ChatGPT: అకౌంటింగ్ పరీక్షలో చాట్ జీపీటీ పూర్ పెర్ఫార్మెన్స్-77 percent vs 47 percent at us university students trump chatgpt in accounting exam ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Chatgpt: అకౌంటింగ్ పరీక్షలో చాట్ జీపీటీ పూర్ పెర్ఫార్మెన్స్

ChatGPT: అకౌంటింగ్ పరీక్షలో చాట్ జీపీటీ పూర్ పెర్ఫార్మెన్స్

HT Telugu Desk HT Telugu
Apr 22, 2023 08:00 PM IST

ChatGPT: తాజా విప్లవంగా అంతా అభివర్ణిస్తున్న చాట్ జీపీటీ (ChatGPT) ఒక అకౌంటింగ్ పరీక్షలో విద్యార్థుల కన్నా తక్కువ మార్కులు సాధించడం సంచలనంగా మారింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ChatGPT poor performance: కృత్రిమ మేథ (AI) తో పని చేసే చాట్ బాట్ చాట్ జీపీటీ (ChatGPT) పని తీరును ఇటీవల అమెరికాలోని బ్రిగం యంగ్ యూనివర్సిటీ (Brigham Young University BYU) పరిశోధకులు పరిశీలించారు. వారి పరిశీలనలో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. చాట్ జీపీటీ (ChatGPT) అన్నిట్లో అద్భుతమైన ఫలితాలను సాధిస్తుందనడం ఇప్పటికైతే అతిశయోక్తే అని వారి పరిశోధన ద్వారా తేలింది. చాట్ జీపీటీ ని ఒపెన్ ఏఐ (OpenAI) సంస్థ రూపొందించిన విషయం తెలిసిందే.

ChatGPT poor performance: 47% వర్సెస్ 77%

చాట్ జీపీటీ సామర్ధ్యాన్ని పరీక్షించడానికి బ్రిగం యంగ్ యూనివర్సిటీ (Brigham Young University BYU) పరిశోధకులు.. అకౌంటింగ్ కు సంబంధించిన పరీక్షను చాట్ జీపీటీకి, విద్యార్థులకు వేరు వేరుగా నిర్వహించారు. ఈ పరీక్షలో కొన్ని సబ్జెక్టుల్లో చాట్ జీపీటీ (ChatGPT) అద్భుతమైన ఫలితాలను సాధించగా, కొన్ని సబ్జెక్టుల్లో అతి తక్కువ మార్కులను సాధించింది. పలు సబ్జెక్టుల్లో చాట్ జీపీటీ (ChatGPT) కన్నా యూనివర్సిటీ విద్యార్థులు మెరుగైన ఫలితాలను సాధించారు. విద్యార్థులు ఓవరాల్ గా 76.7% సగటుతో మార్కులు సాధించగా, చాట్ జీపీటీ (ChatGPT) చాలా తక్కువగా 47.4% సగటు మార్కులను సాధించింది. అయితే, అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (accounting information systems AIS), ఆడిటింగ్ (auditing) సబ్జెక్టుల్లో చాట్ జీపీటీ మెరుగైన మార్కులు సాధించింది. కానీ, టాక్స్, ఫైనాన్షియల్, మేనేజీరియల్ అసెస్ మెంట్ (tax, financial, and managerial assessments) లలో మాత్రం అత్యంత దారుణమైన మార్కులు పొందింది. ఈ విషయాలను ‘ఇష్యూస్ ఇన్ అకౌంటింగ్ ఎడ్యుకేషన్(Issues in Accounting Education)’ జర్నల్ లో ప్రచురించారు. అయితే, ఇప్పటికీ చాట్ జీపీటీ (ChatGPT) ని విప్లవాత్మక ఆవిష్కరణగానే భావించాల్సి ఉంటుంది.

Other observations : మరికొన్ని వివరాలు..

  • తప్పు లేదా ఒప్పు (true/false questions) ప్రశ్నల్లో, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ (multiple-choice questions)లో చాట్ జీపీటీ (ChatGPT) మంచి మార్కులు సాధించింది.
  • షార్ట్ ఆన్సర్ ప్రశ్నలు, విశ్లేషణాత్మక ప్రశ్నల విషయంలో చాట్ జీపీటీ (ChatGPT) తడబడింది.
  • గణితంలో సులువైన ప్రశ్నలకు కూడా తప్పు సమాధానాలు ఇచ్చింది. తీసివేతకు బదులుగా కూడడం, తప్పుగా డివిజన్ చేయడం వంటి తప్పులు చేసింది.

Whats_app_banner