తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Kotak Bank: కోటక్ బ్యాంక్ కు ఆర్బీఐ షాక్; కొత్తగా క్రెడిట్ కార్డ్స్ జారీ చేయొద్దని, కొత్త ఖాతాలు ఓపెన్ చేయవద్దని ఆదేశాలు

Kotak Bank: కోటక్ బ్యాంక్ కు ఆర్బీఐ షాక్; కొత్తగా క్రెడిట్ కార్డ్స్ జారీ చేయొద్దని, కొత్త ఖాతాలు ఓపెన్ చేయవద్దని ఆదేశాలు

HT Telugu Desk HT Telugu

24 April 2024, 18:50 IST

google News
  • RBI bars Kotak Bank: భారత్ లోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ల్లో ఒకటైన కొటక్ మహింద్ర బ్యాంక్ కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాక్ ఇచ్చింది. కొత్తగా క్రెడిట్ కార్డ్స్ జారీ చేయొద్దని, కొత్త ఖాతాలు ఓపెన్ చేయవద్దని కొటక్ బ్యాంక్ ను ఆదేశించింది. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

కొటక్ మహింద్ర బ్యాంక్
కొటక్ మహింద్ర బ్యాంక్

కొటక్ మహింద్ర బ్యాంక్

కోటక్ మహీంద్రా బ్యాంక్ తన ఆన్ లైన్, మొబైల్ బ్యాంకింగ్ మార్గాల ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని, అలాగే, కొత్తగా క్రెడిట్ కార్డులను జారీ చేయవద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆదేశించింది. 2022, 2023 సంవత్సరాలలో కొటక్ మహింద్ర బ్యాంక్ ఐటీ వ్యవస్థలో లోపాల కారణంగా ఆర్బీఐ ఈ ఆంక్షలు విధించింది.

ఖాతాదారుల డబ్బు సేఫే..

కొటక్ మహింద్ర బ్యాంక్ ప్రస్తుత కస్టమర్లు ఆర్బీఐ తాజా ఉత్తర్వులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆర్బీఐ ఆంక్షల కారణంగా ఇప్పటికే ఖాతాదారులుగా ఉన్నవారికి ఎలాంటి ఇబ్బంది లేదు. బ్యాంక్ ప్రస్తుత ఖాతాదారులకు వారి వారి ఖాతాలలోని డబ్బు సురక్షితంగానే ఉంటుంది. వారు తమ క్రెడిట్ కార్డు కార్యకలాపాలను కూడా కొనసాగించవచ్చు.

ఆర్బీఐ ప్రకటన

కొటక్ మహీంద్రా బ్యాంక్ పై విధించిన ఆంక్షలను వివరిస్తూ ఆర్బీఐ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో ‘‘బ్యాంక్ తన క్రెడిట్ కార్డు కస్టమర్లతో సహా ప్రస్తుత కస్టమర్లకు సేవలను అందిస్తూనే ఉంటుంది’’ అని పేర్కొంది. కొటక్ బ్యాంక్ ఐటీ ఇన్వెంటరీ మేనేజ్ మెంట్, ప్యాచ్ అండ్ చేంజ్ మేనేజ్ మెంట్, యూజర్ యాక్సెస్ మేనేజ్ మెంట్, వెండర్ రిస్క్ మేనేజ్ మెంట్, డేటా సెక్యూరిటీ, డేటా లీక్ ప్రివెన్షన్ స్ట్రాటజీ, బిజినెస్ కంటిన్యూటీ, డిజాస్టర్ రికవరీ.. తదితర వ్యవస్థల్లో తీవ్రమైన లోపాలను గుర్తించినట్లు ఆర్బీఐ తెలిపింది. సంబంధిత ఆర్బీఐ నిబంధనలను పాటించలేదని వెల్లడించింది.

తదుపరి వ్యాసం