Small savings schemes: ‘చిన్ని మొత్తాల పొదుపు’పై వడ్డీ పెంపు
08 January 2024, 19:09 IST
Small savings schemes: చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీని పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ వడ్డీ పెంపు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.
ప్రతీకాత్మక చిత్రం
Small savings schemes: చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీని (interest rate hike of Small savings schemes) పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ వడ్డీ పెంపు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. వివిధ పథకాలపై 70 బేసిస్ పాయింట్ల (70 Basis points) వరకు వడ్డీ పెంపు (interest rate hike) ఉంది.
Small savings schemes: ఏయే పథకాలపై..
ఈ వడ్డీ రేటు పెంపు ఉన్న చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (National Savings Certificate), కిసాన్ వికాస్ పత్ర (Kisan Vikas Patra), మంత్లీ ఇన్ కం సేవింగ్స్ స్కీమ్ 9Monthly Income Savings Scheme) లతో పాటు అన్ని పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (post office time deposits) పథకాలు ఉన్నాయి. అయితే, ఈ వడ్డీ రేటు పెంపు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (Public Provident Fund PPF) స్కీమ్ కు వర్తించదు.
Small savings schemes: ఎంత వడ్డీ పెరుగుతుంది?
తాజాగా, కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం వివిధ పొదుపు పథకాలపై 70 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ పెంపు ఉంటుంది. వీటిలో సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (Senior Citizens Savings Scheme) వడ్డీ రేటు 8% నుంచి 8.2% కు పెరిగింది. అలాగే, కిసాన్ వికాస్ పత్ర (Kisan Vikas Patra) పథకం వడ్డీ రేటు 7% నుంచి 7.2 శాతానికి పెరిగింది. మంత్లీ ఇన్ కం సేవింగ్స్ స్కీమ్ 9Monthly Income Savings Scheme) లో పెట్టుబడులపై వడ్డీ రేటును 7.1% నుంచి 7.4% కి పెంచారు.
టాపిక్