OnePlus Nord CE 4 sale: భారత్ లో వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 సేల్ ప్రారంభం; ధర, ఆఫర్స్ వివరాలు ఇవే
04 April 2024, 18:33 IST
వన్ ప్లస్ అభిమానులకు శుభవార్త. వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 స్మార్ట్ ఫోన్ సేల్ ఏప్రిల్ 4వ తేదీన ఇండియాలో ప్రారంభమైంది. ఫీచర్లు, ధర నుంచి ఆఫర్ల వరకు అన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 స్మార్ట్ ఫోన్
OnePlus Nord CE 4 sale: వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 సేల్ భారత్ లో ఏప్రిల్ 4న ప్రారంభమైంది. మిడ్ రేంజ్ సెగ్మెంట్లో గత ఏడాది లాంచ్ అయిన వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 అనంతరం ఈ OnePlus Nord CE 4 స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చారు. వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 లో 120 హెర్ట్జ్ అమోఎల్ఈడీ డిస్ ప్లే , క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ఎస్ఓసీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ప్రత్యేకతలున్నాయి. నేటి నుంచి సేల్ ప్రారంభం కానుండటంతో దీని ధర, ఆఫర్లు, ఇతర వివరాలు తెలుసుకోండి.
భారతదేశంలో వన్ ప్లస్ నార్డ్ సీఈ 4
భారతదేశంలో వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 (OnePlus Nord CE 4) 8 జీబీ ర్యామ్ తో రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. అవి 8 జీబీ ర్యామ్, 128 జీబీ, 8 జీబీ ర్యామ్ 256 జీబీ. 8 జీబీ ర్యామ్ , 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999 కాగా, 8 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999గా ఉంది.
వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 2 ఆర్ ఉచితం
వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 (OnePlus Nord CE 4) ను కొనుగోలు చేసిన వారికి రూ. 2199 విలువైన వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 2 ఆర్ (OnePlus Nord Buds 2r) ఉచితంగా లభిస్తుంది. అంతేకాకుండా రూ.2500 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. ఎక్స్చేంజ్ బోనస్ ఎక్స్చేంజ్ చేస్తున్న పాత స్మార్ట్ ఫోన్ మోడల్, కండిషన్ పై ఆధారపడి ఉంటుంది. కొనుగోలుదారులు మొత్తం ధరను ఒకేసారి చెల్లించడానికి ఇష్టపడకపోతే, వారు 6 నెలల నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ ను కూడా సద్వినియోగం చేసుకోవచ్చు.
వన్ప్లస్ నార్డ్ సీఈ 4 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
వన్ ప్లస్ నార్డ్ సీఈ 4లో 6.7 అంగుళాల ఎఫ్ హెచ్ డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లే , 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్, 8 జీబీ LPDDR4X ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది.
50 ఎంపీ మెయిన్ కెమెరా సెటప్
వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 (OnePlus Nord CE 4) లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సెటప్ 50 మెగా పిక్సెల్ కాగా, ముందువైపు 16 మెగా పిక్సెల్ సెల్ఫీ షూటర్ కూడా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 100 వాట్ సూపర్ వోక్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది.