EPFO Interest Rate: ఉద్యోగులకు ఊరట: ఈపీఎఫ్ వడ్డీ రేటు పెంపు: వివరాలివే-epfo fixes 8 15 percentage interest rate on employees provident fund for 2022 23 check full details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Epfo Fixes 8 15 Percentage Interest Rate On Employees Provident Fund For 2022 23 Check Full Details

EPFO Interest Rate: ఉద్యోగులకు ఊరట: ఈపీఎఫ్ వడ్డీ రేటు పెంపు: వివరాలివే

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 28, 2023 11:14 AM IST

EPF Interest Rate: ఈ ఆర్థిక సంవత్సరానికి (2022-23) సంబంధించి ఈపీఎఫ్‍పై వడ్డీ రేటును ఈవీఎఫ్‍వో ఖరారు చేసింది. వడ్డీని స్వల్పంగా పెంచింది.

EPF Interest Rate: ఉద్యోగులకు కాస్త ఊరట: 2022-23 ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు!
EPF Interest Rate: ఉద్యోగులకు కాస్త ఊరట: 2022-23 ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు!

EPF Interest Rate: 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (Employees Provident Fund - EPF)పై వడ్డీ రేటును ఈపీఎఫ్‍వో (EPFO) ఖరారు చేసింది. ఉద్యోగుల భవిష్య నిధి(EPF)పై 8.15 శాతం వడ్డీని ఇవ్వాలని నిర్ణయించింది. గతేడాది (8.10 శాతం) కంటే స్వల్పంగా పెంచింది. ఈ విషయాన్ని న్యూస్ ఏజెన్సీ పీటీఐ రిపోర్ట్ వెల్లడించింది. ఈపీఎఫ్‍వో (Employees Provident fund Organization - EPFO) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల (CBT) రెండో రోజు సమావేశం మంగళవారం జరుగుతోంది. ఈ మేరకు ఈపీఎఫ్‍వో బోర్డు వడ్డీ రేటును ఖరారు చేసినట్టు సమాచారం బయటికి వచ్చింది. 2021-22లో 8.5 శాతం నుంచి 8.1 శాతానికి వడ్డీని తగ్గించిన ఈపీఎఫ్‍వో.. మరోసారి తగ్గించకుండా ఉద్యోగులకు కాస్త ఊరటనిచ్చింది. 5 బేసిస్ పాయింట్లు పెంచింది. వివరాలివే..

ట్రెండింగ్ వార్తలు

EPF Interest Rate: 2020-21లో ఈపీఎఫ్‍పై 8.5 శాతం వడ్డీ రేటు ఉండగా.. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను 8.1కు తగ్గించి గతేడాది మార్చిలో షాకిచ్చింది ఈపీఎఫ్‍వో. గత నాలుగు దశాబ్దాల్లో ఇదే అత్వల్ప వడ్డీగా ఉంది. 1977-78లో 8 శాతం ఉండగా.. ఆ తర్వాత గతేడాదే అత్యల్పంగా నిలిచింది.

EPF Interest Rate: “ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అత్యున్నత నిర్ణయాత్మక మండలి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్.. 2022-23కు గాను ఈపీఎఫ్‍పై 8.15 వడ్డీని కల్పించాలని నిర్ణయించారు” అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఈపీఎఫ్‍వో పంపుతుంది. ప్రభుత్వ ఆమోదం తర్వాత ఐదు కోట్లకుపైగా ఉన్న చందాదారుల (ఉద్యోగులు) ఖాతాల్లోకి వడ్డీ మొత్తాన్ని ఈపీఎఫ్‍వో జమ చేస్తుంది. ఈ ప్రక్రియ అంతా జరిగేందుకు 4 నుంచి 6 నెలల వరకు పట్టొచ్చు.

2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్‍పై 8.5 శాతం వడ్డీ రేటును ఈపీఎఫ్‍వో ఇచ్చింది. 2018-19లో ఇది 8.65 శాతంగా ఉండేది.

EPF Interest Rate: 2016-17 ఫైనాన్షియల్ ఇయర్‌లో 8.65 శాతం వడ్డీరేటును ఈపీఎఫ్‍వో కల్పించింది. 2016-15లో 8.55 శాతం, 2015-16లో 8.8 శాతాన్ని ఇచ్చింది. 2013-14 ఆర్థిక సంవత్సరానికి గాను 8.75 శాతం వడ్డీ అమలైంది.

ఈపీఎఫ్‍వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ రెండు రోజుల సమావేశం ఢిల్లీలో సోమవారం ప్రారంభమైంది. నేడు ఈ చర్చలు ముగియననున్నాయి. ఈ నేపథ్యంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వడ్డీ రేటును 8.15 ఖరారు చేసినట్టు సమాచారం బయటికి వచ్చింది. న్యూస్ ఏజెన్సీ పీటీఐ దీన్ని రిపోర్ట్ చేసింది.

2021-22కు సంబంధించిన వడ్డీ మొత్తం గతేడాది నవంబర్‌లో ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాలో జమ అయింది.

WhatsApp channel

టాపిక్