తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Realme 11 Pro Series 5g: 200 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‍మీ నయా ఫోన్ ఇండియాకు వచ్చేస్తోంది: లాంచ్ డేట్ ఫిక్స్

Realme 11 Pro Series 5G: 200 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‍మీ నయా ఫోన్ ఇండియాకు వచ్చేస్తోంది: లాంచ్ డేట్ ఫిక్స్

31 May 2023, 11:37 IST

google News
    • Realme 11 Pro Series 5G India launch: భారత్‍లో రియల్‍మీ 11 ప్రో 5జీ సిరీస్‍ లాంచ్ డేట్‍ను రియల్‍మీ వెల్లడించింది. ఆ వివరాలివే..
Realme 11 Pro Series 5G: 200 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‍మీ ఫోన్ ఇండియాకు వచ్చేస్తోంది: లాంచ్ డేట్ ఫిక్స్ (Photo: Realme)
Realme 11 Pro Series 5G: 200 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‍మీ ఫోన్ ఇండియాకు వచ్చేస్తోంది: లాంచ్ డేట్ ఫిక్స్ (Photo: Realme)

Realme 11 Pro Series 5G: 200 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‍మీ ఫోన్ ఇండియాకు వచ్చేస్తోంది: లాంచ్ డేట్ ఫిక్స్ (Photo: Realme)

Realme 11 Pro Series 5G India launch: ఇండియాకు రియల్‍మీ 11 ప్రో 5జీ సిరీస్‍ను తీసుకొచ్చేందుకు ప్రముఖ బ్రాండ్ రియల్‍మీ రెడీ అయింది. ఈ సిరీస్‍లో రియల్‍మీ 11 ప్రో 5జీ, రియల్‍మీ 11ప్రో+ 5జీ రానున్నాయి. భారత్‍లో ఈ సిరీస్ లాంచ్ డేట్‍ను రియల్‍మీ ఖరారు చేసింది. జూన్ 8వ తేదీన రియల్‍మీ 11 ప్రో 5జీ సిరీస్‍ను ఇండియాలో విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో ఈ సిరీస్ వస్తుందని టీజ్ చేసింది. రియల్‍మీ 11 ప్రో+ ఫోన్‍కు ఈ 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. గత నెల చైనాలో లాంచ్ అయిన ఈ సిరీస్ ఇప్పుడు ఇండియాకు వస్తోంది. వివరాలివే..

రియల్‍మీ 11 ప్రో 5జీ సిరీస్ లాంచ్ వివరాలు

రియల్‍మీ 11 ప్రో 5జీ సిరీస్‍ను జూన్ 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ చేయనున్నట్టు రియల్‍మీ వెల్లడించింది. అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని పోస్ట్ చేసింది. కంపెనీ కొత్త బ్రాండ్ అంబాసిడార్ బాలీ‍వుడ్ హీరో షారూక్ ఖాన్‍తో ఈ ఫోన్ పోస్టర్‌ను పోస్ట్ చేసింది. 200 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుందని టీజ్ చేసింది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్‌లో ఈ రియల్‍మీ 11 ప్రో 5జీ సిరీస్ అందుబాటులో రానుంది. రియల్‍మీ వెబ్‍సైట్‍తో పాటు ఫ్లిప్‍కార్ట్‌లోనూ ఇందుకోసం ప్రత్యేకమైన పేజీని ఏర్పాటు చేసింది రియల్‍మీ.

3డీ ఓవన్ టెక్స్‌చర్, ప్రీమియమ్ లైచీలెదర్‌తో రియల్‍మీ 11 ప్రో సిరీస్ ఫోన్ బ్యాక్ ప్యానెల్స్ డిజైన్ ప్రీమియమ్‍గా ఉంటుందని రియల్‍మీ టీజ్ చేసింది. లాంచ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది ప్రతీ రోజు దశల వారిగా స్పెసిఫికేషన్లను వెల్లడిస్తామని చెప్పింది. జూన్ 8న లాంచ్ ఈవెంట్‍లో ఈ మొబైళ్ల పూర్తి స్పెసిఫికేషన్లు, ధర వివరాలను రియల్‍మీ వెల్లడించనుంది.

ఇప్పటికై చైనాలో విడుదల కావడంతో రియల్‍మీ 11 ప్రో 5జీ, రియల్‍మీ 11 ప్రో+ 5జీ గురించి కొన్ని స్పెసిఫికేషన్లు తెలుస్తున్నాయి. ఈ ఫోన్‍లలో మీడియాటెక్ డైమన్సిటీ 7050 ప్రాసెసర్ ఉండనుంది. 6.7 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ కర్వ్డ్ అమోలెడ్ డిస్‍ప్లేను కలిగి ఉంటాయి. 950 నిట్స్ వరకు పీక్ బ్రైట్‍నెస్ ఉంటుంది.

రియల్‍మీ 11 ప్రో+ 5జీ ఫోన్ వెనుక 200 మెగాపిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు ఉండే అవకాశం ఉంది. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. రియల్‍మీ 11 ప్రో 5జీ వెనుక 100 మెగాపిక్సెల్ ప్రైమరీ, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉండొచ్చు. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వచ్చే అవకాశం ఉంది. ఈ మొబైళ్లలో 4,870mAh బ్యాటరీ ఉండనుంది. ప్రో+ మోడల్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్‍కు, ప్రో మోడల్ 67వాట్ ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తాయి. డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉండే డ్యుయల్ స్టీరియో స్పీకర్లు ఈ రియల్‍మీ 11 ప్రో 5జీ సిరీస్ మొబైళ్లకు ఉంటాయి.

తదుపరి వ్యాసం