OnePlus: వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 ఫోన్ స్పెసిఫికేషన్లు లీక్.. ఎప్పుడు లాంచ్ అవొచ్చంటే!
03 March 2023, 13:35 IST
- OnePlus Nord CE 3: వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 మొబైల్‍కు సంబంధించిన స్పెసిఫికేషన్లు లీకయ్యాయి. అమోలెడ్ డిస్‍ప్లే, 5జీ కనెక్టివిటీతో ఈ ఫోన్ వస్తుందని తెలుస్తోంది.
OnePlus: వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 ఫోన్ స్పెసిఫికేషన్లు లీక్ (Photo Credits: OnLeaks)
OnePlus Nord CE 3: మిడ్ రేంజ్‍లో వన్‍ప్లస్ నార్డ్ ఫోన్లు ఎంతో పాపులర్. గతేడాది వచ్చిన నార్డ్ సీఈ 2 ఇండియా మార్కెట్‍లో సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ (OnePlus Nord CE 3 5G) రానుంది. ఈ మొబైల్‍ను వన్‍ప్లస్ రూపొందిస్తోంది. అయితే తాజాగా ఈ నార్డ్ సీఈ 3 ఫోన్‍కు సంబంధించిన స్పెసిఫికేషన్లు లీకయ్యాయి. లాంచ్ టైమ్ లైన్ కూడా బయటికి వచ్చింది. లీక్‍స్టర్ ఆన్‍లీక్స్ ద్వారా OnePlus Nord CE 3 మొబైల్ స్పెసిఫికేషన్లు బయటికి పచ్చాయి. వివరాలివే..
వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 టైమ్ లైన్
OnePlus Nord CE 3: వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 మొబైల్ ఈ ఏడాది జూలైలో లాంచ్ అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. దీంతో పాటు వన్‍ప్లస్ నార్డ్ 3 కూడా అదే సమయంలో విడుదల కావొచ్చు. వన్‍ప్లస్ నార్డ్ సీఈ 2 5జీకి ఈ నార్డ్ సీఈ 3 సక్సెసర్‌గా రానుంది. దీని స్పెసిఫికేషన్లు తాజాగా లీకయ్యాయి.
వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లీకైన స్పెసిఫికేషన్లు
OnePlus Nord CE 3 Expected Specifications: మై స్మార్ట్ ప్రైజ్ భాగస్వామ్యంతో పాపులర్ టిప్‍స్టర్ ఆన్‍లీక్స్ ఈ వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ ఫోన్ స్పెసిఫికేషన్లను లీక్ చేసింది. 6.72 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ అమోలెడ్ డిస్‍ప్లేతో నార్డ్ సీఈ 3 వస్తుందని పేర్కొంది. స్నాప్‍డ్రాగన్ 782జీ 5జీ ప్రాసెసర్ ఈ మొబైల్‍లో ఉంటుందని అంచనా. గరిష్ఠంగా 256జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఉంటుందని సమాచారం. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఆక్సిజన్ఓఎస్ 13తో ఈ మొబైల్ అడుగుపెడుతుంది.
OnePlus Nord CE 3: వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ మొబైల్ వెనుక మూడు కెమెరాలు ఉంటాయని లీక్ ద్వారా వెల్లడైంది. 50 మెగాపిక్సెల్ Sony IMX890 ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉంటాయని తెలుస్తోంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను నార్డ్ సీఈ 3 ఫోన్‍కు వన్‍ప్లస్ పొందుపరుస్తుందని అంచనా.
వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 ఫోన్‍లో 5,000mAh బ్యాటరీ ఉంటుందని సమాచారం వెల్లడైంది. 80 వాట్ల సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్‍కు ఈ ఫోన్ సపోర్ట్ చేయవచ్చు. 5జీ, 4జీ ఎల్‍టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, యూఎస్‍బీ టైప్-సీ పోర్టు కనెక్టివిటీ ఆప్షన్లుగా ఉంటాయి.
OnePlus Nord CE 3: వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 మొబైల్ ప్రారంభ ధర రూ.25వేల నుంచి రూ.28వేల మధ్య ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి నార్డ్ సీఈ 3 గురించి అధికారికంగా వన్‍ప్లస్ ప్రకటించలేదు. లీక్‍ల ద్వారా ఈ స్పెసిఫికేషన్లు బయటికి వచ్చాయి.
కాగా, వన్‍ప్లస్ 11 5జీ ఫ్లాగ్‍షిప్ ఫోన్ గత నెల ఇండియాలో లాంచ్ అయింది. అన్ని విభాగాల్లో ఇది ప్రీమియమ్ స్పెసిఫికేషన్లను కలిగి ఉంది.