తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Post Office Scheme: పోస్టాఫీస్ నుంచి నెలనెలా రాబడి.. ఎలాంటి రిస్క్ లేకుండా..

Post Office Scheme: పోస్టాఫీస్ నుంచి నెలనెలా రాబడి.. ఎలాంటి రిస్క్ లేకుండా..

18 April 2023, 11:28 IST

    • Post Office Scheme: పెట్టుబడి పెట్టిన మొత్తంపై ప్రతీ నెలా రాబడి కావాలనుకునే వారి కోసం ఓ స్కీమ్‍ను పోస్టాఫీస్‍లు అందిస్తున్నాయి. ఆ వివరాలు ఇవే.
Post Office Scheme: పోస్టాఫీస్ నుంచి నెలనెలా రాబడి.. ఎలాంటి రిస్క్ లేకుండా..
Post Office Scheme: పోస్టాఫీస్ నుంచి నెలనెలా రాబడి.. ఎలాంటి రిస్క్ లేకుండా..

Post Office Scheme: పోస్టాఫీస్ నుంచి నెలనెలా రాబడి.. ఎలాంటి రిస్క్ లేకుండా..

Post Office Scheme: చిన్న మొత్తాల పొదుపు కోసం భారతీయ పోస్ట్ (India Post) చాలా స్కీమ్‍లను ప్రజల కోసం అందుబాటులో ఉంచింది. పోస్టాఫీస్ స్కీమ్‍ల్లో పెట్టుబడి పెడితే ఇన్వెస్ట్‌మెంట్ సురక్షితంగా ఉండటంతో పాటు వడ్డీ రూపంలో రాబడి వస్తుంది. ఇందుకోసం పోస్టాఫీస్‍లు వివిధ రకాల స్కీమ్‍లను అందిస్తున్నాయి. పెట్టిన డబ్బుపై ప్రతీ నెల ఆదాయం కావాలనుకునే వారి కోసం కూడా పోస్టాఫీస్‍లు ఓ స్కీమ్‍ను అందుబాటులో ఉంచింది. అదే పోస్టాఫీస్ మంత్లీ ఇన్‍కమ్ స్కీమ్ (Post Office Monthly Income Scheme - POMIS) అకౌంట్. ఈ ఖాతా ఓపెన్ చేసి పెట్టుబడి పెడితే ఇన్వెస్టర్ ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతీ నెలా రాబడి పొందవచ్చు. వివరాలు ఇవే.

Post Office MIS Account: మంత్లీ స్కిమ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ కింద వ్యక్తిగతంగా లేదా జాయింట్ అకౌంట్ కూడా ఓపెన్ చేయవచ్చు. 10 ఏళ్లలోపు మైనర్ తరఫున గార్డియన్ ఈ ఖాతా తెరవచ్చు. 10 సంవత్సరాల వయసు దాటిన మైనర్లు వారి పేరుపైనే స్కీమ్‍లో ఇన్వెస్ట్ చేయవచ్చు. మీ దగ్గర్లో ఉన్న పోస్టాఫీసులో ఈ MIS ఖాతా తీసుకోవచ్చు.

గరిష్టంగా ఇంత మొత్తం

Post Office Monthly Income Scheme : కనీసం రూ.1,000 నుంచి గరిష్టంగా రూ.9లక్షల వరకు ఈ మంత్లీ ఇన్‍కమ్ స్కీమ్ కింద డిపాజిట్ చేయవచ్చు. అదే జాయింట్ అకౌంట్ అయితే రూ.15లక్షల వరకు జమ చేసుకోవచ్చు. మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి ప్రతీ నెలా మీ పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్‍లో వడ్డీ జమ అవుతుంది. దాన్ని నెలనెలా కూడా విత్‍డ్రా చేసుకోవచ్చు

వడ్డీ రేటు ఎంత!

Post Office Monthly Income Scheme ప్రస్తుతం పోస్టాఫీస్ మంత్లీ ఇన్‍కమ్ స్కీమ్ వార్షిక వడ్డీ రేటు 7.4 శాతంగా ఉంది. ఈ లెక్క ప్రకారం ప్రతీ నెలా ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి వడ్డీ లభిస్తుంది. అంటే ప్రస్తుతం ఈ స్కీమ్ కింద రూ.1లక్ష ఇన్వెస్ట్ చేస్తే సుమారు రూ.610 వరకు రాబడి వస్తుంది. ఈ వడ్డీ రేటును ప్రతీ మూడు నెలలకు ఓ సారి ప్రభుత్వం సవరిస్తుంది. ప్రస్తుతం 7.4 శాతం వడ్డీ రేటు జూన్ 30 వరకు ఉంటుంది. సవరణ సమయంలో అప్పటి పరిస్థితిని బట్టి వడ్డీ రేటును పెంచడమో, తగ్గించడమో లేదా అలాగే కొనసాగించడమో ప్రభుత్వం చేస్తుంది.

ఐదు సంవత్సరాల మెచ్యూరిటీ.. ముందే క్లోజ్ చేస్తే..

Post Office Monthly Income Scheme: POMIS ఖాతా మెచ్యూరిటీ ఐదు సంవత్సరాలుగా ఉంటుంది. డిపాజిట్ చేసిన తేదీ తర్వాతి నెల నుంచి మెచ్యూరిటీ పూర్తయ్యే వరకు ప్రతీనెలా మీ పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాలో వడ్డీ రూపంలో రాబడి జమ అవుతుంది. డిపాజిట్ చేసిన సంవత్సరంలోగా ఈ MIS ఖాతాను క్లోజ్ చేసే అవకాశం ఉండదు. సంవత్సరం నుంచి మూడేళ్లలోగానే మంత్లీ ఇన్‍కమ్ స్కీమ్ అకౌంట్ ప్రీ-మెచ్యూర్ క్లోజ్ చేయాలంటే 2 శాతం డిడక్షన్ ఉంటుంది. మూడు సంవత్సరాల తర్వాత అయితే 1 శాతం ఉంటుంది. ఒకవేళ మెచ్యూరిటీ ముగియక ముందే డిపాజిట్ చేసిన వారు మరణిస్తే నామినీకి ఆ మొత్తం దక్కుతుంది.

తదుపరి వ్యాసం