తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Realme Narzo N55 : 64 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‍మీ నార్జో ఎన్55 వచ్చేసింది: తక్కువ ధరలోనే!

Realme Narzo N55 : 64 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‍మీ నార్జో ఎన్55 వచ్చేసింది: తక్కువ ధరలోనే!

12 April 2023, 13:32 IST

google News
    • Realme Narzo N55: రియల్‍మీ నార్జో ఎన్55 మొబైల్ లాంచ్ అయింది. మినీ క్యాప్సుల్ ఫీచర్, 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో ఈ ఫోన్ అడుగుపెట్టింది. పూర్తి వివరాలివే.
Realme Narzo N55 : 64 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‍మీ నార్జో ఎన్55 వచ్చేసింది (Photo: Realme)
Realme Narzo N55 : 64 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‍మీ నార్జో ఎన్55 వచ్చేసింది (Photo: Realme)

Realme Narzo N55 : 64 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‍మీ నార్జో ఎన్55 వచ్చేసింది (Photo: Realme)

Realme Narzo N55: నార్జో లైనప్‍లో తొలి ఎన్ సిరీస్ మొబైల్‍గా రియల్‍మీ నార్జో ఎన్55 లాంచ్ అయింది. ఫ్లాషీ డిజైన్ బ్యాక్ ప్యానెల్, ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్‍తో ఈ బడ్జెట్ 4జీ ఫోన్ బుధవారం విడుదలైంది. ఈ మొబైల్ మందం కేవలం 7.89 మిల్లీమీటర్లుగా ఉంది. రియల్‍మీ నార్జో ఎన్55 మొబైల్ వెనుక 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో వచ్చింది. రియల్‍మీ నార్జో ఎన్55 ధర, సేల్, ఆఫర్, పూర్తి స్పెసిఫికేషన్లను ఇక్కడ చూడండి.

రియల్‍మీ నార్జో ఎన్55 ధర, సేల్, ఆఫర్లు

Realme Narzo N55 Price: రియల్‍మీ నార్జో ఎన్55 ఫోన్ రెండు వేరియంట్లలో వచ్చింది. 4జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఉండే బేస్ వేరియంట్ ధర రూ.10,999, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ఉండే టాప్ మోడల్ ధర రూ.12,999గా ఉంది. ఈనెల 18వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ-కామర్స్ ప్లాట్‍ఫామ్ అమెజాన్, రియల్‍మీ వెబ్‍సైట్‍లో ఈ ఫోన్ సేల్‍కు వస్తుంది. రేపు (ఏప్రిల్ 13) మధ్యాహ్నం 12 గంటలకు కొంతసేపు ఫ్లాష్‍ సేల్‍కు Realme Narzo N55 రానుంది. ప్రైమ్ బ్లూ, ప్రైమ్ బ్లాక్ కలర్ ఆప్షన్‍లలో ఈ మొబైల్ లభిస్తుంది.

Realme Narzo N55 Offer: రేపటి ఫ్లాష్ సేల్‍లో రియల్‍మీ నార్జో ఎన్55ను కొనుగోలు చేస్తే కూపన్ ద్వారా రూ.1,000 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఇక ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే బేస్ వేరియంట్‍పై రూ.500, టాప్ వేరియంట్‍పై రూ.1,000 తగ్గింపు దక్కించుకోవచ్చు. కూపన్ ఆఫర్ ఫ్లాష్ సేల్‍లో మాత్రమే ఉంటుందని రియల్‍మీ పేర్కొంది.

రియల్‍మీ నార్జో ఎన్55 స్పెసిఫికేషన్లు

Realme Narzo N55 Specifications: 6.72 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ IPS LCD డిస్‍ప్లేతో రియల్‍మీ నార్జో ఎన్55 ఫోన్ వస్తోంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్(Hz), పీక్ బ్రైట్‍నెస్ 680 నిట్స్‌గా ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 (Android 13) బేస్డ్ రియల్‍మీ యూఐ 4.0 ఆపరేటింగ్ సిస్టమ్‍తో ఈ ఫోన్ అడుగుపెట్టింది.

Realme Narzo N55 ఫోన్‍లో మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసస్ ఉంది. LPDDR4x ర్యామ్‍తో వస్తోంది. ఈ ఫోన్‍లో 5,000mAh బ్యాటరీ ఉంది. 33 వాట్ల సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది.

వెనుక రెండు కెమెరాల సెటప్‍తో Realme Narzo N55 మొబైల్ వచ్చింది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఈ మొబైల్‍కు రియల్‍మీ ఇచ్చింది. డ్యుయల్ సిమ్ 4జీ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్‍బీ టైప్-సీ పోర్టు కనెక్టివిటీ ఫీచర్లుగా ఉన్నాయి. స్పెసిఫికేషన్లను బట్టి చూస్తే, ఈ నార్జో ఎన్55 మొబైల్ దాదాపు రియల్‍మీ సీ55కు దగ్గరగా ఉంది.

తదుపరి వ్యాసం