తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Poco C65 Price : బడ్జెట్​ ఫ్రెండ్లీ పోకో సీ65 లాంచ్​.. ధర, ఫీచర్స్​ వివరాలివే!

POCO C65 price : బడ్జెట్​ ఫ్రెండ్లీ పోకో సీ65 లాంచ్​.. ధర, ఫీచర్స్​ వివరాలివే!

Sharath Chitturi HT Telugu

15 December 2023, 13:38 IST

google News
    • POCO C65 price : పోకో సీ65 బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​.. ఇండియాలో లాంచ్​ అయ్యింది. ఈ మొబైల్​ ఫీచర్స్​, ధర వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
బడ్జెట్​ ఫ్రెండ్లీ పోకో సీ65 లాంచ్​.. ధర, ఫీచర్స్​ వివరాలివే!
బడ్జెట్​ ఫ్రెండ్లీ పోకో సీ65 లాంచ్​.. ధర, ఫీచర్స్​ వివరాలివే!

బడ్జెట్​ ఫ్రెండ్లీ పోకో సీ65 లాంచ్​.. ధర, ఫీచర్స్​ వివరాలివే!

POCO C65 price : ఇండియాలోని బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​లో ఉన్న పోటీని మరింత పెంచుతూ.. తాజాగా ఓ గ్యాడ్జెట్​ని లాంచ్​ చేసింది పోకో సంస్థ. ఈ మొబైల్​ పేరు పోకో సీ65. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ ఫీచర్స్​, ధర వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

పోకో సీ65 ఫీచర్స్​ ఇవే..

ఈ పోకో కొత్త స్మార్ట్​ఫోన్​లో వాటర్​డ్రాప్​ నాచ్​ డిజైన్​, సైడ్​ మౌంటెడ్​ ఫింగర్​ప్రింట్​ స్కానర్​, 3.5ఎంఎం హెడ్​ఫోన్​ జాక్​ వంటివి ఉంటాయి. ఇక ఈ గ్యాడ్జెట్​లో.. 90 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.74 ఇంచ్​ హెచ్​డీ+ ఎల్​సీడీ ప్యానెల్​ ఉంటుంది.

POCO C65 flipkart : ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ గ్యాడ్జెట్​లో 50ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ మాక్రో లెన్స్​తో కూడిన డ్యూయెల్​ రేర్​ కెమెరా సెటప్​ ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 8ఎంపీ ఫ్రెంట్​ కెమెరా లభిస్తోంది.

ఈ పోకో సీ65లో మీడియాటెక్​ హీలియో జీ85 ఎస్​ఓసీ ప్రాసెసర్​ ఉంటుంది. 1టీబీ ఎక్స్​ప్యాండెబుల్​ మైక్రోఎస్​డీ స్టోరేజ్​ ఆప్షన్​ కూడా ఉంది. ఈ మొబైల్​.. ఆండ్రాయిడ్​ 13 ఆధారిత ఎంఐయూఐ 14 సాఫ్ట్​వేర్​పై పనిచేస్తుంది. 5,000ఎంఏహెచ్​ బ్యాటరీ, 18వాట్​ వయర్డ్​ ఛార్జింగ్​ సపోర్ట్​ దీనికి లభిస్తుంది.

POCO C65 sale : ఇక ఈ మోడల్​లో 4జీ వోల్ట్​ఈ, డ్యూయెల్​ బ్యాండ్​ వైఫై, బ్లూటూత్​ 5.3, జీపీఎస్​, టైప్​ సీ పోర్ట్​ వంటి కనెక్టివిటీ ఫీచర్స్​ ఉన్నాయి. వీటిని చూస్తుంటే.. ఇది పక్కా బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ అని అర్థమవుతుంది.

పోకో సీ65 ధర ఎంతంటే..

  • Poco C65 price in India : పోకో సీ65 4జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్ వేరియంట్​​ ధర రూ. 8,499గా ఉంది.
  • 6జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 9,499.
  • 8జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 10,999.

మాట్​ బ్లాక్​, పాస్టెల్​ బ్లూ కలర్స్​లో ఈ మొబైల్​ అందుబాటులోకి రానుంది. డిసెంబర్​ 18న ఫ్లిప్​కార్ట్​లో సేల్​ మొదలవుతుంది. హెచ్​డీఎఫ్​సీ/ ఐసీఐసీఐ క్రెడిట్​- డెబిట్​ కార్డ్​ ట్రాన్సాక్షన్స్​పై రూ. 1000 డిస్కౌంట్​ కూడా లభిస్తుండటం విశేషం.

తదుపరి వ్యాసం