Realme C55 sale: రియల్‍మీ సీ55 ఫోన్ ఫస్ట్ సేల్ నేడే.. కొనొచ్చా?
28 March 2023, 12:04 IST
Realme C55 sale: రియల్‍మీ సీ55 ఫోన్ నేడు తొలిసారి సేల్‍కు వస్తోంది. బ్యాంక్ కార్డు ఆఫర్ కూడా అందుబాటులో ఉంటుంది. వివరాలివే.
Realme C55 sale: రియల్‍మీ సీ55 ఫోన్ ఫస్ట్ సేల్ నేడే.. కొనొచ్చా? (Photo: Realme)
Realme C55 sale: రియల్‍మీ సీ55 మొబైల్ నేడు (మార్చి 28) తొలిసారి సేల్‍కు రానుంది. నేటి మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ సేల్ మొదలవుతుంది. ఐఫోన్ 14 ప్రో మోడళ్లలో ఉండే డైనమిక్ ఐల్యాండ్‍ను పోలిన ‘మినీ క్యాప్సుల్’ ఫీచర్‌ను ఈ బడ్జెట్ 4జీ ఫోన్ కలిగి ఉంది. 5,000mAh బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు, ఫుల్ హెచ్‍డీ+ డిస్‍ప్లేను కలిగి ఉంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వస్తోంది. ఫస్ట్ సేల్ సందర్భంగా రియల్‍మీ సీ55 కోసం బ్యాంక్ కార్డ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ మొబైల్ గురించిన పూర్తి వివరాలివే.
రియల్‍మీ సీ55 ధర, సేల్, ఆఫర్లు
Realme C55 Price, Sale: రియల్‍మీ సీ55 మూడు వేరియంట్లలో అందుబాటులోకి వస్తోంది. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ ఉంటే బేస్ వేరియంట్ ధర రూ.10,999, 6జీబీ + 64జీబీ ధర రూ.11,999, 8జీబీ + 128జీబీ ధర రూ.13,999గా ఉంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్ (Flipkart), రియల్‍మీ అఫీషియల్ వెబ్‍సైట్ (realme.com)లో నేటి మధ్యాహ్నం 12 గంటలకు ఈ మొబైల్ సేల్ మొదలవుతుంది.
Reame C55 offers: ఫ్లిప్‍కార్ట్ లో హెచ్‍డీఎఫ్‍సీ బ్యాంక్ కార్డులను ఉపయోగించి రియల్‍మీ సీ55 ఫోన్‍ను కొనుగోలు చేస్తే రూ.1,000 వరకు తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. రియల్‍మీ వెబ్‍సైట్‍లో ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులపై ఈ ఆఫర్ వర్తిస్తుంది.
రియల్‍మీ సీ55 స్పెసిఫికేషన్లు
Reame C55 Specifications: 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండే.. 6.72 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ IPS LCD డిస్‍ప్లేను రియల్‍మీ సీ55 ఫోన్ కలిగి ఉంది. మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్‌తో వస్తోంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ రియల్‍మీ యూఐ 4.0పై రన్ అవుతుంది.
రియల్‍మీ సీ55 ఫోన్ వెనుక 64 మెగాపిక్సెల్ ప్రైమరీ, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ మొబైల్‍కు 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను రియల్‍మీ పొందుపరిచింది. డ్యుయల్ సిమ్ 4జీ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్ లాంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి.
రియల్‍మీ సీ55 మొబైల్‍లో 5,000mAh బ్యాటరీ ఉంది. 33 వాట్ల సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ కోసం యూఎస్‍బీ టైప్-సీ పోర్టుఉంటుంది. పవర్ బటన్‍కే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను రియల్‍మీ ఇచ్చింది.
Realme C55: కొనొచ్చా?
5జీ లేకున్నా బడ్జెట్ రేంజ్‍లో మంచి స్పెసిఫికేషన్లతో ఫోన్ కావాలనుకునే వారు రియల్‍మీ సీ55 తీసుకోవచ్చు. 5,000mAh బ్యాటరీ, 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్, 64 మెగాపిక్సెల్ కెమెరా, డిజైన్ ఈ మొబైల్‍కు హైలైట్లుగా ఉన్నాయి. రూ.10,999 ధర ఉన్న బేస్ వేరియంట్‍ను తీసుకుంటే మరింత వాల్యూ ఫర్ మనీగా ఉంటుంది. బ్యాంక్ కార్డ్ ఆఫర్ వినియోగించుకుంటే మరింత తక్కువ ధరకే పొందవచ్చు. తక్కువ ధరలో మంచి 4జీ ఫోన్ కొనాలనుకునే వారికి రియల్‍మీ సీ55 ఒకానొక బెస్ట్ ఆప్షన్‍గా కనిపిస్తోంది.