తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Chatgpt In Google Play Store: గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ యాప్; ఇన్ స్టాల్ చేసుకోండి ఇలా..

ChatGPT in Google Play Store: గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ యాప్; ఇన్ స్టాల్ చేసుకోండి ఇలా..

HT Telugu Desk HT Telugu

26 July 2023, 17:59 IST

  • ChatGPT is in Google Play Store: కృత్రిమ మేథ (AI) ఆధారిత చాట్ బోట్ ‘‘చాట్ జీపీటీ (ChatGPT)’’ ఇక గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉండనుంది. ఆండ్రాయిడ్ యూజర్లు ఇకపై తమ ఫోన్లలో చాట్ జీపీటీని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఓపెన్ఏఐ (OpenAI) సంస్థ ఈ చాట్ జీపీటీని రూపొందించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (REUTERS)

ప్రతీకాత్మక చిత్రం

ChatGPT is in Google Play Store: కృత్రిమ మేథ (AI) ఆధారిత చాట్ బాట్ ‘‘చాట్ జీపీటీ (ChatGPT)’’ ఇక గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉండనుంది. ఆండ్రాయిడ్ యూజర్లు ఇకపై తమ ఫోన్లలో చాట్ జీపీటీని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఓపెన్ఏఐ (OpenAI) సంస్థ ఈ చాట్ జీపీటీ (ChatGPT) ని రూపొందించింది.

ట్రెండింగ్ వార్తలు

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

చాట్ జీపీటీ సంచలనం

ఇటీవలి కాలంలో అత్యంత సంచలనం సృష్టించిన, విప్లవాత్మక టెక్ ఆవిష్కరణ చాట్ జీపీటీ (ChatGPT). కృత్రిమ మేథ (AI) ఆధారిత చాట్ బాట్ ఇది. ఈ చాట్ జీపీటీ వ్యక్తుల దైనందిన, వృత్తిగత, ప్రవృత్తిగత కార్యకలాపాలను అత్యంత సులభతరం చేసింది. ఉద్యోగులకు, విద్యార్థులకు, కళాకారులకు విశ్వసనీయ నేస్తంగా మారింది. 2022 నవంబర్ లో అమెరికాలోని సాన్ ఫ్రాన్సిస్కోలో సామ్ ఆల్టమన్ కు చెందిన ఓపెన్ఏఐ (OpenAI) సంస్థ చాట్ జీపీటీ (ChatGPT) ని ఆవిష్కరించింది. నాటి నుంచి ఈ చాట్ జీపీటీ సంచలనాలు సృష్టిస్తూనే ఉంది.. ఈ చాట్ జీపీటీ ఎంత పాపులర్ అయిందంటే.. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి టెక్ దిగ్గజాలన్నీ తమ సొంత చాట్ బాట్ లను రూపొందించడం ప్రారంభించాయి.

గూగుల్ ప్లే స్టోర్ లో..

లేటెస్ట్ గా ఈ చాట్ జీపీటీని ఓపెన్ ఏఐ (OpenAI) గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store) లో అందుబాటులో ఉంచింది. ముందుగా, అమెరికా, ఇండియా, బంగ్లాదేశ్, బ్రెజిల్ దేశాల్లో ఇది అందుబాటులో ఉంటుందని ఓపెన్ ఐఏ ప్రకటించింది. అంటే, ఆ దేశాల్లోని ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లు తమ ఫోన్లలో ఈ ఓపెన్ ఏఐ చాట్ జీపీటీని డౌన్ లోడ్ చేసుకుని, ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. దశల వారీగా ఇతర దేశాల్లోనూ ఈ ఆండ్రాయిడ్ చాట్ జీపీటీ వర్షన్ ను అందుబాటులోకి తీసుకువస్తామని ఓపెన్ ఏఐ ప్రకటించింది. 2023, మే నెలలో ఐ ఫోన్ లలో ఈ సదుపాయాన్ని కల్పించింది.

డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా?

ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లోని ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే ఈ చాట్ జీపీటీ అందుబాటులో ఉంది. ఇకపై అమెరికా, ఇండియా, బంగ్లాదేశ్, బ్రెజిల్ దేశాల్లోని ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా ఇది అందుబాటులో ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ చాట్ జీపీటీని డౌన్ లోడ్ చేసుకోవడం కోసం ముందుగా..

  • ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో ఉన్న గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store) ను ఓపెన్ చేయాలి.
  • సెర్చ్ బాక్స్ లో చాట్ జీపీటీ అని టైప్ చేయాలి.
  • ఓపెన్ ఏఐ రూపొందించిన చాట్ జీపీటీని సెలెక్ట్ చేసుకోవాలి. గూగుల్ ప్లే స్టోర్ లో వేరే కంపెనీలు రూపొందించిన నకిలీ చాట్ జీపీటీలు చాలా ఉన్నాయి. అందువల్ల కేవలం ఓపెన్ ఏఐ (OpenAI) రూపొందించిన చాట్ జీపీటీనే సెలెక్ట్ చేసుకోవాలి.
  • ఆ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని, ఇన్ స్టాల్ చేసుకోవాలి.

తదుపరి వ్యాసం