తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Realme Smart Phones: ఏప్రిల్ 24 న రియల్ మి నుంచి మరో రెండు 5 జీ స్మార్ట్ ఫోన్స్ లాంచ్

Realme smart phones: ఏప్రిల్ 24 న రియల్ మి నుంచి మరో రెండు 5 జీ స్మార్ట్ ఫోన్స్ లాంచ్

HT Telugu Desk HT Telugu

19 April 2024, 19:57 IST

  • Realme smart phones: చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మి నుంచి భారత మార్కెట్లో త్వరలో మరో రెండు స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కానున్నాయి. రియల్ మి సీ65 5జీతో పాటు నార్జో 70ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ ను ఏప్రిల్ 24న లాంచ్ చేయనుంది. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ కు సంబంధించిన వివరాలు ఇక్కడ మీ కోసం..

రియల్ మీ నార్జో 70ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్
రియల్ మీ నార్జో 70ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ (Realme)

రియల్ మీ నార్జో 70ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్

రియల్ మి మరోసారి స్మార్ట్ ఫోన్ లాంచ్ కు సిద్ధమవుతోంది. ఈ సంవత్సరం రియల్ మి ఇప్పటికే ఆరు స్మార్ట్ ఫోన్లను భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది. తాజాగా మరో రెండింటిని లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. నార్జో 70ఎక్స్ 5జీ తో పాటు, ఎంట్రీ లెవల్ రియల్ మి సీ65 5జీ స్మార్ట్ ఫోన్ లు ఏప్రిల్ 24న లాంచ్ కానున్నాయి.

నార్జో 70ఎక్స్ 5జీ ఫీచర్లు ఇవేనా..

రియల్ మీ నార్జో 70ఎక్స్ 5జీ (Realme Narzo 70x 5G) డిజైన్, కెమెరా ఫీచర్లను మీడియా ఇన్విటేషన్స్ ద్వారా రియల్ మీ అందించింది. రియల్ మి నార్జో 70 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ తరహాలోనే ఈ రియల్ మీ నార్జో 70ఎక్స్ 5జీ ఉండబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ లో హాఫ్ మూన్ డిజైన్, సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉన్నాయి. ఈ మోడల్ గతంలోని గ్రీన్ కలర్ తో పాటు పౌడర్ బ్లూ కలర్ లోనూ లభ్యం కానుంది. రియల్ మీ నార్జో 70ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ 45 వాట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుందని, దీని ధర రూ.12,000 లోపు ఉంటుందని రియల్ మీ వెల్లడించింది. ప్రస్తుతం రూ.3 లోపు స్మార్ట్ఫోన్లు మాత్రమే ఉండటం గమనార్హం. రూ. 15000 లోపు కేటగిరీలో ఇప్పటివరకు 45 వాట్ ఛార్జింగ్ ను కేవలం మూడు స్మార్ట్ ఫోన్స్ మాత్రమే అందిస్తున్నాయి.

ఫ్లాట్ డిస్ ప్లే, మ్యాట్ ఫినిష్ బ్యాక్

రియల్ మీ నార్జో 70 ప్రో 5 జీ (Realme Narzo 70x 5G) స్మార్ట్ ఫోన్ లో ఉన్న ఫీచర్స్ అయిన ఫ్లాట్ డిస్ ప్లే , మ్యాట్ ఫినిష్ బ్యాక్, ట్రిపుల్ కెమెరా సెటప్ వంటి కీలక ఫీచర్లు ఈ రియల్ మీ నార్జో 70ఎక్స్ 5జీ లో కూడా ఉండబోతున్నాయి. రియల్ మీ (Realme) భారత్ లో పెద్ద ఎత్తున స్మార్ట్ ఫోన్ లను లాంచ్ చేస్తోంది. ఇప్పటికే ఈ చైనా దిగ్గజ సంస్థ భారత్ లో ఆరు మోడల్స్ ను లాంచ్ చేసింది. ఈ సంవత్సరం ప్రారంభంలో రియల్ మీ 12 ప్రో, రియల్ మీ 12 ప్రో+ లను ప్రవేశపెట్టింది. తరువాత రియల్ మీ 12+ ను, రియల్మీ 12 ఎక్స్, రియల్ మీ నార్జో 70 ప్రో 5 జీ ని లాంచ్ చేసింది. ఇటీవల, రియల్ మీ పీ 1 ను 5 జీ టెక్నాలజీతో పీ సిరీస్ ను ప్రారంభించింది. ఇప్పుడు తాజాగా, ఏప్రిల్ 24న ఈ రియల్ మీ నార్జో 70ఎక్స్ 5జీ ని లాంచ్ చేయబోతోంది.

తదుపరి వ్యాసం