంజన్

ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా విచ్చేసిన జయేష్ రంజన్ మాట్లాడుతూ ఎప్పటికప్పుడు పెరుగుతున్న ఎలక్ట్రానిక్స్‌ వినియోగంలో పర్యావరణం, ఆరోగ్యంపై ఈ–వేస్ట్‌ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. సరైన రీతిలో నిర్వహించని ఈ–వేస్ట్‌ గాలి, నీరు, మట్టిని కలుషితం చేస్తున్నాయని. ఇది చర్మ వ్యాధుల నుంచి డీఎన్‌ఏ ఉత్పరివర్తనాల వరకు అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తోందని. ఇందుకు పరిష్కారంగా మిషన్‌ ఈ–వేస్ట్‌కు సెలెక్ట్‌ మొబైల్స్‌ శ్రీకారం చుట్టడం హర్షించదగ్గ విషయం. పరిశుభ్ర వాతావరణాన్ని, జీవన ప్రమాణాలను పెంచే లక్ష్యంతో సేకరించిన ఈ–వేస్ట్‌ను నిబంధనలకు అనుగుణంగా రీసైక్లింగ్‌ చేపట్టాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ–వేస్ట్‌ నిర్వహణ కేవలం పర్యావరణ హితం కోసమే కాదు, ప్రతి భారతీయ పౌరునికి అత్యవసరం అని తెలిపారు.

అంతేకాకుండా పనికిరాని మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, వ్యక్తిగత ఎలక్ట్రానిక్ పరికరాలు, మౌస్, కీబోర్డ్‌ల వంటి పెరిఫెరల్స్‌తో సహా అనేక రకాల ఎలక్ట్రానిక్ పరికరాలను ఈ-వేస్ట్‌గా పరిగణిస్తారు. ఈ పరికరాలను సరైన రీతిలో పడేయకపోతే పర్యావరణ విపత్తు, మానవ ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. వీటితో నేల, నీరు, గాలి కలుషితం అవుతోంది. పీల్చే కాలుష్యాల వల్ల ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. ఈ-వేస్ట్‌లో కనిపించే భారీ లోహాలు నరాలు, జ్ఞానంపైన ప్రభావం చూపిస్తాయి. ఈ-వేస్ట్‌లోని టాక్సిన్స్ గుండెకు ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి, అలాగే వివిధ వ్యాధులకు దారితీయవచ్చు. కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్యాలు, అవయవాలు దెబ్బతినడం, క్యాన్సర్‌కు కూడా దారి తీస్తుంది. హార్మోన్లపై ప్రభావంతో పునరుత్పత్తి, అభివృద్ధి ప్రక్రియలకు అంతరాయం కలిగిస్తుందని ఈ సందర్భంగా జయేష్ రంజన్ వివరించారు.

ఉపయోగించని లేదా సరిగా పని చేయని ఎలక్ట్రానిక్‌ పరికరాలను సరైన రీతిలో నిర్వహించకుండా వాటిని ఇళ్లలోనే అట్టిపెట్టుకుంటున్నారని, ఈ-వేస్ట్ పారవేయడం వల్ల ఉత్పన్నమయ్యే ఆరోగ్య ప్రమాదాలను ఈ సందర్భంగా శ్రీనివాస్ తాండ్ర (డిప్యూటీ చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్) గుర్తు చేశారు. మిషన్ ఈ-వేస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సెలెక్ట్‌ మొబైల్స్‌ చొరవను ప్రశంసించారు. కంపెనీ అంకితభావాన్ని, పెరుగుతున్న ఈ-వేస్ట్‌ సంక్షోభాన్ని పరిష్కరించడంలో వారి ప్రయత్నాల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.

ఐటీ కారిడార్లు, మాల్స్, బస్టాప్‌లు, విమానాశ్రయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు వంటి ప్రజలకు సులువుగా అందుబాటులో ఉండే కీలక ప్రదేశాల్లో వ్యూహాత్మకంగా ఈ-వేస్ట్‌ డబ్బాలను ఏర్పాటు చేసేందుకు సహకరించాలని శ్రీ సత్య (ప్రెసిడెంట్ టీఎఫ్ఎంసీ) ఈ సందర్భంగా కంపెనీని కోరారు. వ్యర్థాల నిర్వహణ పెద్ద సవాల్‌గా మారిందని గుర్తు చేశారు. మానవాళికి అతిపెద్ద సవాల్‌గా పరిణమించిందని ఆందోళన వ్యక్తం చేశారు. శాస్త్రీయంగా ఈ-వేస్ట్‌ను నిర్వహిస్తేనే మనుగడ ఉంటుందని అన్నారు. దేశంలో ఏటా 20 లక్షల టన్నుల ఈ-వేస్ట్‌ పోగవుతోందని మురళి రేతినేని (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సెలెక్ట్ మొబైల్స్) వెల్లడించారు.

మొబైల్స్‌ రిటైల్‌ పరిశ్రమలో రెండున్నర దశాబ్దాల అనుభవం వై.గురు ప్రత్యేకత. ‘దశాబ్దాలుగా తయారీ, పంపిణీ నుంచి సొంతంగా ఓఈఎం బ్రాండ్స్, రిటైల్‌ విభాగాలను స్థాపించడం వరకు ఈ పరిశ్రమలోని ప్రతి అంశంలో మేము నిమగ్నమయ్యాం. ఎన్నో మార్గాల్లో పరిశ్రమ మమ్మల్ని సుసంపన్నం చేసింది. మిషన్‌ ఈ–వేస్ట్‌ ఒక చొరవ కంటే ఎక్కువ. మాకు పునాదిగా ఉన్న పరిశ్రమకు తిరిగి ఇవ్వడానికి ఇది ఒక మార్గం అని భావిస్తున్నాం. మేము ఆరాధించే, ప్రోత్సహించే సాంకేతిక ఆవిష్కరణలు మన పర్యావరణానికి నష్టం కలిగించవని మా నమ్మకం కూడా’ అని వై.గురు ఈ సందర్భంగా అన్నారు.

బాధ్యతాయుతంగా ఈ-వేస్ట్‌ నిర్మూలన దిశగా సెలెక్ట్ మొబైల్స్ ఈ-వేస్ట్‌ రంగంలోని మూడు ప్రముఖ సంస్థలతో కలిసి పనిచేస్తుంది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా సేకరించిన ఈ-వేస్ట్‌ను అత్యంత జాగ్రత్తగా, బాధ్యతతో నిర్వహిస్తారు. తద్వారా పర్యావరణంపై దాని ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తుంది.

తదుపరి వ్యాసం