Streetwind V3 : లాంగ్ డ్రైవ్‌కి వెళుతున్నారా? రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త రైడింగ్ జాకెట్ మీకోసమే!
01 October 2023, 14:30 IST
- Royal Enfield Streetwind V3 jacket : లాంగ్ డ్రైవ్‌కి ప్లాన్ చేస్తున్నారా? బైక్‌తో పాటు ఔట్ఫిట్ కూడా ముఖ్యమే కదా! మీకోసమే కొత్త రైడింగ్ జాకెట్‌ను లాంచ్ చేసింది రాయల్ ఎన్ఫీల్డ్. ఆ వివరాలు..
లాంగ్ డ్రైవ్‌కి వెళుతున్నారా? రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త రైడింగ్ జాకెట్ మీకోసమే!
Royal Enfield Streetwind V3 jacket : మన దేశంలో బైక్ లవర్స్ చాలా మందే ఉన్నారు! మరీ ముఖ్యంగా నచ్చిన బైక్‌లో లాంగ్ డ్రైవ్‌కి వెళ్లి ఆ ఫీల్‌ని ఎంజాయ్ చేయాలని చాలా మంది కలలుకంటారు. ఇలాంటి వారికి ఫస్ట్ చాయిస్.. రాయల్ ఎన్ఫీల్డ్! ఈ ఆటోమొబైల్ సంస్థకు చెందిన రెట్రో బైక్స్‌కు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే.. లాంగ్ డ్రైవ్స్‌కు కేవలం బైక్ ఉంటే సరిపోదు. జర్నీకి తగ్గట్టు రైడింగ్ జాకెట్ కూడా ఉంటేనే మంచి లుక్, ఆ వైబ్స్ వస్తాయి! అందుకే.. రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ రైడింగ్ జాకెట్స్‌ని కూడా లాంచ్ చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా.. సరికొత్త జాకెట్‌ను తీసుకొచ్చింది. దీని పేరు స్ట్రీట్విండ్ వీ3. ఈ జాకెట్ విశేషాలివే..
రాయల్ ఎన్ఫీల్డ్ స్ట్రీట్విండ్ వీ3..
ఈ రాయల్ ఎన్ఫీల్డ్ జాకెట్లో మెషన్ డిజైన్ ఉంటుంది. బరువుతో పాటు ధర కూడా తక్కువే. ఇందులో ఎర్గో ప్రో టెక్ ఆర్మర్ ఉంటుంది. ఇదొక లెవల్ 2 ఆర్మర్. భుజాలు, ఎముకలకు ఈ ఆర్మర్ వస్తుంది. బ్యాక్ ప్రొటెక్టర్కు స్పేస్ కూడా ఉంటుంది. నైట్ రైడ్‌లో విజిబులిటీని పెంచే విధంగా రిఫ్లెక్టివ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి.
ఈ రైడింగ్ జాకెట్‌ను కార్డురా ఫాబ్రిక్‌తో తయారు చేశారు. ఇందులో 90శాతం హై అబ్రెసివ్- రెసిస్టెంట్ పాలిస్టర్, 10శాతం 600డీ పాలిస్టర్లు ఉంటాయి. దీని బరువు 1.17కేజీలు మాత్రమే. చిన్న ల్యాప్‌టాప్ బ్యాగ్‌లో దీనిని పెట్టుకోవచ్చు. ఎక్కువ స్పేస్ కూడా తీసుకోదు! కఫ్స్, వెయిస్ట్, బైసెప్స్, ఫోర్ఆర్మ్స్ వద్ద అడ్జెస్టెబుల్ ట్యాబ్‌లు కూడా వస్తున్నాయి. సన్‌గ్లాస్ లూప్, వెల్క్రో ప్యాచ్, ప్రీ-కర్వ్డ్ ఆర్మ్స్, మెడకు స్నాప్ ఫాస్టెనర్స్ కూడా వస్తుండటంతో.. పర్ఫెక్ట్ రైడింగ్ లుక్ పొందవచ్చు.
ఇదీ చూడండి:- Retro bikes in India : బైక్ నడిపితే ‘రెట్రో’ ఫీల్ రావాలా? ఇవి బెస్ట్..!
ఈ రాయల్ ఎన్ఫీల్డ్ స్ట్రీట్విండ్ వీ3 రైడింగ్ జాకెట్ ధర రూ. 5,950. సంస్థకు చెందిన డీలర్షిప్స్ లేదా అధికారిక వెబ్సైట్లో దీనిని కొనుగోలు చేసుకోవచ్చు.
కొత్త బైక్ వచ్చేస్తోంది..!
దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్.. షార్ట్‌గన్ 650 అనే పేరుతో ఓ కొత్త బైక్‌ను సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ మోడల్‌కు సంబంధించిన కొన్ని వివరాలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి.
ఈ రాయల్ ఎన్ఫీల్డ్ షార్ట్‌గన్ 650.. సూపర్ మీటియర్ 650 కన్నా వెడల్పు తక్కువ, ఎత్తు ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఈ బైక్ పొడవు 2,170ఎంఎం. వెడల్పు 820ఎంఎం. ఎత్తు 1,105ఎంఎంగా ఉంటుందని తెలుస్తోంది. వీల్‌బేస్ వచ్చేసి 1,465గా ఉంటుందని సమచారం. ఈ బైక మొత్తం బరువు 428కేజీలని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.