తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Reliance Foundation Scholarships: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్ షిప్స్ లో అత్యధికం తెలుగు విద్యార్థులకే..

Reliance Foundation Scholarships: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్ షిప్స్ లో అత్యధికం తెలుగు విద్యార్థులకే..

HT Telugu Desk HT Telugu

09 February 2024, 19:11 IST

google News
  • Reliance Foundation Scholarships: రిలయన్స్ ఫౌండేషన్ అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్ షిప్ ల కోసం భారతదేశం నలుమూలల నుండి 58,000 మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 5,000 మంది విద్యార్థులను మెరిట్ కమ్-మీన్స్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేశారు.

రిలయన్స్ ఫౌండేషన్ ఫౌండర్, చైర్ పర్సన్ నీతా అంబానీ
రిలయన్స్ ఫౌండేషన్ ఫౌండర్, చైర్ పర్సన్ నీతా అంబానీ (ANI)

రిలయన్స్ ఫౌండేషన్ ఫౌండర్, చైర్ పర్సన్ నీతా అంబానీ

Reliance Foundation Scholarships: అండర్ గ్రాడ్యుయేట్ (UG) స్కాలర్‌షిప్ 2023-24 ప్రోగ్రామ్ ఫలితాలను రిలయన్స్ ఫౌండేషన్ శుక్రవారం ప్రకటించింది. UG స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌లో మొత్తం 5,000 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. ఈ స్కాలర్ షిప్ కోసం అప్లై చేసుకున్న విద్యార్థులు UG స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్- www.reliancefoundation.org లో చూసుకోవచ్చు.

58 వేల దరఖాస్తులు

5,500 విద్యా సంస్థల్లో చదువుతున్న మొత్తం 58,000 మంది విద్యార్థులు ఈ రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్థులను మెరిట్-కమ్-మీన్స్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేశారు. ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇంకా ప్లస్ 2లో మార్కుల ఆధారంగా సెలెక్షన్ జరిగింది. ఎంపికైన విద్యార్థులలో 75 శాతం మంది వార్షిక కుటుంబ ఆదాయం రూ. 2.5 లక్షల కంటే తక్కువ. ఈ స్కాలర్షిప్ పొందిన విద్యార్థులు రూ .2 లక్షల వరకు గ్రాంటు పొందుతారు.

అత్యధికంగా తెలుగు విద్యార్ధులు

ఈసారి ఎంపికైన విద్యార్థులలో అత్యధికంగా తెలుగు విద్యార్ధులు ఉండటం విశేషం. ఆంధ్ర ప్రదేశ్ నుండి 657 మంది, తెలంగాణా నుండి 348 మంది విద్యార్థులు రిలయన్స్ స్కాలర్‌షిప్ పొందిన వారిలో ఉన్నారు. రిలయన్స్ 1996 నుండి అర్హులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. ఈ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తూ, డిసెంబర్ 2022లో రిలయన్స్ వ్యవస్థాపకుడు-ఛైర్మన్ ధీరూభాయ్ అంబానీ 90వ జన్మదినోత్సవం సందర్భంగా, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ నీతా అంబానీ రాబోయే 10 సంవత్సరాలలో 50,000 స్కాలర్‌షిప్‌లను అందించనున్నట్లు ప్రకటించారు. 2023-24 స్కాలర్‌షిప్ కోసం 5000 మంది విద్యార్థుల పేర్లతో కూడిన ఈ ప్రకటన భారతదేశ భవిష్యత్తును నిర్మించడంలో రిలయన్స్ నిబద్ధతను నొక్కి చెబుతుంది.

48 శాతం విద్యార్థినులు

రిలయన్స్ ఫౌండేషన్ ఇప్పటివరకు 23,136 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను ప్రదానం చేసింది, ఇందులో 48 శాతం విద్యార్థినులు ఉన్నారు. ఇంకా 3,001 మంది దివ్యాంగులైన విద్యార్థులు ఉన్నారు. స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌లో కామర్స్, ఆర్ట్స్, బిజినెస్/మేనేజ్‌మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్, సైన్స్, మెడిసిన్, లా, ఎడ్యుకేషన్, ఇంజినీరింగ్/టెక్నాలజీ, UG డిగ్రీల విద్యార్థులు ఉంటారు. రిలయన్స్ ఫౌండేషన్ UG స్కాలర్‌షిప్‌లు 2023-24 ఫలితాలను చెక్ చేయడానికి, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్- www.reliancefoundation.org ని సందర్శించాలి.

తదుపరి వ్యాసం