Realme C67 5G: అందుబాటు ధరలో, అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో రియల్ మి సీ 67 5జీ స్మార్ట్ ఫోన్
14 December 2023, 18:48 IST
Realme C67 5G: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్ మి నుంచి లేటెస్ట్ గా సీ 67 మోడల్ మార్కెట్లోకి వచ్చింది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ఎస్ఓసీ చిప్ సెట్ ను అమర్చారు.
రియల్ మి సీ 67
Realme C67 5G: రియల్ మి గురువారం రియల్ మి సీ 67 (Realme C67) 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత్ లో ప్రవేశపెట్టింది. ఇందులో 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీ ఉంది. డస్ట్ అండ్ స్ప్లాష్ ను అడ్డుకునే IP54 రేటింగ్ తో ఇది వస్తోంది. అలాగే, కృత్రిమ మేథను సపోర్ట్ చేసే డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ కూడా ఉంది. ఈ ఫోన్ 5 జీ నెట్ వర్క్ ను సపోర్ట్ చేస్తుంది.
Realme C67 Price: రియల్ మి సీ 67 ధర
Realme C67 5G స్మార్ట్ ఫోన్ డార్క్ పర్పుల్, సన్నీ ఒయాసిస్ కలర్లలో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 4GB + 128GB వేరియంట్ ధర రూ. 13,999 గా, 6GB + 128GB వేరియంట్ ధర రూ. 14,999 గా నిర్ణయించారు. డిసెంబర్ 16 నుండి, వినియోగదారులు ఈ స్మార్ట్‌ఫోన్‌ను దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు. అలాగే, Realme వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌లలో కూడా అదే రోజు నుంచి అందుబాటులో ఉంటుంది. ముందుగా బుక్ చేసుకున్న వినియోగదారులకు రూ. 2వేల వరకు డిస్కౌంట్, ఇతర ప్రయోజనాలు ఉంటాయి. డిసెంబర్ 20 నుంచి ఆన్ లైన్ లో కొనుగోలు చేసిన వారికి రూ. 1500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్స్ అదనం.
Realme C67 5G Specifications: స్పెసిఫికేషన్స్
Realme C67 5G ఫోన్ 6.72-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 680 nits గరిష్ట బ్రైట్ నెస్ ను అందిస్తుంది. ఈ ఫోన్ సన్నీ ఒయాసిస్ డిజైన్ సూర్యరశ్మికి గురైనప్పుడు వెనుక ప్యానెల్ యొక్క ప్రకాశాన్ని పెంచుతుంది. అదనంగా, ఫోన్ మినీ క్యాప్సూల్ 2.0ను కలిగి ఉంది. డిస్‌ప్లేలోని హోల్-పంచ్ కటౌట్ చుట్టూ నోటిఫికేషన్‌లు కనిపిస్తాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 6nm మీడియా టెక్ డైమెన్సిటీ 6100+ ఎస్ఓసీ చిప్ సెట్ ద్వారా పని చేస్తుంది. ఈ ఫోన్ లో 6GB RAM, 128GB స్టోరేజ్ ఫెసిలిటీ ఉంటుంది. RAM కెపాసిటీని వర్చువల్ గా అదనంగా 6GB వరకు పెంచుకోవచ్చు. అదనపు స్టోరేజ్ అవసరాల కోసం, ఫోన్ మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా 2TB వరకు విస్తరించుకోవచ్చు. ఇందులో 50MP మెయిన్ సెన్సార్, 2MP పోర్ట్రెయిట్ షూటర్ కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్ లో 5,000mAh బ్యాటరీ ఉంటుంది. ఇది USB టైప్-C పోర్ట్ ద్వారా 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు వీలు కల్పిస్తుంది. ఈ ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా కేవలం 29 నిమిషాల్లో ఫోన్‌ను సున్నా నుండి 50 శాతానికి వేగంగా ఛార్జ్ చేయగలదు.
టాపిక్