తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Realme Narzo N55 Sale: రియల్‍మీ నార్జో ఎన్55 సేల్‍ మొదలు : కొనొచ్చా?

Realme Narzo N55 Sale: రియల్‍మీ నార్జో ఎన్55 సేల్‍ మొదలు : కొనొచ్చా?

18 April 2023, 14:24 IST

google News
    • Realme Narzo N55 Sale: రియల్‍మీ నార్జో ఎన్55 బడ్జెట్ మొబైల్ సేల్ ప్రారంభమైంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఫాస్ట్ చార్జింగ్‍తో ఈ ఫోన్ వచ్చింది.
Realme Narzo N55 Sale: రియల్‍మీ నార్జో ఎన్55 సేల్‍ మొదలు : కొనొచ్చా? (Photo: Realme)
Realme Narzo N55 Sale: రియల్‍మీ నార్జో ఎన్55 సేల్‍ మొదలు : కొనొచ్చా? (Photo: Realme)

Realme Narzo N55 Sale: రియల్‍మీ నార్జో ఎన్55 సేల్‍ మొదలు : కొనొచ్చా? (Photo: Realme)

Realme Narzo N55 Sale: రియల్‍మీ నార్జో ఎన్55 మొబైల్ సేల్‍కు వచ్చేసింది. రియల్‍మీ ఇటీవల లాంచ్ చేసిన ఈ బడ్జెట్ 4జీ ఫోన్ ఓపెన్ సేల్ నేడు (ఏప్రిల్ 18) ప్రారంభం అయింది. ఈ ఫోన్‍కు డిజైన్ ప్రధాన హైలైట్‍గా ఉంది. ఫస్ట్ సేల్ సందర్భంగా బ్యాంక్ కార్డు ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, గ్లాస్ ఫినిష్‍లా ఉండే ఫ్లాషీ బ్యాక్ ప్యానెల్‍ను ఈ రియల్‍మీ నార్జో ఎన్55 కలిగి ఉంది. పూర్తి వివరాలివే..

రియల్‍మీ నార్జో ఎన్55 ధర, సేల్

Realme Narzo N55: 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ ఉన్న రియల్‍మీ నార్జో ఎన్55 ప్రారంభ వేరియంట్ ధర రూ.10,999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ధర రూ.12,999గా ఉంది. ఈ-కామర్స్ సైట్ అమెజాన్ (Amazon), రియల్‍మీ అఫీషియల్ వెబ్‍సైట్ (realme.com), రిటైల్ స్టోర్లలో ఈ మొబైల్ నేటి మధ్యాహ్నం 12 గంటలకు సేల్‍కు వచ్చింది. ప్రైమ్ బ్లూ, ప్రైమ్ బ్లాక్ కలర్లలో రియల్‍మీ నార్జో ఎన్55 అందుబాటులోకి వచ్చింది.

రియల్‍మీ నార్జో ఎన్55 ఆఫర్లు

Realme Narzo N55: అమెజాన్‍లో ఎస్‍బీఐ, హెచ్‍డీఎఫ్‍సీ క్రెడిట్, డెబిట్ కార్డుతో రియల్‍మీ నార్జో ఎన్55 బేస్ వేరియంట్‍ను కొనుగోలు చేస్తే రూ.500 ఆఫర్ పొందవచ్చు. టాప్ వేరియంట్‍పై రూ.1000 తగ్గింపు దక్కించుకోవచ్చు. రియల్‍మీ వెబ్‍సైట్‍లో ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకుల క్రెడిట్ కార్డులపై ఈ ఆఫర్లు వర్తిస్తున్నాయి.

Realme Narzo N55: రెండు టెక్చర్ల కలయికగా ఉండే ప్రిస్మ్ డిజైన్‍తో రియల్‍మీ నార్జో ఎన్55 ఫోన్ బ్యాక్ ప్యానెల్ ఉంది. ఈ ఫోన్ మందం 7.89 మిల్లీమీటర్లుగా ఉంది. దీంతో ఈ మొబైల్ స్లిమ్‍గా ఉంటుంది.

Realme Narzo N55: రియల్‍మీ నార్జో ఎన్55 ఫోన్‍లో మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్ ఉంది. ఈ ఫోన్ వెనుక 64 మెగాపిక్సెల్ ప్రైమరీ, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ కెమెరాలు ఉన్నాయి. 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తోంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‍తో కూడిన 6.72 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ ఐపీఎస్ ఎల్‍సీడీ డిస్‍ప్లేను ఈ ఫోన్ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ రియల్‍మీ యూఐ 4.0తో లాంచ్ అయింది.

Realme Narzo N55: రియల్‍మీ నార్జో ఎన్55 ఫోన్‍లో 5,000mAh బ్యాటరీ ఉంది. 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. 4జీ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్‍బీ టైప్-సీ పోర్టు కనెక్టివిటీ ఫీచర్లుగా ఉన్నాయి. యాపిల్ ఐఫోన్ 14 ప్రో మొబైళ్లలో ఉండే డైనమిక్ ఐల్యాండ్‍ను పోలిన మినీ క్యాప్సుల్ నాచ్ ఫీచర్‌తో ఈ మొబైల్ వచ్చింది.

రియల్‍మీ నార్జో ఎన్55 కొనొచ్చా?

Realme Narzo N55: స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే, రియల్‍మీ నార్జో ఎన్55.. అచ్చం రియల్‍మీ సీ55ను పోలి ఉంది. అయితే నార్జో ఎన్55 డిజైన్ భిన్నంగా ఉంది. డిజైన్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ధరను బట్టి చూస్తే, స్పెసిఫికేషన్లు మెరుగ్గానే ఉన్నాయి. రూ.11వేలలోపు 4జీ ఫోన్‍ను కొనాలనుకుంటున్న వారికి ఈ రియల్‍మీ నార్జో ఎన్55 మంచి ఆప్షన్‍గా ఉంది.

తదుపరి వ్యాసం