OnePlus 11 5G launched: వన్‍ప్లస్ 11 5జీ వచ్చేసింది.. ఫ్లాగ్‍షిప్ స్పెసిఫికేషన్లతో: ధర ఎంతంటే!-oneplus 11 5g launched in india check price specifications features launch offers details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Oneplus 11 5g Launched In India Check Price Specifications Features Launch Offers Details

OnePlus 11 5G launched: వన్‍ప్లస్ 11 5జీ వచ్చేసింది.. ఫ్లాగ్‍షిప్ స్పెసిఫికేషన్లతో: ధర ఎంతంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 07, 2023 08:56 PM IST

OnePlus 11 5G launched in India: వన్‍ప్లస్ 11 5జీ ఫ్లాగ్‍షిప్ ఫోన్ ఇండియాలో విడుదలైంది. డిస్‍ప్లే, కెమెరాలు సహా అన్ని విభాగాల్లో ప్రీమియమ్ స్పెసిఫికేషన్లతో ఈ మొబైల్ వచ్చింది.

OnePlus 11 5G launched:వన్‍ప్లస్ 11 5జీ వచ్చేసింది (Photo: OnePlus)
OnePlus 11 5G launched:వన్‍ప్లస్ 11 5జీ వచ్చేసింది (Photo: OnePlus)

OnePlus 11 5G launched in India: వన్‍ప్లస్ నయా ప్రీమియమ్ స్మార్ట్ ఫోన్ ఇండియాకు వచ్చేసింది. వన్‍ప్లస్ 11 5జీ ఫోన్ ఇండియాలో నేడు (ఫిబ్రవరి 7) లాంచ్ అయింది. క్లౌడ్ 11 ఈవెంట్ ద్వారా ఈ ఫోన్ విడుదలైంది. 2కే రెజల్యూషన్ అమోలెడ్ డిస్‍ప్లే, హాసెల్‍బ్లాడ్ ప్రీమియమ్ కెమెరాలు, శక్తివంతమైన స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో వన్‍ప్లస్ 11 5జీ వస్తోంది. అన్ని విభాగాల్లోనూ ఫ్లాగ్‍షిప్ స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. 100 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. OnePlus 11 5G స్పెసిఫికేషన్లు, ధర, సేల్ వివరాలు ఇక్కడ చూడండి.

ట్రెండింగ్ వార్తలు

పవర్‌ఫుల్ ప్రాసెసర్, నాలుగు ఓఎస్ అప్‍డేట్లు

OnePlus 11 5G: శక్తివంతమైన క్వాల్కామ్ స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌పై వన్‍ప్లస్ 11 5జీ రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 13.0తో అందుబాటులోకి వచ్చింది. ఈ మొబైల్‍కు నాలుగు ఓఎస్ అప్‍డేట్లు ఇవ్వనున్నట్టు వన్‍ప్లస్ పేర్కొంది. అంటే ఆండ్రాయిడ్ 17 వరకు అప్‍డేట్లు వస్తాయి. ఐదు సంవత్సరాల సెక్యూరిటీ అప్‍డేట్లను ఈ ఫోన్ అందుకుంటుంది.

క్వాడ్ హెచ్‍డీ+ రెజల్యూషన్ డిస్‍ప్లే..

OnePlus 11 5G: 6.7 ఇంచుల 2కే క్వాడ్ హెచ్‍డీ+ ఫ్లుయిడ్ అమోలెడ్ డిస్‍ప్లేతో వన్‍ప్లస్ 11 5జీ మొబైల్ వస్తోంది. 120 హెర్ట్జ్ (Hz) అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఎల్‍టీపీవో 3.0 టెక్నాలజీ ఉంటుంది. 1300 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్, HDR10+, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. డిస్‍ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విస్టస్ ప్రొటెక్షన్ ను ఇచ్చింది వన్‍ప్లస్.

ఫ్లాగ్‍షిప్ లెన్స్

OnePlus 11 5G: హాసెల్‍బ్లాడ్ ప్రీమియమ్ కెమెరాలను వన్‍ప్లస్ 11 5జీ కలిగి ఉంది. వెనుక మూడు కెమెరాల సెటప్‍తో ఈ మొబైల్ వస్తోంది. 50 మెగాపిక్సెల్ Sony IMX890 ప్రైమరీ కెమెరాగా ఉంటుంది. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉంటుంది. 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 32 మెగాపిక్సెల్ పోట్రయిట్ కెమెరా కూడా వెనుక ఉంటాయి. 16 మెగాపిక్సెల్ Sony IMX471 ఫ్రంట్ కెమెరాను ఈ ఫోన్‍కు OnePlus ఇచ్చింది.

బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

OnePlus 11 5G: 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వన్‍ప్లస్ 11 5జీ వస్తోంది. 100 వాట్ల సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్‍ సపోర్ట్ ఉంటుంది. 5జీ, 4జీ ఎల్‍టీఈ, వైఫై 7, బ్లూటూత్ 5.3, NFC, GPS కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. డ్యుయల్ స్టీరియో స్పీకర్లతో ఈ ఫోన్ వస్తోంది. డాల్బీ ఆట్మోస్‍కు ఈ OnePlus 11 5G సపోర్ట్ చేస్తుంది.

వన్‍ప్లస్ 11 5జీ ధర, సేల్

OnePlus 11 5G Price in India: వన్‍‍ప్లస్ 11 5జీ రెండు వేరియంట్లలో ఇండియాలో విడుదలైంది.

  • 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర: రూ.56,999
  • 16జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర: రూ.61,999

OnePlus 11 5G Sale date in India: వన్‍ప్లస్ 11 5జీ ప్రీ-ఆర్డర్లు నేడే మొదలయ్యాయి. వన్‍ప్లస్ వెబ్‍సైట్‍, ఈ-కామర్స్ సైట్ అమెజాన్‍లో ప్రీ-బుక్ చేసుకోవచ్చు. ఈనెల 14వ తేదీన వన్‍ప్లస్ వెబ్‍సైట్, అమెజాన్‍తో పాటు ఆఫ్‍లైన్ స్టోర్లలోనూ వన్‍ప్లస్ 11 5జీ ఓపెన్ సేల్‍కు వస్తుంది. ఎటర్నల్ గ్రీన్, బ్లాక్ కలర్లలో OnePlus 11 5G లభిస్తుంది.

WhatsApp channel